"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, February 28, 2006

తెలుగు 'హోదా'కి ఏం తక్కువ?

గతంలో ఎన్నడూ చర్చకురాని విశేషాలు పలువురు అధ్యయనవేత్తల సమక్షంలో రెండురోజుల గోష్టిలో వెలికివచ్చాయి. పాతిక మంది పైచిలుకు పరిశోధకులు తమ పత్రాలు సమర్పించి అపురూపమైన అంశాల్ని తెలియచెప్పారు. తెలుగు ప్రాచీన భాష హోదా పొందటానికి చూపించాల్సిన సాక్ష్యాలు, రుజువులతో పాటు ఇప్పుడు అమలులో ఉన్న నిబంధనలపై కార్యాచరణ కూడా చర్చకు వచ్చింది. మన రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు మనసారా సంకల్పిస్తే 'తెలుగు హోదా' పెరగటం సులువైన విషయమే అని తేటతెల్లం అయింది. అత్యంత ప్రాచీనమైన భాషలుగా ప్రపంచం అంతా చెప్పుకొన్న గ్రీకు, లాటిన్‌, హిబ్రూలలో తెలుగు మాటలు శబ్ధాలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయం చర్చా వేదిక వెల్లడించింది. ఈ వేదికలో పాల్గొన్న అధ్యయనవేత్తలు వెల్లడించిన అంశాలు వారి మాటల్లోనే ...

క్రీస్తూ పుర్వం 4వ శతాబ్దిలోని రచనలు, మెగస్తనీస్‌ ప్రశస్తిలో త్రికలింగ భాష ఉంది. మెసపటోమియా తవ్వకాల్లో బయల్పడ్డ మట్టి పెళ్లలపై తెలుగు అక్షరాలు ఉన్నాయి. మన ఊళ్ల పేర్లను పరిశీలిస్తే 5000 ఏళ్ల పూర్వమే తెలుగు పలుకుల జాడ ఖాయంగా ఉందని తెలుస్తోంది.
-డాక్టర్‌ వి.వి. కృష్ణశాస్త్రి (చరిత్ర నిపుణుడు)

భాషలకు గుర్తింపు, హోదా ఇదంతా ఇప్పుడు రాజకీయ వ్యవహారం అయిపోయింది. తమిళానికి ప్రాచీన హోదా వెనుక మోతాదు మించిన తమిళుల భాషాభిమానం, ఆపాదించుకున్న గొప్పతనమే కనిపిస్తున్నాయి. నిజానికి భావ వ్యక్తీకరణ, అభివ్యక్తిలో అన్నిభాషల కన్నా తెలుగుకు చేవ ఎక్కువ... తమిళం కన్నా కచ్చితంగా ఎక్కువ.
-ఆచార్య ఆర్‌.వి.ఎస్‌.సుందరం

నదీ తీర ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారి నుంచే భాష పుడుతుంది. మనలో జంటపదాల వాడుక చాలా ఎక్కువ త్రిలింగం, కళింగం, అంగయ వంగ, వంక-లంకల వంటివి పరిశీలిస్తే మన మాట వైభవం తెలుస్తుంది. అద్దంకి- పోరంకి, వీరావంక- చంద్రవంక, గోదావరి, కృష్ణ వంటి మాటలను పరిశీలించి చూస్తే వేల ఏళ్ల తెలుగు జాడలు కనిపిస్తాయి.
-డాక్టర్‌ పి.వి. పరబ్రహ్మశాస్త్రి

తమిళులు తమ భాషకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. మన వాళ్లు ఆ దిశగా ఆలోచించటం లేదు. ప్రకృతిలోని అందాలకి మన వాళ్లు పెట్టుకున్నా పేర్లు ఇంకెవ్వరికీ లేవు. సముద్రతీరంలోని బెస్తలు, యానాదులలో అచ్చ తెలుగు పుష్కలంగా ఉంది. సంస్క­ృతం తెచ్చిపెట్టుకున్నా, తెలుగుపుస్తకాల భాష కన్నా ఎంతో ముందు జానుతెనుగు పాట ఉంది. మన తెలుగుకు ఎంత వెతికితే అంత గొప్పతనం ఉంది.
-కత్తి పద్మారావు

తెలుగు భాషకు నెత్తురు మరకలు ఉన్నాయి. పాలకులు- పాలితుల భాషల్లోని తేడాలు తెలుసుకోవాలి. మన భాషకు 'టాస్క్‌ఫోర్స్‌' బలం తేవాలి. అన్ని రంగాలు, విభాగాల్లో తెలుగు వాడుక ఉద్యమంలా రావాలి. మన భాష మన మాధ్యమం కావాలి. తెలుగుభాషా వికాసం కోసం చైతన్యవంతమైన స్పందన వెల్లువెత్తాలి.
- జ్వాలాముఖి

భాషా ప్రేమికులందరూ కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఉద్యమాలు రావు. 'నడుస్తున్న చరిత్ర'లో నాలుగేళ్లుగా భాషా ఉద్యమ వ్యాసాలు వస్తున్నాయి. తెలుగు తల్లి జెండా భుజానికి ఎత్తుకుని భాషోద్యమ కార్యకర్తలు జనంలోకి వెళ్లాలి. గాంధీలా అందరిలో కలిసి పోవాలి.
-డాక్టర్‌ సామాల రమేష్‌బాబు

అసలు ప్రాచీనత అంటే ఏమిటి... ఏ భాష అయినా ఉనికిలోకి రావాలంటే మూడు వేల ఏళ్ల నేపథ్యం ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాలు ద్రవిడ భాషా కుటుంబంలోనివే. సోదర, దౌహిత్రంగా గుర్తుంచుకోవాలి. నిన్నటి భాష తరవాతి తరానికి కొత్తగా 'జన్మ' ఇస్తుంది. భాషల విషయంలో ప్రజాస్వామిక దృక్పథం ఆలోచనలు పెరగాలి.
-ఆచార్య జి. ఉమామహేశ్వరరావు

తెలుగు తనం పెంచే పేర్లు ప్రచారం కావాలి. సినిమా కళాకారులు ఇంగ్లీషు పేర్లు వాడుకలోకి తెస్తున్నారు. రజనీకాంత్‌, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ వంటివాళ్లు చూపిస్తున్న భాషాభిమానం మనకు స్ఫూర్తి దాయకం కావాలి. మండల కేంద్రాల స్థాయిలో భాషకు సంబంధించిన చర్యలు పెరగాలి. చిత్ర పరిశ్రమలోని వారంతా భాషోద్యమంలో కలిసిరావాలి. ప్రాచీనత కోసం మాత్రమే కాకుండా మన తెలుగు ఆత్మగౌరవం కోసం కలిసికట్టుగా కృషి చేయాలి.
-పలువురి సూచనలు

1957లో గిడుగు వెంకట శేషయ్య రూపొందించిన గ్రామలక్ష్మి వాచకంలో శాస్త్రీయ పద్ధతి ఆదర్శనీయంగా ఉంది. ఇప్పటి తెలుగు వాచకాలు ముద్రిస్తున్న ముద్రాపకులు ఎనిమిది మందిదాకా ఉన్నారు. ఐ.సి.ఎస్‌.సి. సిలబస్‌, తెలుగు భోధన బాధాకరంగా ఉన్నాయి. తెలుగును ఏ ఉపాధ్యాయుడైనా చెప్పవచ్చనే తేలికభావం పాఠశాలల్లో ఉంది. ముందుగా ఇది మారాలి.
-డాక్టర్‌ సి. రామచంద్రరావు, డాక్టర్‌. రెడ్డి శ్యామల

పత్రికల్లో కృతకమైన పదాలు వాడుతున్నారు. టి.వి లలో దారుణమైన సంకర భాష వచ్చేసింది. తెలుగు నుడికారం తగ్గిపోయింది. ఆర్థం తెలియకుండానే పద ప్రయోగాలు చేసేస్తున్నారు. రైతాంగం, విద్యుత్‌కోత, శీతాకాలం, విభావరి వంటి తప్పు ప్రయోగాలు వాడుతున్నామని చాలా మందికి తెలియదు.
-డాక్టర్‌ కాచినేని రామారావు

అచ్చ తెలుగు భాషలో సంగీతం ఉంది. మన మాటలోనే లయ ఉంది. కర్ణాటక సంగీతానికి జీవం పోసిన ఘనత తెలుగు వాగ్గేయకారులదే. 1941 ప్రాంతంలో తమిళ భాషలో కీర్తనలు పాడాలని టైగర్‌ వరదాచారి లాంటివాళ్లు ప్రయత్నించి విఫలమయ్యారు. పద్యం తెలుగుకు మాత్రమే ఉంది. పద్యాన్ని పాడడం కూడా మనలో మాత్రమే ఉంది.
-డాక్టర్‌ మృణాళిని

తెలంగాణలో తెలుగు పలుకుబడి అపారం. వృత్తిపదాలు, ఆయా పరిసరాలకు అనువైన మాండలికాలు పరిశీలించి స్టాటస్‌ పేపర్‌ రూపొందించాలి.
-డాక్టర్‌ ఆశీర్వాదం

జానపద సాహిత్యంలో 'భాష' ఎంతగానో పండింది. స్వరాలు పలికే తీరులో చాలా విశేషాలు ఉన్నాయి. రోకటి పాట, విసుర్రాయి, నలుగు పాటలతో పాటు పండుగల పాటలతో మన భాషా సంపత్తి, వైభవం తెలుస్తుంది. ఒక్క పల్లెలో తిరిగితే చాలు వందల పాటలు వినిపిస్తాయి.
-ఆచార్య భక్తవత్సల రెడ్డి

విజ్ఞాన సర్వస్వాలు భాషలో విప్లవానికి దోహదం చేస్తాయి. మరాఠి, మలయాళం, కన్నడిగులు ఈ రంగంలో ఆదర్శనీయమైన కృషి చేస్తున్నారు. మనం తప్పటడుగులు వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
-ఆచార్య కె. ఆనంద్‌

అరవ దేశంలో, అరవానికి దగ్గరగా ఉన్నవారి మాట్లాడే తెలుగులో చక్కదనం చాలా ఉంది. 500 ఏళ్ల క్రితం నుంచి తమ మాట తీరును ఆపేక్షను పదిలంగా నిలుపు కుంటున్న వారు లక్షలలో ఉన్నారు. తమిళులుగా కనిపించే వారిలో చెదరని తెలుగుతనం ఉంది.
-ఎ.పరిమళ గంధం

నిఘంటువుల అవసరం ఇప్పుడు బాగా ఉంది. మనకు 200 పై చిలుకు ఉన్నాయి. ఎంఎ, ఎంఫిల్‌ వారు కూడా మంచి తెలుగు రాయలేక పోతున్నారు. డిక్షనరీల నిర్మాణం ప్రత్యేక శాస్త్రంగా వికసించింది. శబ్దం పదాలకు అర్థంతో పాటు ఉత్పత్తి సాంస్క­ృతిక నేపథ్యం కూడా తెలియచెబుతాయి.
-డాక్టర్‌ కె. రామాంజనేయులు


గోష్టిలో పాల్గొన్న అందరి అభిప్రాయాలు, అధ్యయనాలతో సమన్వయ సంకలనం వెలువరించ నున్నామని ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ ఆవుల మంజులత వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత అధికారిగా బాధ్యతలు నిర్వహించిన తమిళుడు కాశీపాండ్యన్‌ తెలుగుపై ప్రత్యేక పరిశీలన చేసి ప్రాచీనతకు ప్రామాణికతను నిర్ధారించారు. స్టెర్లింగ్‌ పబ్లిషర్స్‌ వెలువరించిన ఆ రచనను తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తేబోతున్నామని ప్రకటించారు. చాలా జిల్లాల్లో 'భాష'పై ప్రీతి కలవారు తెలుగువిశ్వవిద్యాలయంతో చేయి కలుపుతున్నారని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని వివరించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తెలుగువారంతా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని మామూలు పరిధి దాటి తమ కృషి విస్తరించబోతున్నామని వైస్‌చాన్స్‌లర్‌ హోదాలో డాక్టర్‌ మంజులత తెలియచేస్తున్నారు. అందరం కలిసి మెలిసి తెలుగు భాషా వికాసం, పరిరక్షణ కోసం పని చేద్దామని పెద్దలంతా పిలుపునిస్తున్నారు.

-జిఎల్‌ఎన్‌ మూర్తి

Courtesy: ఆంధ్ర జ్యోతి

Telugu Andhra Pradesh India Indian classical ancient language status demand Andhra Jyothy article Feb 2006 views interview tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, February 25, 2006

'Telugu Task Force('s)' discussions with the central government

కేంద్ర అధికారులతో
'తెలుగు' టాస్క్‌ఫోర్స్‌ చర్చలు
ప్రాచీన హోదాపై ఆశాభావం!

న్యూఢిల్లీ: తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కేలా కృషిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌... శుక్ర, శనివారాల్లో కేంద్రం హోం, సాంస్కృతిక శాఖల సీనియర్‌ అధికారులతో చర్చలు జరిపింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పరిశీలించింది. అధికారులతోచర్చలు జరిపిన అనంతరం టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు వై.లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ... తెలుగుకు ప్రాచీన హోదా దక్కుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే అధికారులతో మాట్లాడిన అంశాలేమిటో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. చర్చల వివరాలతో టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌కు ఒక నివేదికను సమర్పిస్తానన్నారు. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పిస్తే వచ్చే ప్రయోజనాలు, హోదా కల్పనకు అవసరమైన ఆధారాలు, సంబంధిత జీవోల కాపీలను రాష్ట్రానికి చెందిన ఎంపీలందరికీ ఆయన పంపిణీ చేశారు. భాషకు ప్రాచీన హోదా కల్పిస్తే... ప్రాచీన భారతీయ భాషలకు గణనీయసేవలందించిన వారికి ఏటా రెండు అంతర్జాతీయ అవార్డులు దక్కుతాయి. ప్రాచీన భాషపై అధ్యయనానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఒక అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పుతుంది. భాషావేత్తలకు బోధకులుగా అవకాశం దక్కుతుంది.

భాషా డిమాండ్ల పరిశీలనకు కమిటీ
భాషకు ప్రాచీన హోదా కల్పన వంటి అభ్యర్థనలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొంతమంది భాషావేత్తలతో ఒక కమిటీని నియమించింది. కమిటీ సభ్యుల్లో... అన్వితా అబ్ది (జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీ), కె.వి.సుబ్బారావు (ఢిల్లీ వర్సిటీ), ఉదయ నారాయణ్‌ సింగ్‌ (డైరెక్టర్‌, కేంద్ర భాషా సంస్థ), బి.ఎన్‌.పట్నాయక్‌ (రిటైర్డ్‌ ఆంగ్ల ప్రొఫెసర్‌), ప్రొఫెసర్‌ బిహెచ్‌. కృష్ణమూర్తి (హైదరాబాద్‌) ఉన్నారు.

Courtesy: ఈనాడు

తెలుగు భాషకు ప్రాచీన హోదాపై చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆన్‌లైన్‌) : తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడంపై కేంద్ర హోంశాఖ, సాంస్క­ృతిక వ్యవహారాల శాఖకు చెందిన పలువురు అధికారులతో రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడైన డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ విస్త­ృతంగా చర్చలు జరిపారు. ఈ వి షయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చ ర్యలపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింద న్నారు. తాను ఈ విషయాన్ని టాస్క్‌ ఫోర్స్‌ చె ౖర్మన్‌ సత్యనారాయణరావుకు వివరిస్తానని చె ప్పారు. తెలుగుభాషకు 500-2000 సంవత్స రాల చరిత్ర ఉన్నదని, ప్రాచీన హోదాపొందేం దుకు అన్నిఅర్హతలు ఉన్నాయని యార్లగడ్డ శని వారం తనను కలిసిన విలేకరులకు చెప్పారు.

Courtesy: ఆంధ్ర జ్యోతి


Technorati tags: ,

classical language status demand tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Friday, February 24, 2006

Ancient manuscripts collected in Khammam

Friday February 24 2006 12:42 IST

KHAMMAM: Mandal surveyor of Palvancha Sai Krishna has collected an ancient manuscript of శ్రీమద్ భగవతం (Srimadbhagavatham) of 17th century as part of the survey to collect ancient manuscripts from February 20 to 24.

He also collected two manuscripts of the Telugu version of శ్రీ మహాభారత వచన కావ్యం (Sri Mahabharatha Vachana Kavyam) dated 1894 running to 1600 pages. The manuscript contained two books, one from ఆది పర్వం (Adi Parvam) to ఉద్యోగ పర్వం (Udyoga Parvam) and the other book from భీష్మ పర్వం (Bhimsha Pravam) to సౌప్తిక పర్వం (Souptika Parvam).

Saikrishna found the rare treasures at the house of A Venkatadri, after knowing about the find from a relative. He went to their houses and collected the manuscripts, which are part of the Statewide survey to collect ancient manuscripts. "I hope at least now these rare manuscripts would be safeguarded and kept for posterity", he said.

Keeping the books in good shape proved to be an arduous task for Krishna. He tried in vain to keep them with the Satya Sai Baba.

Courtesy: NewIndPress
Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, February 23, 2006

His heart beats for Telugu

HYDERABAD: The next time an official file in English comes back to any Government department in Nizamabad district it would certainly have a stamp marked in Telugu.

"File sent back because not written in Telugu" is the stamp marked on all files sent to the Collector in English. By doing so Collector D. V. Raidu has set in motion a movement to promote Telugu in the day-to-day functioning of Government departments.

"I will not hesitate to send back any file if it is sent in English", Mr. Raidu firmly said after receiving the State-level award for effective implementation of Telugu in official use from Chief Minister Y. S. Rajasekhara Reddy.

Trendsetter

The firm remarks on the file have given enough indication to Government employees working in various departments that the Collector is serious about the implementation of Telugu in official use. It is not surprising that more than 177 offices in the district started strictly enforcing use of Telugu.

Visitors to Government offices in the district are greeted with a signboard in Telugu.

The rubber stamp on files and other correspondence also reflects the use of the rich language. Explanation is sought from officials if they are not using Telugu in their correspondence.

Mr. Raidu told The Hindu that implementation of Telugu at village level was 98 per cent while it was 96 per cent in mandals. From 28 per cent in the district headquarters in 2004 today 80.55 per cent of the work was being done in Telugu.

Courtesy: The Hindu

Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Assembly adopts resolution for Classical Language status for Telugu

ప్రాచీన హోదా ఇవ్వాల్సిందే
అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్‌- న్యూస్‌టుడే
తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి పార్టీలకు అతీతంగా అన్ని పక్షాల మద్దతు లభించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ తీర్మానాన్ని స్వయంగా చదివారు. తెలుగు భాషా విశేషాలను తెలియచేశారు. ''రెండువేల సంవత్సరాల శాసన, సాహిత్య, చారిత్రక ఆధారాలుగల ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలి. దక్షిణాది భాషలలో తమిళంతో సమాన స్థాయిలో తెలుగు భాషా చరిత్ర ఉంది. అనేక సాహిత్య, శాసనాధారాలుగల తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలి'' అంటూ వైఎస్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, ప్రాచీనాధారాల కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా... 15 కోట్లమంది తెలుగు మాట్లాడుతున్నారని చెప్పారు.
Courtesy: ఈనాడు
*****

YSR tables resolution, says Purandareswari is on the job
  • Letter addressed to Arjun Singh in this regard
  • Naidu suggests that all-party team take up the matter with Centre
  • Akbaruddin Owaisi promises to speak in Telugu
HYDERABAD: The Andhra Pradesh Assembly adopted an unanimous resolution on Wednesday urging the Union Government to accord "classical language" status to Telugu as in the case of Tamil.

Tabled by Chief Minister Y. S. Rajasekhara Reddy the resolution was supported by all parties in the House. It said: "Telugu is a classical language with a distinct history of its own over 2,000 years, evident by inscriptions and literature." Dr. Reddy said Union Minister of State for HRD, D. Purandareswari was already working on the matter.

Task force

He announced constitution of a Task Force headed by Cultural Affairs Minister M. Satyanarayana Rao to take all steps to get the classical language status for Telugu. A . B. K. Prasad, Chairman, Official Languages Commission, A. Manjulatha, Vice-Chancellor, Potti Sriramulu Telugu University, and the directors of the Telugu and Hindi Akademis will be its members.

He said he had addressed a letter to Union HRD Minister Arjun Singh and also met him later as soon as the issue was brought to his notice.

Extending his party's full-fledged support for the cause, Leader of the Opposition N. Chandrababu Naidu suggested that an all-party delegation led by the Chief Minister visit New Delhi to highlight the issue. Dr. Reddy responded by saying that he would consider the suggestion if it was favoured by the Task Force.

Numerous evidences

Going by the latest Central order enhancing to 2000 years the minimum antiquity period of a language for declaring it as classical, Dr. Reddy cited numerous evidences making a case for Telugu. They included Itareya Brahmanam of the Rig Veda period (800-600 BC), Ashoka inscriptions of 3rd century BC with references to Andhras, use of Telugu words in spoken Prakrit from 200 BC to 6th century AD, and the Kothur inscription recovered recently in which a Telugu-Prakrit word "Tambaiah danam" was mentioned.

He said Telugu as spoken language stood next to Hindi, being spoken by as many 15 crore people. Mr Naidu, G. Vijayarama Rao (TRS) N. Narasimhaiah (CPI(M), C. Venakat Reddy (CPI), G. Kishen Reddy (BJP), K. Ramulu (Janata) and Mandali Buddha Prasad (Congress) spoke on the same lines.

Members thumped desks when Akbaruddin Owaisi (MIM) said Telugu was as sweet as Urdu and that he would try to speak in Telugu in the next session.

Courtesy: The Hindu

*****
తెలుగుకు ప్రాచీన హోదాపై ... సభ తీర్మాణం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆన్‌లైన్‌): రెండు వేల ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుభాషకు ప్రాచీన భాష హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్రశాసన సభ బుధవారం నాడు తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించేం దుకు అవసరమైన ఆధారాల సమీకరణకు క్రీడలు, సాంస్క­ృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఎంఎస్‌ స త్యనారాయణరావు అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ ను ఏ ర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. టా స్క్‌ ఫోర్స్‌తో పని కాని పక్షంలో ప్రతిపక్షాల సహకారాన్ని తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకు ముందు, తెలుగుకు ప్రాచీనభాష హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలంటూ టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి తిరస్కరించా రు. ఇదే అంశంపై ప్రభుత్వం అధికారిక తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినందున, దీనిపై చర్చ అవసరం లేదని స్పీకర్‌ అన్నారు. తామిచ్చిన వా యిదా తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం ఇ వ్వాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు.

ప్రశ్నోత్త రాలు ముగిసిన వెంటనే తెలుగుకు ప్రాచీనభాష హోదా అంశాన్ని చర్చకు తీసుకోనున్నట్లు స్పీకర్‌ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయిన ప్పటికీ టిడిపి సభ్యులు తమ పట్టు వదలకపోవ డంతో, రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కె.రోశయ్య కల్పించుకొని, వివాదం లేని విషయంపై గొడవచేయడం సరికాదన్నారు. తీర్మా నం ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. భారతదేశంలో హిందీ తరువాత ఎక్కువ జనాభా మాట్లాడే రెండవ పెద్ద భాష తెలుగుభాష అని ముఖ్యమంత్రి చెప్పారు. ఐతరేయ బ్రాహ్మణం నుంచి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోకుడి ధర్మశిలా శాసనం వరకు అ నేక సందర్భాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉందన్నారు. విశాఖ జిల్లాలోని కొత్తూరు లో బయల్పడిన బౌద్ధ యుగం నాటి శాసనంలో ఆనాటి ప్రజల భాషైన తెలుగు ప్రాకృతంలో 'తంబయ్య దానం' అని ప్రస్ఫుటంగా ఉందని చరిత్రకారుల పేర్కొన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

'విశిష్టమైన చరిత్రగల ప్రాచీన భాష (క్లాసికల్‌ లాంగ్వేజ్‌) గా, రెండువేల సంవత్సరాల శాసన, సాహిత్య, చారిత్రక ఆధారాలు గల భాషగా తెలుగును గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది' అని చెబుతూ ఆయన తీర్మాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై వివిధ పార్టీల నేతల స్పందనలు:

చంద్రబాబునాయుడు (టిడిపి): రాజకీయాలకు అతీతంగా తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించడానికి తీర్మానం చేయడంతోనే సరిపుచ్చకుండా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ తీర్మానాన్ని మనఃస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషును ప్రవేశపెట్టడానికి నేను వ్యతిరేకం. కాలేజీ స్థాయిలో కూడా తెలుగును రెండోభాషగా ప్రవేశపెట్టాలి. శాసనసభలో, ప్రభుత్వంలో తెలుగులోనే ఉత్తర్వులు రావాలి.

విజయరామారావు (టిఆర్‌ఎస్‌): గ్లోబలైజేషన్‌ కాలంలో అత్యున్నత వర్గాలు తెలుగు, ఇంగ్లీషు రెండూ నేర్చుకుంటూ ఎదుగుతుంటే, పేదలు మాత్రం తెలుగులోనే చదువుకోవాలా..? తెలుగు మాధ్యమంగా విద్యనభ్యసిస్తే ఉన్నత ప్రమాణాలను అందుకోలేరు.తెలుగుతోపాటు ఇంగ్లీషును సమానస్థాయిలో గుర్తించాలి.

నోముల నర్సింహయ్య(సిపిఎం): రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో తెలుగుభాషను విధిగా ఉపయోగించేలా ముఖ్యమంత్రి ఆదేశిలివ్వాలి. ప్రాచీన భాషగా గుర్తించేందుకు కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తేవాలి. చాడా వెంకటరెడ్డి (సిపిఐ): ప్రభుత్వం ఇంగ్లీషుపై మోజు పెంచుకోవడం సరికాదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ఇటీవల బల్లిపర గ్రా మంలో పర్యటించినప్పుడు వారికి ప్రభుత్వం తరపున ఇంగ్లీషులో వినతి పత్రాలు ఇచ్చారు. ఇది తెలుగును అవమానపరచడమే.

అక్బరుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం): మధురంగా ఉం డే తెలుగుకు తగిన గుర్తింపు లభించడం లేదు. కుతుబ్‌షాహిల కాలంలో తెలుగుకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్రంలో విధిగా తెలుగును అమ లు చేయాలి.

కిషన్‌రెడ్డి (బిజెపి): తెలుగుకు తగిన గుర్తింపునివ్వకుంటే మృతభాషగా మారే ప్రమాదం ఉంది. తెలుగువాళ్లం అయ్యుండి తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాం. ముఖ్యమంత్రి తీర్మానంలో 'క్లాసికల్‌ లాంగ్వేజ్‌' అన్న పదాన్ని తొలగించాలి.

దేవేందర్‌గౌడ్‌ (టిడిపి): తెలుగును ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం తనంతట తాను గుర్తిం చాలి తప్ప మనం సిఫారసు చేసుకోవడం దురదృష్టకరం.

Courtesy: ఆంధ్ర జ్యోతి
tcld2006
Technorati tags: ,

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, February 22, 2006

తెలుగుతల్లికి ముళ్లపూదండ...

రావి కొండలరావు
(రచయిత చలనచిత్ర నటులు)

ద్దరు తెలుగువాళ్లు కలుసుకుంటే, ఏ భాషలో మాట్లాడుకుంటారు? కచ్చితంగా ఇంగ్లీషులో! ఒక తెలుగువాడు తనకు తెలియని తెలుగు ఊరికి వెళ్లి కావలసిన అడ్రసుకోసం ఏ భాషలో అడుగుతాడు? కచ్చితంగా ఇంగ్లీషులో! ఇదీ నేటి మన సంప్రదాయం, పద్ధతీ. తెలుగువాళ్లు తెలుగులో మాట్లాడుకోవడం నామోషీ. కాని, ''మేం తెలుగువాళ్లం, త్యాగరాజు మా వాడు. దేశభాషలందు తెలుగు లెస్స; సుందర తెలింగినిల్‌ పాటసేయ్‌ వోయ్‌- అని పరభాషా కవే అంగీకరించాడు! మన తెలుగును 'ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌' అని మెచ్చుకున్నారు'' అని ఇంకో పక్క బాజా వాయించుకుంటాం. ఇదీ తెలుగువాడి లక్షణమే! నిజంగా మన భాష గొప్పదే. అందుకే ''జాతీయ స్థాయిలో తెలుగును గుర్తించాలి'' అని ఇప్పుడిప్పుడు పెద్దలు మేల్కొంటున్నారు. దానికంటే ముందు, మన ఊరి వాళ్లనీ, ఇంట్లోవాళ్లనీ, గుర్తించమనండి! ముఖ్యంగా పిల్లల చేత, 'డాడీ', 'మమ్మీ' పిలుపులు మానిపించమనండి! అమ్మను అమ్మా అని పిలవమనండి. ఎంత కాన్వెంట్‌ చదువులో గొప్పదనం ఉన్నా అ ఆలూ, ఓనమాలూ నేర్చుకోమనండి. ఊరికే ప్రతిదానికీ చంకలు కొట్టుకుంటూ- ''దేశంలో హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే'' అని ప్రగల్భాలు పలకవద్దని చెప్పమనండి! మనకు భాషను బట్టి రాష్ట్రం వచ్చిన సంగతి మరిచిపోకండి. ఆంధ్ర రాజధాని దగ్గర్నుంచి ఏ తెలుగు ఊళ్లో ఏ ఉత్సవం జరిగినా, ఆహ్వానపత్రాలు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి.. ఏదో అక్కడికి, తెలుగురాని వాళ్లకీ, బ్రిటిష్‌ దొరలకీ పంపిస్తున్నట్టు! ప్రభుత్వ కార్యాలయాల్లో లేఖలన్నీ తెలుగులోనే ఉండాలన్నారు. ఏదీ? అలా అంటే ప్రతి మాటకీ తెలుగు అర్థం రాయమని కాదు. దానికేదో తెలుగురాసి, అర్థం కానివ్వకుండా చేసేకంటే, అలా ఉంచేయడమే క్షేమం కదా! తెలుగు భాష పుట్టినప్పుడు, కొన్ని వస్తువులు పుట్టలేదు. రానురాను వచ్చాయి గనక, ఇంగ్లీషు పేర్లతో వచ్చాయి సబబే. రైలు, బస్సు, సైకిలు లాంటివన్నీ తెలుగులో కలిసిపోయాయి. వాటికి తెలుగు వెతికి- చేంతాడు సమాసాలతో తెలుగురాయడం- అవసరమా? కంప్యూటర్‌ అంటే అర్థం అవుతుందా? ఇంకేదో అంటే అర్థం అవుతుందా? సామాన్యుడికి కూడా అర్థమయ్యే ఇంగ్లీషు మాటలు కొన్ని ఉన్నాయి- రోడ్డు, బెంచి, పెన్సిలు, రబ్బరు లాంటివి. మాట ఇంగ్లీషుదే అయినా తెలుగులో కలిసిపోయినట్టే. ఎన్నెన్ని ఉర్దూ పదాలు, హిందీ, సంస్కృత పదాలూ వచ్చి ఆంధ్రభాషా సముద్రంలో కలవలేదు గనక! రోమన్‌, లాటిన్‌, గ్రీకు పదాలన్నీ కలిస్తేనే కదా ఇంగ్లీషయింది! అంతవరకూ అలా ఉంచండి. ఆ మాటలకు తెలుగు తర్జుమా కోసం తడుముకుంటే తెలుగువాళ్లం అయిపోయినట్టూ తెలుగుభాషను ఉద్ధరిస్తున్నట్టూ కాదు కదా!

భాషను బట్టే సంస్కృతి, సంప్రదాయం! మొదటిది పోవడంతో, తక్కినవీ పోతున్నాయి. ఎక్కడా తెలుగుదనం కనిపించదు, తెలుగు వాసనా కొట్టదు. నేతిబీరకాయలో ఉన్నంత నెయ్యీ మన తెలుగు సినిమాల్లో ఉంది; తెలుగుదనంలోనూ ఉంది. ఏ తెలుగు సినిమాలోనూ అమ్మాయి తెలుగింటి ఆడపడుచులా కనిపించదు. తెలుగు అక్షరాలు పలకదు. తెలుగులో శ, ష, స అని మూడు అక్షరాలున్నాయి. 'పలుకు'లో ఉన్న తేడా ఎవరికీ అక్కర్లేదు. పాడేవాళ్లూ, వార్తలు చదివేవాళ్ళూ, టీవీలో కార్యక్రమాలు వివరించేవాళ్లూ(వీళ్లని 'యాంకర్లు' అనాలిట) తెలుగు పట్టించుకోరు. ఒత్తులు పెట్టరు. లేదంటే ఇక్కడి ఒత్తు అక్కడా, అక్కడి ఒత్తు ఇక్కడా తగిలించేసి భ్రష్టుపట్టిస్తారు. 'తెలుగును తెలుగులా పలికేవాళ్లే లేరా?' అని నెత్తీనోరూ కొట్టుకునేలా చేస్తారు. ప్రతి అక్షరానికీ ఒక 'పలుకు' ఉంది. అది స్పష్టంగా పలికితేనే తెలుగు.. తేనె తెలుగూ తేట తెలుగూ.

తెలుగు భాషను నిర్మించిన మహా పండితులు మూర్ఖులా! ఋ, రు, రెండెందుకు పెట్టారని ఈసడిస్తున్నాం. 'ఋ'ని లాగేశాం. బండిర అనే'ఱ'ని లాగేశాం! ఋకి, రుకి పలుకులో ఎంత తేడా ఉంది! 'శుభ్రత'కీ సుబ్రహ్మణ్యానికీ ఉన్నంత తేడా ఉంది. 'ఱ' పలకడానికీ, 'ర'ని పలకడానికీ తేడా లేదూ? ఇవన్నీ తెలుగు భాష పలుకులు! తెలుగు పలుకులు! ఐనా, ఈ పలుకులు, అక్షరాల మాటకేం- ముందు తెలుగులో చక్కగా మాట్లాడమనండి! రాష్ట్ర ప్రభుత్వంవారు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు తెలుగును గుర్తించమని- అక్కర్లేదు, ముందు మన ఇళ్లలోని తల్లిదండ్రుల్ని గుర్తించమనండి! ''మా పిల్లవాళ్లకు తెలుగు రాదు సుమండీ, రాయడం అసలు రాదు'' అని గొప్పలు చెప్పుకొనే తెలుగువాళ్ల చేత, తమ భాషను గుర్తించేలా చెయ్యండి. లేకపోతే, ఇందాక చెప్పుకున్నట్టు- ''దేశంలో హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే'' అన్నది- తారుమారై ''దేశంలో అతి తక్కువమంది మాట్లాడే భాష తెలుగు భాష'' అని చెప్పుకొనే పరిస్థితి రాక తప్పదు.

Courtesy: ఈనాడు
Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Tuesday, February 21, 2006

'అమ్మ'భాషలో అందరూ

తెలుగులోనే ప్రశ్నించిన రాయపాటి
స్పీకర్‌ అభ్యంతరం
న్యూఢిల్లీ- న్యూస్‌టుడే



యితే ఆంగ్లం... కాకపోతే హిందీ... ఈ రెండు భాషలే వినిపించే లోక్‌సభకు మంగళవారం కొత్త కళ వచ్చింది. 15 భారతీయ భాషలు విని సభ సాంతం పులకించిపోయింది. మాతృభాషా దినోత్సవం సందర్భంగా 'భిన్నత్వంలో ఏకత్వం' భావన మరింత పరిమళించింది. బెంగాలీ భాషను, సంస్కృతిని కాపాడుకునేందుకు అప్పట్లో తూర్పు పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) వాసులు చేసిన పోరాటానికి గుర్తుగానే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పడింది. నాటి పోరాటంలో బెంగాలీలు చేసిన త్యాగాలను, పోరాటాన్ని స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ తన మాతృభాష బెంగాలీలో వివరించారు. తర్వాత ఒకొక్కరుగా లేచి... తమ తమ మాతృభాషల్లో ప్రసంగించారు. ఎవరికి వారు మాతృభాషలో తమ భావాలను వ్యక్తం చేసుకునే అవకాశముంటే... ప్రపంచంలో ఎలాంటి సమస్యలూ ఉండవని మాజీ మంత్రి సురేశ్‌ ప్రభు కొంకణిలో పేర్కొన్నారు. సుమారు గంటసేపు ఇలా మాతృభాష చర్చ కొనసాగింది. అందరికీ అర్థమయ్యేందుకు కొందరు తామే అనువాదకుల పాత్ర పోషించారు.

తెలుగుకు ఏదీ వెలుగు... మంగళవారం మాతృభాష దినోత్సవం అని గుర్తుచేసింది... లోక్‌సభలో ఆ ప్రస్తావన తెచ్చింది ఆంధ్రప్రదేశ్‌ సభ్యులే. కానీ... ఈ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం పొందేందుకు తెలుగువారు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పురందరేశ్వరి సమాధానం చెబుతుండగా... గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అనుబంధ ప్రశ్నవేసే అవకాశం వచ్చింది. ఆయన తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇందుకు స్పీకర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలుగు అనువాదకుడు లేనందున ఇంగ్లిష్‌లో మాట్లాడమని సూచించారు. 'ఈరోజు మాతృభాషా దినోత్సవం. నేను తెలుగులోనే మాట్లాడుతా' అంటూ రాయపాటి తన ప్రశ్న కొనసాగించారు. మంత్రికి తెలుగువచ్చని, ఆమె కూడా తెలుగులోనే సమాధానమివ్వాలని రాయపాటి కోరారు. ఇందుకు పక్కనున్న లగడపాటి, బాలశౌరి మద్దతు పలికారు. తెలుగులో సమాధానమివ్వమంటారా? అని పురందరేశ్వరి స్పీకర్‌ అనుమతికోరారు. స్పీకర్‌ అందుకు నిరాకరిస్తూ లిఖితపూర్వక సమాధానం పంపితే సరిపోతుందంటూ మరోప్రశ్నకు వెళ్లిపోయారు. ఇలా మాతృభాష ప్రస్తావన మొదలైంది. సభలో అనువాదకుడులేని మళయాళం, తెలుగు, గుజరాతి భాషలకు చివరి అవకాశం ఇచ్చారు. హిందీ తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడే తెలుగుకు లోక్‌సభలో అనువాదకుడు లేకపోవడంతో... మాతృభాషా దినోత్సవం రోజు సభలో తెలుగుకు వెలుగు లేకుండాపోయింది.

తెలుగు భాషకు ప్రాచీన హోదాపై
నేడు అసెంబ్లీలో తీర్మానం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ శాసనసభలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్వయంగా వెల్లడించారు. మాతృ భాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో అధికార భాషాసంఘం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న కవులు, రచయితలకూ, అధికారులకూ భాషా పురస్కారాలను అందజేశారు. అనంతరం ప్రసంగించారు. 'తమిళానికి ప్రాచీన భాష హోదా లభించింది. తెలుగుకూ ఈ గుర్తింపు కల్పించకముందే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను మార్చి ప్రాచీనతకు ఉండాల్సిన కాలాన్ని 1500 సంవత్సరాల నుంచి 2వేల ఏళ్లకు పెంచింది. దీనిపై కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి అర్జున్‌సింగ్‌తో మాట్లాడాను. న్యాయం జరిగేలా చూస్తానని ఆయన వాగ్దానం చేశారు. తెలుగు భాషకున్న ప్రాచీనతను అన్వేషించేందుకు మంత్రి ఎం.సత్యనారాయణ ఆధ్యర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశాం' అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి విద్యాబోధన తెలుగులోనే జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాథి అవకాశాల కోసం ఇంగ్లీషు, ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదనీ, తెలుగును మాత్రం ఎవరూ అశ్రద్ధ చేయకూడదని అన్నారు. మన రాష్ట్రం భాషా ప్రాతిపదికన ఏర్పాటై 50 ఏళ్లు గడిచినా ఇంకా భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంగ్లీషు మీడియం పాఠశాలలను అనుమతించకండి... ఇంగ్లీషు మాధ్యమంలో పాఠశాలలను అనుమతించడాన్ని ఆపివేయాలని, ఉన్నవాటిని క్రమంగా తెలుగు మాధ్యమంలోకి మార్చాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్‌ కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో 93శాతం కనీసం కూడికలు కూడా చేయలేని స్థితిలో ఉన్నట్లు ఇటీవల పాఠశాల విద్యాశాఖ చేసిన సర్వేలో తేలడాన్ని ప్రస్తావిస్తూ ఇందుకు కారణం ఇంగ్లీషు మీడియం, ప్రైవేటు పాఠశాలలేనని చెప్పారు. పాఠశాలల్లో తెలుగు భాషోపాధ్యాయుల నియామకాలను తప్పనిసరి చేయాలని కోరారు. తెలుగు కోసం జారీ అయిన జీవోను అమలు చేయాలని సూచించారు. కవులు, రచయితలు వెలమల సిమ్మన్న, కత్తి పద్మారావు, తెలిదేవర భానుమూర్తి, సింగమనేని నారాయణ, మంజూర్‌ అహ్మద్‌, మజీద్‌ బదర్‌, ఫాతిమాతాజ్‌, కలెక్టర్లు డి.వి.రాయుడు (నిజామాబాద్‌), వై.వి.అనురాధ (అనంతపురం), శ్రీకాకుళం ఎస్‌పీ ఎ.ఎస్‌.గురప్ప పురస్కారాలను అందుకున్నారు.

ప్రాథమికాంగ్లం వద్దు: బాబు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
''ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమికస్థాయిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరధోరణి. దీనివల్ల గ్రామాల్లో కూడా తెలుగు మాట్లాడే పరిస్థితుండదు పసివారి ప్రతిభ దెబ్బతింటుంది.''
తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించడానికీ, భాషా పరిరక్షణ చర్యల కోసం రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ''ఈ అంశంపై బుధవారం శాసనసభలో వాయిదా తీర్మానం కోసం పట్టుపడతాం. ప్రభుత్వాన్ని ఒప్పించి... తెలుగుకు ప్రాచీనహోదా కోరుతూ కేంద్రానికి తీర్మానం పంపుతాం. అవసరమైతే ఢిల్లీ పోదాం. నేనూ మీతో వస్తా'' అని భాషాభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు పరిరక్షణ, ప్రాచీనహోదా కోరుతూ... మంగళవారమిక్కడి ఇందిరా ఉద్యానవనం వద్ద 'తెలుగు భాషోద్యమ సమాఖ్య' ఒకరోజు నిరాహారదీక్షలు చేపట్టింది. సి.ధర్మారావు, మల్లాది సుబ్బమ్మ, చుక్కా రామయ్య, పాత్రికేయుడు వరదాచారి తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాత్రి చంద్రబాబు వారి వద్దకు వచ్చి... నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Courtesy: ఈనాడు
Telugu Andhra Pradesh Hyderabad International Mother Tongue Day Feb 21 2006 classical ancient language status demand tcld2006
Technorati tags: ,

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


తెలంగాణ గోదావరే 'తెలివాహ'!

ఆంధ్రదేశపు ప్రాచీన చరిత్రలో 'తెలివాహ' నది ఎక్కడ ఉందో అస్ప ష్టంగా ఉన్న అంశం. శెరవనీయ బౌద్ధ జాతక గాథ ఈ నదిని దీని ఒడ్డునే ప్రసిద్ధమైన ఆంధ్రపురం గూర్చి చెప్పింది1. ఈ నది ఏది అనేవిషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ తెల్‌ నది మహా నదికి ఉపనది అని, ఇది ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లోనిదని పేర్కొన్నారు. కాని ఇది ఆంధ్రదేశపు నది కాదు. ఇది భౌగోళికంగా కుదరదని ఆచార్య గంటిజోగి సోమ యాజిగారు తెలిపినారు2. రాయచౌధరిగారు దీన్ని కృష్ణానది అన్నారు. దీని ఒడ్డున పేర్కొనబడ్డ ఆంధ్రనగరం ధాన్యకటకం అని నిర్ధారించారు. పల్లవరాజు శివస్కంధ వర్మ క్రీ.శ. 234 నాటి తన మైదవోలు శాసనంలో ధాన్యకటక, 'ఆంధ్రపథ' పేర్లు పేర్కొన్నాడు3. ధాన్యకటకం క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటికే అతి ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం కావడం వల్ల బౌద్ధ జాతక కథలలో పేర్కొనబడి ఉండవచ్చుననేది4 వీరి భావన. శబ్ద వ్యుత్పత్తి (etymology) ప్రకారం తేల్‌ శబ్దం తైల శబ్దం నుండి వచ్చిందని నూనె లా నల్లగా ఉండే నది కనుక కృష్ణానదికి ఆ పేరు కుదురుతుందని భావించారు.

కాని బౌద్ధ వాఙ్మయంలో పేర్కొనబడ్డ ఈ 'తెలివాహ' నది గోదావరి నదేనని నా ప్రగాఢ విశ్వాసం. దీనికి ఉపబలకంగా కొన్ని ఆధారాలు....
కృష్ణానదికి 'కణ్ణబెణ్ణా' అని పేరుండేదానాడు. కణ్ణబెణ్ణ 'కృష్ణవేణి' శబ్దతుల్యం. నల్లని ప్రవాహం అని అర్థం. ఈ పేరు బౌద్ధ జాతక గాథల్లోనేగాకుండా నానేఘాట్‌ గుహలోని మొదటి శాతకర్ణి భార్య దేవినాగనీక క్రీ.పూ. 180లో వేయించిన శాస నంలో దీన్ని5 పేర్కొనడం జరిగింది. క్రీ.పూ. 2వ శతాబ్దికి ముందే కృష్ణానదికి ఈ పేరు స్థిరపడింది. తెలివాహ,కణ్ణబెణ్ణ అనేవి సమకాలిక నామాలు. అవి ఒకే నదికి ఏకకాలంలో ఉండవు. ఒకవేళ గౌతమి, గోదావరి వలె ఉన్నాయనుకున్నా అర్వా చీనంగా పురాణగాథలాధారంగా ఇవి ఏర్పడ్డవి. పురాణాల ప్రకల్పన ఆనాటికి లే దు. అవి నల్లని నది, తెల్లని నది అని రంగును బట్టి ఏర్పడ్డ ప్రాచీన నామాలు. కృష్ణ అంటే నల్లనిది, తెలి అంటే తెల్లనిది. తెలివాహ అంటే తెల్లని ప్రవాహం కలదని అర్థం. వాహ ప్రవాహ ఉపసర్గ 'ప్ర' కలిగిన ఏకపదమే. తెలి అంటే తేట, తెళుగన్నడ అంటే తేటఐన కన్నడభాష, తెలి+ఆగు= స్వచ్ఛమైనది అని వ్యవహారార్థాలున్నాయి.

తెళ్‌ాతెల్‌ాతెలి అనే పరిణామ క్రమంలో మూలద్రావిడంలో 'స్పష్టమైన, ప్రకాశ మానమైన' అనే అర్థాలు కలిగి ఉన్నాయి. ఇది ప్రాచీనపదం అనడాన్కి గుర్తుగా దీని మీద 'పు' అనే తద్ధిత ప్రత్యయం చేరి తెలుపు ఇత్యాది శబ్దం సిద్ధం కావడమే. (నలుపు,ఎరుపు,పసుపు) ఈ నామాలు విశేషణాలుగా మారినప్పుడు 'పు' ప్రత్య యం తొలగి పదాంత హల్లు ద్విత్వమై నల్ల, తెల్ల, ఎర్ర, పచ్చ అనే ఒకేవర్గ పదాలుగా స్థిరపడ్డాయి.

గోదావరికి తెలివాహ, కృష్ణకు కణ్ణబెణ్ణ (బెణ్ణ=వేణి=పాయ) అని పేర్లు బౌద్ధ వాఙ్మయంలో వ్యవహారనామంగా కనబడటానికి కారణం ఈ రెండు నదుల మధ్య ప్రాంతాలు లేదా సమీపవర్తి ప్రాంతాలు బౌద్ధ పుణ్యక్షేత్రాలుకావడమే6. ఐతే విశే షంగా గోదావరి నదీ దక్షిణ తీరం బౌద్ధుల ప్రాచీన పర్యాటక క్షేత్రం. తెలివాహ నది ఒడ్డున (ప్రాచీన) ఆంధ్రనగరం ఉందని బౌద్ధ వాఙ్మయం చెప్పడం వల్ల తమకా నాటికి తెలిసిన ధాన్యకటకానికి ముడివేసి, తెలి శబ్దానికి కృష్ణానదికి ముడిపడక తైల శబ్దం తీసుకొని, నూనె నల్లగా ఉంటుందని, కృష్ణానది నూనెలాగ ఉంటుందని ఊహ చేశారు. తెలిలోని ఎ (హ్రస్వ వక్రం) సంస్క­ృత వర్ణమాలలో లేదు గనుక ఈ శబ్దం సంస్క­ృతం కాదు. తైలంతో సంబంధం లేదు, కాని గోదావరి నది తీరాన ధాన్య కటకానికి 300 సంవత్సరాల ముందే ఉన్న మరో మహానగరం గూర్చి ఆనాడు ఎవ రికీ తెలియదు. అది కరీంనగర్‌ జిల్లాలోని (ధర్మపురికి 15 కి.మీ. దూరంలో వెల్ల టూరు మండలంలోని) కోటి లింగాల గ్రామం. గోదావరి తీరాన గల 2500 సంవత్సరాల కిందటి గ్రామం.

తెలివాహ ఒడ్డున గల నగరం ధాన్యకటకమేమోనని చరిత్రకారులు ఊహించే నాటికి 'కోటిలింగాల'లో తవ్వకాలు జరగలేదు. క్రీ.శ. 1979-84 మధ్య పురావస్తు శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు తవ్వకాలు జరుపగా అనేక విశేషాలు వెలుగు జూశాయి. దీంట్లో 'గర్భనగరం' బయటపడింది. ఇది శాతవాహనుల తొలి రాజ ధాని. తొలిరాజు శ్రీముఖుని పేరు శాసనాల్లో మాత్రం కనబడి ఆధారాలు లభించని స్థితిలో ఉండగా ఇక్కడ అతని పదుల కొద్దీ నాణెములు 'సిముక' పేరుతో లభిం చాయి. పేరు తెలియని మరో శాతవాహన రాజు నాణెములు, అంతకుముందే పరి పాలించిన సామగోపుని నాణెములు, మహాతలవర, మహాసేనాపతిస అనేపేర్లు గల నాణెములు లభించాయి. క్రీస్తు పూర్వమే ఈ నగరానికి విదేశీ వ్యాపారులతో సంబంధాలకు గుర్తుగా రోమన్‌ సామ్రాట్టుల నాణెములు లభించాయి. ఆనాటి నగర విశేషాలు, బావులు, కాలువలు, పారిశుద్ధ్యపు జాగ్రత్తలు గల ఇటుకల నిర్మా ణాలు బయటపడ్డాయి. ఈ కోటిలింగాల నగరంలో ఆగ్నేయభాగంలో పెదవాగు గోదావరిలో సంగమించే చోట బౌద్ధ స్థూపం కానవచ్చింది. ఇక్కడ క్రీ.పూ. 3 శతా బ్దులకు ముందే నిర్మితమైన కోట శిథిలాలు కానవచ్చాయి. ఉత్తరాన గోదావరి, తూర్పున పెదవాగు మధ్యలో కోట ఉంది. ఇది జలదుర్గం. దక్షిణాన ప్రధాన మార్గం. గోదావరి నది వైపు కోట ద్వారం గుర్తించబడింది. ఈ కుడ్యం గోదావరి వరదల వలన శిథిలమైంది. కోటకు నాలుగు మూలలకు బురుజులుండేవి7. కోట నిర్మాణానికి, స్థూప నిర్మాణానికి ఒకే ప్రమాణపు పెద్ద పెద్ద ఇటుకలు వాడినారు. ఇది ధాన్యకటక (అమరావతి) బౌద్ధ స్థూపానికి, నగరానికి ముందటి నిర్మాణాలు. ఇది శాతవాహనులకు పూర్వపు నగరం. ఈ స్థూపానికి చెందిన రాతి ఫలకాల మీద గల లఘు శాసనాల8 రాతలనుబట్టి ఇది మౌర్యుల కాలానికి ముందుదని, దీని మీద రాతల్లో గల లిపి బ్రాహ్మీలిపి కంటే ప్రాచీనమైనదని ఠాకూర్‌ రాజారాం సింగ్‌ గారు అభిప్రాయపడ్డారు9. యావద్భాతర దేశంలోనే అశోకుని బ్రాహ్మీలిపి శాసనాలు తొలి నాళ్ళవి కాగా ఇవి మరీ ప్రాచీనాలౌతాయి. నేడు కోటిలింగాల గ్రామం (కోట కార ణంగా) కోట లింగాలగా వ్యవహరించబడేదని చెపుతారు. ఈ నగరం చుట్టూరా విస్తరించిన రాజ్యం ఆంధ్రదేశంలో చరిత్రకందనంత పూర్వపుదిగా వెలుగులోకి వచ్చింది. అర్ద సహస్రాబ్ది ఆంధ్రదేశాన్నేలిన రాజవంశమైన శాతవాహనులకు తొలి రాజధాని (క్రీ.పూ. 3వ శతాబ్దం)కోటిలింగాల, మలి రాజధాని ప్రతిష్ఠానం (పైఠాన్‌= మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ సమీప గ్రామం), ఆ పిదప మూడవది ధాన్యకటకం (అమరావతి)గా భావించవచ్చు. తొలి మలి రాజధానులు గోదావరి తీర నగరాలు. తృతీయం కృష్ణాతీరం.

క్రీ.పూ. 300 సంవత్సరాల ప్రాంతంలో మగధ రాజైన చంద్రగుప్త మౌర్యుని ఆస్థా నాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్థనీసు తన గ్రంథంలో 30 దుర్గాలు, లక్ష కాల్బలం, రెండు వేల అశ్విక దళం వేయి ఏనుగులు కల చతురంగ బలాలు కల్గిన ఆంధ్రులు మౌర్యుల తర్వాత అతి పెద్ద రాజ్యం కల్గి ఉన్నారని చెప్పింది ఈ ప్రాంతం గురించేనని భావించవచ్చు10. నాడు ఆంధ్రదేశాన ఇంత ప్రాచీనమైన రాజ్యం లేదా రాజధాని నగరం నదీ తీరాన బయటపడలేదు. క్రీ.పూ. 3వశతాబ్దిలో అశోకుడు వేయించిన 13వ ధర్మలిపి శాసనంలో ఆంధ్రులు బుద్ధుని ధర్మ బోధనలను అనుసరించారని 'నిచనోడ... ఆంధ్ర పులిదేషు సవత్ర దేవనం పియస ధమనుశస్తి' అని రాసింది ఈ ప్రాంతం గురించే. కారణం ఇక్కడ అంటే కరీంనగర్‌ జిల్లాలో గోదావరికి దక్షి ణంగా నేటికీ కోటిలింగాల, పాశాయిగాం, ధూళి కట్ట, పెద్ద బొంకూరు మొదలైన ప్రాంతాల్లో అనే క బౌద్ధ స్థూపాలు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. ధూళికట్టలో మరొక మట్టికోట ఆనవాళ్ళు బయటపడ్డాయి. అలాగే నేటి బోధన్‌ (నిజామా బాద్‌ జిల్లా) నాడు పోతలిగా పిలువబడ్డది. బోధన్‌కు ఉత్తరాన రెండు కి.మీ. దూరంలో అతి ప్రాచీనస్థలంలో 20 అడుగుల ఎత్తుగల మట్టి కోట ఉంది. ఇది ప్రాచీన కోట. కోట తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి పూసలు, పెంకులు లభించాయి. బావరి పోతలి రాజ్య నివాసిగా సుత్తనిపాతం పేర్కొంది.11 ఇవి మెగస్తనీసు చెప్పిన దుర్గాలు. క్రీ.శ. రెండవ శతాబ్దినాటి ప్లీని (గ్రీకు చరిత్రకారుడు) కోసల దేశాన 'అంధర' రాజ్యం ఉన్నట్లు వారికి సంబంధించిన పై వివ రాలే ఇచ్చాడు. దుర్గాలు మాత్రం 80 అని చెప్పి నాడు. కోసల రాజ్యానికి దక్షిణంగా ఉన్న ఈ రాజ్యం గోదావరి ఉభయ పారాలైన బస్తరు, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలుగా గుర్తించవచ్చు. ఈ ప్రాంతాన్ని వి.వి.కృష్ణ శాస్త్రిగారు దక్షిణ కోసలగా తెలిపినారు.12 కోటి లింగాల నగరం దక్షిణ కోసలకు నడిబొడ్డున గల రాజధాని నగరం. ఇదే తెలి వాహ ఒడ్డున గల నాటి ఆంధ్రనగరం.

పాళీ బౌద్ధ వాఙ్మయంలో పేర్కోబడ్డ అంధరకట్టి (ఆంధ్రరాష్ట్రం) తెలుగు ప్రాం తమని మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెప్పారు. అది ఈ ప్రాంతమే. ఎందుకంటే బౌద్ధ వాఙ్మయంలో పేర్కోబడ్డ అస్సక, ముల్లకులు కూడా ఈ సమీప ప్రాంతాల వారే. అశ్మక (అస్సక) నిజామాబాద్‌,కరీంనగర్‌ జిల్లాల ప్రాంతాలు. మూలక (ముల్లక) పైఠాన్‌ ప్రాంతం నుండి దక్షిణ మహారాష్ట్ర గోదావరి తీర ప్రాంతాలు. ఇవి అత్యంత ప్రాచీమైన క్రీ.పూ. 600 నాటి జనపద ప్రాంతాలు13. ఇవి తర్వాత శాతవాహనులు రాజ్య నిర్మాణం చేసి, కోటిలింగాలను తత్పూర్వ రాజన్యుల నుండి గెలిచి, తొలి రాజధానిగా చేసికొని పాలించిన ప్రాంతాలు. శాతవాహనులు క్రీ.పూ. 3 వ శతాబ్దిలో రాజ్య నిర్మాణం గావించారు. బుద్ధునికి సమకాలికుడైన బావరి అనే బ్రాహ్మణుడు (క్రీ.పూ.600) తన శిష్యులతో అశ్మకరాజ్యంలో గోదావరి తీరంలో నివ సించాడని బౌద్ధ వాఙ్మయంలో ఉంది14. ఈయన నివసించిన ప్రాంతం కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి ప్రవాహ మధ్యస్థ ద్వీపం బాదనకుర్తి (బావరికుర్తి) గా ఠాకూర్‌ రాజారాంసింగ్‌ గారిచే గుర్తించబడింది15. అంతేకాదు బుద్ధఘోషుడు రాసిన పర మార్థ జ్యోతిక అనే గ్రంథంలో 'బావరి' మరియు 'బోధిసత్త్వ శరభంగ జ్యోతిపాల' అనే ఇద్దరు అస్సక రాజ్యంలో గోదావరి నదిలోని కవిటవనం (వెలగ తోట) అనే ద్వీపంలో నివసించేవారని రాసి ఉంది16 .అస్సక జనపదంలో గోదావరి నదిలోని ఈ ద్వీపం కచ్చితంగా నేటి బాదనకుర్తియే. ఈ దీవిలో ప్రాచీన యజ్ఞవాటికలు బయటపడ్డాయి. బావరి బౌద్ధం స్వీకరించడానికి ముందు యజ్ఞయాగాదులు చేసిన బ్రాహ్మణుడే. ఈయనకు ముందు కవిటవన ద్వీపంగా పేరున్న ఈ ద్వీపం తరువాత ఈయన పేర బావరికుర్తిగా నేడు బాదనకుర్తిగా మారిందని నా భావన. (కుర్తి, పర్తి, ఆల, పాడు వంటివి గ్రామమనే అర్థాన్ని సూచించే ప్రాచీన తెలుగు పదాలు). కోటి లింగాల నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాశాయిగాం గ్రామం వెలుపల రోడ్డు మీద బౌద్ధ స్థూపం ఉంది. బౌద్ధాచార్యుడై దిగంతాల విఖ్యాతుడైన ఆచార్య దిజ్నాగుడు ఈ గ్రామం వాడేనని కృష్ణశాస్త్రిగారు తెలిపారు.

ప్రాకృతంలో రాయబడ్డ గాథాసప్తశతి వల్ల అత్యంత సుప్రసిద్ధుడైన హాల శాత వాహన చక్రవర్తి, సింహళ రాజకన్య లీలావతిని వివాహమాడిన గాథ 'లీలావఈ' అనేపేరుగల కావ్యంగా కుతూహలుడనే కవి రాసినాడు. రాచ వివాహం సప్త గోదా వరి తీరస్థ భీమేశ్వరుని సన్నిధిలో జరిగింది. (సప్త గోదావరి భీమేశ్వరుడనగానే దాక్షారామం వైపు మనసు పరిగెత్తుతుంది. కాని దాక్షారామంలో గోదావరి నది లేదు) గోదావరి కరీంనగర్‌ జిల్లాలో మల్లాపూర్‌ మండలంలోని వేంపల్లి వెంకట్రా వుపేట వద్ద ఏడు పాయలుగా చీలింది. కోటి లింగాల రాజధానికి ఇది 70 కి. మీ. దూరం. ఇక్కడ తీరాన శాతవాహనుల కాలపు ప్రాచీనాలయం ఆకాలపు ఇటుకలతో నిర్మాణం ఐంది గోదావరి ఒడ్డున నేను చూశాను. ఇక్కడ ఏనుగులతో ఉల్లిగడ్డలు మోయించి తెచ్చి వ్యాపారం చేసేవారని అంత పెద్ద సంత జరుగుతుండేదని చెప్పారు. ఇక్కడ నాకు గోదావరి తీరాన ఇనుప ఖనిజం గల బిళ్లలు గోదావరి వరద కోతకు గురైన తీరాన లభించాయి. ఈ నదీ తీరాలన్నీ వ్యాపార కేంద్రాలే. హాలుని కాలానికి ఇది ఆయన రాజ్యంలో ప్రసిద్ధ ప్రాంతం. దీన్నిబట్టి హాలుడు శాతవాహన సామ్రాజ్యం కోటిలింగాల రాజధానిగా కీ.శ. ఒకటవ శతాబ్దిలో ఏలి ఉండే వాడనీ, గాథాసప్తశతి కరీంనగర్‌ జిల్లాలో పుట్టిందని భావించవచ్చు17. గాథాసప్తశతిలోని తెలుగు పదాలు తిరుమల రామచంద్రగారు ఎత్తిచూపినవి ఈ ప్రాంతపు తెలుగు భాష యొక్కనాటి వాడుకలోనివే.

ఈ తెలివాహ నది గోదావరియే కావడం వల్ల తెలుగునాట గోదావరి తీర ప్రాంతాలైన అశ్మక, మూలక రాజ్యాలు అత్యంత ప్రాచీన జనపదాలు కావడం వల్ల తెలుగు భాషా సంస్క­ృతులు ఇక్కడే వికసించాయనవచ్చు. ఈ ప్రాంతం నుండి ఇతర ఆంధ్రదేశ ప్రాంతాలకు వలస వెళ్ళిన తెలుగువారు తెలుగు భాషను, ఈ ప్రాం తాలలోని తమ గ్రామాల పేర్లను యావదాంధ్రదేశంలో వ్యాప్తం చేశారనవచ్చు18. ప్రముఖ ఎటిమలొజిస్టు ప్రొ. యార్లగడ్డ బాల గంగాధర రావుగారు తెలంగాణలోనే తెలుగు పుట్టిందని, అది తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరించిందని తెలిపినారు19. అంతేకాదు ఈ ప్రాంతాల్లో బౌద్ధం వ్యాప్తం అయిన కారణంగా ప్రచారంలో ఉన్న పాళీభాష నిజానికి ప్రాకృత భేదం కాదని ఇది తొలినాళ్ల తెలుగేనని ఒక అభి ప్రాయం ఉంది. పాళీభాష క్రీ.పూ. 3వ శతా బ్దంలో సింహళ దేశంలోని మాగధీ ప్రాకృత మేనని జాన్‌ బీమ్స్‌ అభిప్రాయం. ఈ అభిప్రా యాల్లో నిశ్చితి లేదు. గుణాఢ్యుడు (1వ శతాబ్ది) తాను శాతవాహన రాజు కొలువులో పందెంలో ఓడిపోయిన కారణంగా రచన సాగించనని శపథం చేసి త్యజించిన రచనానుకూల భాషల్లో సంస్క­ృత,ప్రాకృతాలతోబాటు దేశ్యభాష కూడా ఉంది. ఇది తెలుగేనని పండితాభిప్రాయం. ఈ శాతవాహన రాజు కోటిలింగాలలో ఉన్నాడా? ప్రతిష్ఠానపురంలో ఉన్నాడా? అనేది సందేహమే. ఐనా ఒకటవ శతాబ్దం నాటికి కూడా కోటి లింగాల రాజధాని కావడం వల్ల ఈ చారిత్రక సంఘటన ఇక్కడే జరిగిందని భావించవచ్చు. పైఠాన్‌ ఐతే అక్కడి దేశభాష మహారాష్ట్రి ప్రాకృ తం అవుతుంది. సంస్క­ృత ప్రాకృతాలు కాక మరొకటి కదా ఆయన త్యజించింది! అపుడా యన త్యజించింది దేశభాష అయిన తెలుగే. పైఠాన్‌, కోటిలింగాల నగరాలు తెలి వాహ తీరంలో ఉన్నవే.

తెలివాహ నది ఒడ్డున పుట్టినదే తెలుగుభాష. ఈ భాషకు ఈ పేరు రావడానికి రకరకాల వ్యుత్పత్తులు చెప్పారేకాని 'తెలి' నది వల్ల వచ్చినట్టు ఎవరూ చెప్పలేదు. తేల్‌+అగు అని తెలుగులో నది వ్యుత్పత్తి చెప్పినా అది (తేల్‌ నది) తెలుగునాట లేద ని సోమయాజిగారు ఖండించారు20. తెళి+అగు= తెలుగు= స్వచ్ఛమైనది అని భాషాపరంగా మరో నిర్వచనం. తిలల వలె గోవులుండే దేశమని మరో నిర్వచనం. తెలుగు శబ్దం తెనుగు శబ్దం నుండి పుట్టిందని తెనుగు త్రినగ శబ్దభవమని, తేనె+ అగు తెనుగు అని మరికొన్ని నిర్వచనాలు21. తెలుగు శబ్దం త్రిలింగ శబ్ద భవమని, త్రికళింగ శబ్ద భవమని రకరకాల నిర్వచనాలు వచ్చాయి22. బర్మాదేశంలోని తైలంగుల జాతివారే తెలుగువారని జాతిపరంగా చెప్పినారు23. అయితే ఇవి ఖండ నీయాలే. తేల్‌ నది ఒరిస్సాలోనిది. ఎవరి భాష వారికి స్వచ్ఛమైనదే. నూల వలె గోవులుండటం పండితోత్ప్రేక్ష24. మూడు పర్వతాల మధ్య తెలుగు నేల మొత్తం లేదు. మూడు లింగాల (శివక్షేత్రాల) మధ్య భూభాగపు భౌగోళిక హద్దులు అర్వా చీనాలు. తెన్‌+అగు=దక్షిణ దేశపు భాష అని దిగర్థంలో చెప్పినా ఔత్తరాహికులకు తెలుగునేల దక్షిణం అవుతుందే తప్ప ద్రావిడ ప్రజలకు ఈ దిశ కుదురుట లేదు.
తెలివాహ నదీ తీరపు భాష తెలుగే అని చెప్పడం వల్ల దీని ప్రాచీనత్వం స్థిరపడు తుంది. ఈ నది తీర భూమి తెలంగాణ. ప్రాచీన తెలుగు నేల. గోదావరి మూడింట రెండు వంతులు తెలంగాణలోనే పారుతుంది. గోదావరికి శబరి కలిసి గోదా+శబరి= గోదావరి అయి శబరి సంగమం తర్వాతి నేలపై పారినపుడు కింది తీరాల్లో ఈ పేరు అర్వాచీనంగా స్థిరపడి ఉండవచ్చు. తెలివాహతో తడిసే విస్త­ృత భాగం తెలంగాణ. ప్రారంభంలో దక్షిణ గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వికసించిన తెలుగు తెలివాహ నామోద్భవం అయి తరువాత విస్త­ృ తమైంది. మంజీరికా దేశమని బౌద్ధ వాఙ్మయంలో పేరుగల మెతుకు సీమ (మెదక్‌ జిల్లా) ప్రాంతం గోదావరి ఉపనది అయిన మంజీర వల్ల ఏర్పడింది. ఇది తెలం గాణమే అయినా ఆనంతరిక విస్త­ృత తెలంగాణ. దీన్నిబట్టి ప్రాచీనంగా ఈ ప్రాంతా లు నదుల పేర్లతో పిలువబడేవని, తెలంగాణ తెలివాహ నది ఒడ్డున ఉండడం వల్లే ఈ పేరు వచ్చిందని భావించవచ్చు. (తెలివాహ నదితో తడిసిన అతి ప్రాచీనమైన జనావాస ప్రాంతం మాత్రం నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలే. ఈ ప్రాంతం అశ్మక, మూలక జనపదాలు గల క్రీ.పూ. 600 నాటి భౌగోళిక స్థితి).
తెలంగాణ పద వ్యుత్పత్తిని కొంచెం పరిశీలించాలి. తెలి అనేది నదీ సంబంధంగా నిర్ధారణమైంది. మిగిలిన 'గాణ' అనేది ప్రాంతం, భూమి అనే అర్థంలో ఉంది. తెలు గులో మా'గాణ' అనే పదంలో నదీ జలాలతో తడిసి పంటలు పండే భూమి అనే అర్థంలో కనబడుతుంది. మెట్ట అంటే ఎత్తైన పొడినేల, మాగాణ అంటే జలసిక్తసస్యక్షేత్రం. (కాణాచి అనే మరో దేశ్యపదం స్థావరం, ప్రాంతం అనే అర్థంలో ఉంది.) తెలంగాణ అంటే తెలిప్రవాహసిక్త భూమి అని ఈ ప్రాంతానికి స్థిరపడింది. గోదా వరి నదికి ఉత్తర భూములైన ఆదిలాబాద్‌, బస్తరు జిల్లాలు జనావాసాలున్నా భీకరా రణ్యాలే. జనపదాలు, నగరాలు, రాజ్యాలు రెండున్నర వేల సంవత్సరాల క్రితం గోదావరి దక్షిణ ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఇక్కడ లేవు. పైగా ఉత్తర భారతదేశంలోని సంచార జీవనులు, బౌద్ధ యాత్రికులు మొదలగువారు నది దాటిన తర్వాతే తెలి భాష మాట్లాడే సీమలో అడుగుపెట్టేవారు. భాషల మాండలికత్వానికి నదులే హద్దు లు. తెలింగాణా తెలంగాణ ఐంది. తెలినది గమించే భూమి, తజ్జనులు, తద్భాష తెలుంగుా తెలుగు ఐంది. తెలుంగు భాషానామం తెలంగాణా శబ్దజన్యం. దీనికి తెలుంగులోని నిండు సున్న తిరుగులేని సాక్ష్యం. క్రీ.శ. 102లో గ్రీకు భౌగోళికుడు టాలెమీ చెప్పిన టెలింగాన్‌ ఈ తెలంగాణమే. తెలుగులో ల-నగా మారి తెనుగుగా మరోపేరు స్థిరపడి ఉంటుంది25. ఈ విధంగా తెలివాహ గోదావరి నదిగా నిర్ధారిం చవచ్చు.

అధస్సూచికలుః
1. శెరవనీయ (శ్రీవనిజ) జాతక కథలో 'తెలివాహ నామ నదీం ఉత్తీరిత్వా, ఆంధ్రపురం నామ నగ రం ప్రవిశంతు'(సంస్క­ృతీకరణం) అని ఉంది.
2. ఆంధ్రభాషా వికాసము- ఆచార్య గంటిజోగి సోమయాజి పే.26
3. 'అంధాపతి యోగామో విరిపరం'- శివస్కంధవర్మ శాసనం
4. రెలిజియన్‌ ఇన్‌ ఆంధ్ర- బి. ఎల్‌. హనుమంతరావు, ఆర్కియాలజీ పబ్లికేషన్స్‌
5. ఏన్షియంట్‌ అండ్‌ మిడీవల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, పి. ఆర్‌. రావ్‌ 1994
6. బుద్ధుని తొలి ఐదుగురు శిష్యులలో తొలి శిష్యుడు కొండన్న తెలుగువాడు. 'అన్నాసి వితభో కొండ న్నో, (కొండన్నా విషయం గ్రహించావు) అని బుద్ధుడు స్వయంగా ప్రశంసించిన తెలుగు శిష్యుడు (మిసిమి మే 2005 పే. 223- శ్రీవిరించి వ్యాసం)
7. భారతీయ సంస్క­ృతి- పురాతత్త్వ పరిశోధన- డా. వి.వి.కృష్ణశాస్త్రి- పే.291
8. లిపియుక్తమైన 26 రాతిఫలకాలు కరీంనగర్‌ ఆర్కియాలజీ ఆఫీసులో భద్రపరచబడ్డాయి.
9. ఎ.పి. జర్నల్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ వా.॥। నెం.2, 1985, హైదరాబాద్‌-పే. 21
10.
"Maccrindies Magasthens' Indian antiquary (1877) Vol. VI, pp 337-339
11. భారతీయ సంస్క­ృతి- పురాతత్త్వ పరిశోధన డా. వి. వి. కృష్ణశాస్త్రి పే. 254, 278
12. భారతీయ సంస్క­ృతి- పురాతత్త్వ పరిశోధన డా. వి. వి. కృష్ణశాస్త్రి పే. 254, 278
13. వినయపిటక 46, అంగుత్తరనికాయ ఐ-213 ప్రకారం క్రీ.పూ. 600 నాటికి షాడోశ మహా జన పదాల్లో గోదావరి తీరస్థ అశ్మకం ఒకటి. ఇది సుత్తనిపాతం (977)లో పేర్కొనబడింది.
14. సుత్తనిపాత- వత్థుగాథ- పారాయణవర్గ- అనువాదం- అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
15. 'మిసిమి'- బుద్ధ జయంతి ప్రత్యేక సంచిక, మే నెల -2004, పే. 274
17. 'సప్తగోదావరి ఎక్కడ' నా వ్యాసం 'మిసిమి' పత్రిక ఆగస్టు, 2003.
18. శాతవాహనుల విదేశీ వ్యాపారం వల్ల తెలుగువారు సాకోత్ర (ఉ్చట్ట అజటజీఛ్చి), బర్మా, సుమత్ర దేశాల్లో స్థిరపడ్డారని, అరకన్‌ దేశ రాజధానికి 'త్రిలింగ' అని, సయాం దేశంలో 'కాకులం' అని నగ రాలకు పేర్లు తెలుగువారే పెట్టుకున్నారని 'ఆంధ్రశాతవాహవులు' అన్న వ్యాసంలో డా. ఏ. నాగ భూషణం తెలిపారు. భారతీయ వారసత్వం- సంస్క­ృతి పే. 102 తెలుగు అకాడమీ 1994 (వీరు తెలంగాణలోని ఒక్క బౌద్ధ స్థూపం గూర్చి కూడా తెలుపలేదు. తొలి శాతవానుల రాజధాని కోటిలిం గాల గూర్చి రాయలేదు. కోటిలింగాల తవ్వకాలకు దశాబ్దం తర్వాత ఈ గ్రంథం అచ్చయింది).
19. నామ విజ్ఞానం- యార్లగడ్డ బాలగంగాధరరావు
20. ఆంధ్ర భాషా వికాసం - విద్యాన్‌ గంటిజోగి సోమయాజి, పే. 26
21. త్రినగ=మహేంద్ర, శ్రీశైల, కాళహస్తి పర్వతాలు-ఆంధ్రభాషా చరిత్ర- చిలుకూరి నారాయణ రావు పే. 32.
22. త్రికళింగ- మధుకళింగ, ఉత్కళింగ కళింగ (12 వ శ. ముఖలింగ శాసనం) త్రిలింగ= ఎ) శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగరి సంయుతం (బ్రహ్మాండ పురాణం). బి) శ్రీశైల కాళేశ్వర దాక్షారామ నివా సినః (ప్రతాప రుద్రీయం 5-22) నాటిక ప్రచురణం. సి) తెలుగు శబ్దం ప్రాచీనమని త్రిలింగ అనేది సంస్క­ృతీకరణమని కొమర్రాజు వారన్నారు. లక్ష్మణరాయ వ్యాసావళి పే. 122
23. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం- ఖండవల్లి లక్ష్మీ రంజనం
24. తిలలవలె గోవులు కల దేశం 'తెలుగు' అని కల్లూరి వెంకటనారాయణరావు 'ఆంధ్ర వాఙ్మయ చరిత్ర' పే. 32
25. 'ల'-'న'గా మారుటకు భాషాశాస్త్రజ్ఞులిచ్చిన ఉదాహరణలు: లచ్చిానచ్చి, లెగుానెగు, లేదుా నేదు, లంజానంజ, లాంగలిానాగలి. చూ. భద్రరాజు కృష్ణమూర్తి 'తెలుగు వర్బల్‌ బేసెస్‌' పే. 41.


Courtesy:
ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh Telangana Telivaha Mesopotamia Sumer Sumeria Hyderabad Telmun Elam Elamo-Dravidian Dravidian India Indian classical ancient language status demand tcld2006
Technorati tags: ,

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Demand for classical status to Telugu

Hyderabad: Telugu linguistic groups, cultural organisations and political parties Tuesday demanded a classical status for Telugu to mark International Mother Tongue Day.

While literary groups charged the government with failure to get the classical status for Telugu and accused it of neglecting the language, a senior cabinet minister announced that the state assembly during the ongoing budget session would pass a resolution urging the centre to accord Telugu the classical language status.

"The language is spoken by 15 million people in India and various countries and holds 15th position among the most spoken languages in the world," said M. Satyanarayana Rao, minister for culture.

The Bharatiya Janata Party (BJP) and the Communist Party of India (CPI) also asked the government to make a strong case before the centralo government for the status, as the language is spoken by 76 million population of Andhra Pradesh.

Bhashudyamma Samakhya, which is fighting for the promotion of Telugu, held a massive rally in the state capital demanding that the same yardstick that was applied to recognise Tamil as a classical language be applied to Telugu.

The rally was attended by writers, poets, film and television artistes and linguistic activists. The speakers said Telugu was a 1,000-year-old language and deserved the classical status.

Telugu-speaking people are spread over several countries including the United States, Britain, Mauritius, Malaysia and Singapore.

Courtesy: NewKerala
tcld2006
Technorati tags: ,

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Property details via Telugu SMS

The state government would soon be in a position to provide details about land and property through Telugu SMS. The revenue minister D Prasada Rao disclosed this in the assembly on Monday.

The minister said that the state unit of the National Information Centre (NIC) is studying the feasibility of providing land and property details through SMS in the Telugu language.

Courtesy: AndhraCafe
Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


State to press for classical language status for Telugu

Government to table resolution in Assembly today

HYDERABAD: A resolution appealing to the Centre to accord classical language status for Telugu would be introduced in the State Assembly on Wednesday, Chief Minister Y. S. Rajasekhara Reddy said.

Dr. Reddy made the announcement at the International Mother Tongue Day celebrations organised by the AP Official Languages Commission here on Tuesday. The move is to exert pressure on the Centre to accord the status to Telugu on the lines of Tamil.

"I have spoken to Union Minister for Human Resources Development Arjun Singh, who has promised me that he will do his best," Dr. Reddy said amid applause from a large gathering at the Lalita Kala Toranam where the function was held. A task force was set up the under the chairmanship of Sports and Culture Minister M. Satyanarayana Rao to strive to seek classical language status and promotion of Telugu language.

Dr. Reddy said it was a matter of concern that Telugu language was being neglected in preference to other languages. "If Telugu is ignored it will be a matter of serious concern," he said, adding people should not forget that Andhra Pradesh was the first linguistic State in the country.

The Chief Minister later gave away language awards to V. Simanna, Kathi Padma Rao, Telidevara Bhanumurthy, S. Narayana, Manzoor Ahmed, Mazeed Badar and Fatima Taj for their service to Telugu and Urdu languages. Nizamabad Collector D. V. Raidu, Anantapur Collector Y. V.Anuradha, Visakhapatnam Collector A. K. Singhal and Srikakulam SP A. S.Gurappa were among the 37 officials who received the State award for promotion of Telugu.

Exhibition

Meanwhile, the Minister for Culture inaugurated a three-day exhibition on "evolution of Telugu language and script over the centuries." He said Telugu, being a more than 2,000-year-old language, deserved the classical language status.

"Telugu language is next only to Hindi going by the number of people who speak it," he said.

Mr. Rao also visited the one-day hunger strike camp launched by the representatives of Telugu Bhashodyama Samakhya (Federation for protection of promotion of Telugu language) at Indira Park.

CPI State secretary K. Narayana and senior BJP leader Bandaru Dattatreya, who joined the fast, said that their respective parties would take up the matter with the Centre.

Courtesy: The Hindu

Technorati tags: ,

tcld2006


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


తెలుగుకోసం సిఎం ను నిలదీస్తా: ఎమ్మెస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆన్‌ లైన్‌): తెలుగుకు ప్రాచీన భాషగా హోదా కల్పించాలనే విషయమై ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని నిలదీస్తానని రాష్ట్రక్రీడల శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు అన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయా లని ముఖ్యమంత్రిని కోరతానని ఆ యన స్పష్టం చేశారు. ప్రాచీన భాష గా తెలుగును గుర్తించాలని కోరుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వ ర్యంలో మంగళవారం ప్రారంభమైన ఉద్యమంలో పాల్గొన్న మంత్రి పైవిధంగా స్పందించారు. తొలుత తెలుగుతల్లి విగ్రహానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఉదయం ఎనిమిది గంటల సమ యంలో పూలదండలు వేసి ఈ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మంత్రి సత్యనారాయణరావుతో పా టు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మె ల్యేలు, తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యుడు మండలి బుద్ధప్రసాద్‌, నగ ర మేయర్‌ తీగల కృష్ణారెడ్డి, పలు వురు రచయితలు, మేధావులు, అధి కార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. తెలుగుతల్లి విగ్రహం నుం చి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరాహారదీక్ష లు ప్రారంభించారు.

ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య, ప్రముఖ సామాజిక వేత్త లవణం వంటి వారి తో పాటు తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్న 250 మంది నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. బిజెపి జాతీయ కార్య దర్శి బండారు దత్తాత్రేయ మాట్లాడు తూ తెలుగుకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రాచీన భాషగా గుర్తించేందుకు చేసే ఉద్యమానికి టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మందాడి సత్యనారాయణరెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్‌ నారాయణ, సిపిఎం నాయకుడు వై.వి.రావు తమ మద్దతును ప్రకటించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి మా ట్లాడుతూ ప్రతి పాఠశాలల్లో పిల్లలకు తెలుగులోనే బోధన చేయాలనే దా నిపై ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ధర్మారావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరిగా తెలుగును అమలు చేయాలని కోరారు. విశాఖపట్నంలో 72 ముని సిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్య మాన్ని ప్రవేశపెట్టి ఒకటో తరగతి నుంచి ఐదో తేదీ వరకు బోధన ప్రారంభించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ రచయితలు జ్వాలా ముఖి, నగ్నముని, కె.బి.తిలక్‌, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మైసూర్‌ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫె సర్‌గా పనిచేస్తున్న ఆర్‌.వి.సుందరం, మల్లిఖార్జున శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Courtesy: ఆంధ్ర జ్యోతి

Telugu Andhra Pradesh classical ancient language status demand tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


తెలుగు భాషకు కావలసిందేమిటి?

-చుక్కా రామయ్య (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)

ఆంధ్రప్రదేశ్‌ భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించి యాభయ్యేళ్ళయింది. ఈ ఐదుదశాబ్దాల నుంచి తెలుగుభాష గురించి లేని బెంగ ఇప్పుడు ప్రారంభమైంది. మన భాష గమనం ఎటు అన్నధ్యాస ఇప్పటివరకు లేదు కాని పొరుగురాష్ట్ర భాషకు ఒక గుర్తింపు వచ్చేసరికి ఇప్పుడు మన భాషపై మనకు మమకారం పుట్టుకొచ్చింది. తమిళభాషకు ప్రాచీనహోదా ఇచ్చిన ఫలితంగా మన తెలుగుభాష అందుకు సరితూగదా అన్న రోషం మనలో పుట్టుకొచ్చింది. భాషా ఉద్య మం ప్రారంభమైంది. అయితే తెలుగుభాషకు ప్రాచీనహోదా ఔచిత్యాన్ని గురించి చర్చించడం ఉద్దేశం కాదు కానీ మనం ఇంతగా అభిమానిస్తున్న భాషకు ఇప్పటివరకు మనమేం చేశాం. అసలు ఏం చేయాలో ప్రస్తావించడమే ఇక్కడ ఉద్దేశం. భాషా ప్రయుక్తరాష్ట్రంకోసం మనం పోరాటం చేశాం. ఈ పోరాటం రాజకీయ నాయకులకోసమో, భాషా ఉద్ధరణకోసమో జరిగింది కాదు. పాలకులకు-పాలితులకు మధ్య ఉన్న అగాధాన్ని తుదముట్టించేందుకు జరిగింది.

పాలన అంతా 'రాజభాష'లో జరుగుతుంటే పాలితులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్న దుస్థితిని తొలగించేందుకు ఆనాటి పోరాటం జరిగింది. రాజభాష స్థానంలో ప్రజలభాషకే రాజసం అబ్బితే తమకు ప్రశ్నించే అధికారం వస్తుందని గుర్తించినందువల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటాలు జరిగాయి. ప్రజాస్వామ్య ఔన్నత్యానికి భాషే పునాది. ప్రజలభాషలో ప్రభుత్వ గమనం సాగితే ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత ఏర్పడుతుంది. ప్రజ లు చైతన్యవంతులవుతారు. తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో కిందివర్గ భాగస్వా మ్యం ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్యా న్ని పరిపుష్ఠం చేస్తుంది. అలాగే న్యాయస్థానాల్లో ప్రజలభాషే ప్రధాన మాధ్యమం అయితే సామాన్యుడికి తన వ్యాజ్యంపై న్యాయస్థానంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. శాసనాలు, చట్టాలు ప్రజల భాషలోనే రూపొందించడం వలన సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. న్యాయంకోసం మరెవరిపైనో ఆధారపడాల్సిన అవసరం ఉండదు. తన హక్కులను తాను తెలుసుకోగలుగుతాడు. మొత్తంమీద శాసన, న్యాయ,పాలనా వ్యవస్థల్లో ప్రజల భాష అంతర్వాహినిగా ప్రవహిస్తుండటం వల్ల సామాన్యుల జీవితాలను స్ప­ృశించి ప్రజాస్వామ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్ర పోరాటానికి ఇదే స్ఫూర్తి. ఈ సందర్భంలో నైజాం ఉద్యమాన్ని ప్రస్తావించాలి. ఈ ఉద్యమానికి బీజం పడింది ఆంధ్రమహాసభ ఆవిర్భావంతోనేనని మరువరాదు. నైజాం కాలంలో రాజభాష ఉర్దూస్థానంలో ప్రజలభాష అయిన తెలుగు వినియోగానికి ఆంధ్రమహాసభ పోరాటం చేసింది. పాఠశాలల్లో తెలుగుమాధ్యమంలో విద్యాభ్యాసం జరగాలని డిమాండ్‌ చేసింది. పాఠశాలల్లో తెలుగులో బోధన ప్రారంభమైన తరువా త ప్రజల్లో చైతన్యం వచ్చింది. అప్పటివరకు ప్రజలు దారిద్య్రాన్ని తమ ప్రారబ్ధం అని సరిపెట్టుకునేవారు. అయితే భాషద్వారా వచ్చిన చైతన్యం ద్వారా తమ కడగండ్లకు కారణం నైజాం పాలన దాష్టీకాలేనని గుర్తిం చారు. దానితో ఆంధ్రభాషా ఉద్యమం వెట్టిచాకిరి నిర్మూలన ఉద్యమంగా మారింది. ఆ పై భూపోరాటంగా మలుపు తీసుకుంది.

చివరకు అది నైజాం పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసి అప్రతిహత ఉద్యమంగా పరిణమించింది. అంటే భాష ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఆలోచనల బీజాలద్వారా చైతన్యం అనే అగ్నిపూలు పూస్తాయి. ప్రజల పోరాటం ఫలంగా భాషా ప్రయుక్తరాష్ట్రం ఏర్పడింది. యాభైయ్యేళ్ళుగడిచాయి. అయితే దురదృష్టవశాత్తూ ఏ లక్ష్యాలకోసమైతే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామో ఆ దిశగా జరిగిన కృషి కన్పించదు. అంతకుముందు బూర్గుల రామకృష్ణారావు తీసున్న కొన్ని సాహసోపేత నిర్ణయాల కారణంగా ఉద్యమలక్ష్యాలు నెరవేరుతాయన్న ఆశాపవనాలు వీచాయి. హైస్కూలు స్థాయి వరకు బోధనాభాషగా తెలుగును ప్రవేశపెట్టారు. మరోపక్క పాలనలో న్యాయస్థానాల్లో తెలుగువినియోగం ఆరంభమైంది. ముఖ్యంగా కింది కోర్టుల్లో తెలుగు వినియోగం విరివిగా జరిగింది. దీనితో భాషా ప్రయుక్త ఉద్యమానికి ఒక స్వరూపం ఏర్పడింది. అయితే, భాషా ప్రయుక్తరాష్ట్రం ఏర్పడిన అనంతరం మాత్రం ఈ లక్ష్యాలను విస్మరించాం. రాజకీయశక్తులు ఉద్యమస్ఫూర్తిని కొడిగట్టిం చాయి. ఫ్యూడల్‌ శక్తులు ఈ కృషికి తాళాలు వేశాయి. ఇందుకు వారి స్వార్థప్రయోజనాలే కారణం. విద్యాబోధన ప్రజల భాషలో జరిగి చదువు అర్థం అయితే జనం బ్రిటిష్‌వారిపై తిరగబడినరీతిలోనే తమపై తిరుగుబాటు చేస్తారని శంకించారు. క్రమేపీ ప్రజలభాష ప్రజలమధ్యనే ఉండగా, రాజభాషలే రాజ్యమేలాయి. చివరకు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంగ్లీష్‌మీడియం లేకుండా మనలేవని ప్రస్తుత సర్కార్లు తేల్చిచెబుతున్నాయి. అయితే, తమిళనాట ఇలా జరగలేదు. అక్కడ బ్రాహ్మణ-సంస్క­ృత వ్యతిరేక ఉద్యమాలు అంతిమంగా ప్రజలభాషకు ప్రాభవాన్ని తెచ్చిపెట్టా యి.

ప్రాచీనత, ఆధునికత విషయం ఎలా ఉన్నా అక్కడ ప్రజలభాషకు మన్నన లభించింది. మన రాష్ట్రంలో భాష-ప్రామాణికతల రీత్యా మరొక పరిణామాన్ని చూస్తున్నాం. ప్రజల భాషలో కూడా ఒక ప్రాంత భాష ఇతర ప్రాంతభాషలపై అజమాయిషీ చేస్తూ ప్రామాణికభాషగా పరిణమించింది. ఒక ప్రాం తంలో అభిమానభాష మరొక ప్రాంతంలో దుష్టభాషగా ముద్రపడింది. ఫలితంగా భాషద్వారా ఐక్యత రావాల్సింది పోయి విచ్ఛిన్న ఉద్యమాలు మొదలయ్యాయి. భాషద్వారా మనిషిలో వచ్చే వికాసం సమైక్యతను మరింత పటిష్టం చేయాలే తప్ప విచ్ఛిన్నం చేయరాదు. మరొకవైపు సర్వీసురంగంవైపు ఉపాధికోసం చూడాల్సివస్తున్న ఫలితంగా ఉద్యోగకల్పనాసంస్థల ఆకాంక్షల మేరకు విద్యాభ్యాసం చేయాల్సివస్తోంది. వారికి కావలసింది ఆంగ్లమాధ్యమమే కాబట్టి దానినే ఆశ్రయిస్తున్నారు. ప్రజల భాష కనుమరుగవుతోంది. భాషా ఔన్నత్యం, భాషా వినియోగం రీత్యామనం తిరోగమనంలో ఉన్నాం. ఏ లక్ష్యాలకోసం భాషా ప్రయోక్త రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని తుంగలో తొక్కాం. ప్రజలభాషగా భాసిల్లాల్సిన భాషను భావితరాలకు పరిచయం చేయలేని దుస్థితిలో పరిమిత వర్గ భాషగా మిగిల్చాం. అందుకే ఇప్పుడు తెలుగుకు కావల్సింది ప్రాచీనహోదా కాదు. అట్టడుగు ప్రజల హృదయాలలో పట్టాభిషేకం. చదువు,పాలన,శాసనం,చట్టం అన్నీ ప్రజలభాషలో జరగాలి. చదువు ఇంటిభాషలో జరిగితే పిల్లలకు ముందు అర్థం అవుతుంది. పాఠశాలను తన ఇల్లులాగే భావిస్తారు. ప్రేమిస్తారు. ఇంటిభాష అంటే ఒక గిరిజన కుటుంబంలో మాట్లాడేభాష, ఒక దళిత కుటుంబంలో మాట్లాడేభాష. ఇలా ఏదయినా కానీయండి విద్యార్థి ఇంటిభాషలో విద్యాభ్యాసం జరిగితే అర్థం అవుతుంది. చెప్పే విషయం అర్థం అయితే ఆలోచన పెరుగుతుంది. ఆలోచనల స్రవంతి అవగాహనను పెంచుతుంది. అవగాహన చైతన్యాన్ని రగిలిస్తుంది. పాలనలో, శాసననిర్మాణంలో, చట్టం అమలులో ప్రజలభాషే కనబడాలి. ప్రస్తుతం ప్రజలభాషగా తెలుగుకు పట్టాల్సిన ప్రాభవం ఇదే. దీనివల్ల భావితరాల మేథోసంపన్నత రాష్ట్ర వికాసానికి హారతి పడుతుంది. ప్రాచీనభాష హోదావల్ల వచ్చేనిధులకంటే ఈ 'పెన్నిధి' శాశ్వతం. సామాన్య ప్రజలకు సుసంపన్నం.

Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh classical ancient language status India Indian Chukka Ramaiah Andhra Jyothy tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Monday, February 20, 2006

నీవు లేక వీణ

Just now recorded this.

'neevu lEka veeNa' from the movie 'Doctor Chakravarthy'





Please excuse a few pronunciation errors!

Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, February 19, 2006

Adilabad : Manuscript survey unearths rare Telugu works

S. Harpal Singh
  • Surveyors collect material from houses, old mosques and other areas in the district
  • Surveyors have conducted a preliminary survey of manuscripts across the district
  • మహాయంత్రం (Mahayantram), చిందు భగవతం (Chindu Bhagvatam) among others discovered
  • Local versions of రామాయణ (Ramayana) and భారతం (Bharatam) found at homes in Mamda and Nirmal
ADILABAD: Among other properties, `archaic' objects have the nature to `sensitise' as is being made out by the teachers involved in survey of manuscripts in Adilabad district.

`Enriching experience'

"When we saw the Vashikarana mantram (spell casting chants) on the 300-year-old Korutla bond paper we were sort of spell bound. The old manuscript fuelled a urge within us to unearth more of such writings," disclosed the teacher duo of Pathi Shiva Prasad and Tummala Devaram from Nirmal town.

They belong to the handful of district surveyors of manuscripts busy in cataloguing and creating awareness about manuscripts under the National Manuscript Survey Mission.

"Yeh maqtoolat dekh ke mereku ek naya ehsas hua. Hamari tareeq ke bare mein ane vali nasl ku ham is zariye se bata sakte hain and batana zaroori hai (On seeing the palm leaf writings I felt a new awakening. Coming generations should be made familiar with our history and culture through manuscripts)" observed Md. Khaleeluddin of Sirpur-T. The district surveyors have conducted a preliminary survey of manuscripts across the district and have come up with some rare material from private repositories.

Khaleeluddin says he has visited a few homes and places like old mosques in Sirpur-T, Koutala and Bejjur mandals inquiring about the manuscripts.

He found many of those in the form of letters and even wills. He also found a `Maha yantram' which is an old type of horoscope telling.

Discoveries

The famous `Chindu Bhagvatam' of the legendary Pantulu Dharmaiah was discovered by Devaram from Ola village in Kuntala mandal. Similarly, manuscripts of local versions of Bharatam and Ramayana were found at homes in Mamda and Nirmal.

Chalukya period tablets

Tablets from the period of Chalukyas were found in Lolam mandal during the preliminary survey. These tablets were adorning the walls of the home.

Courtesy: The Hindu
Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Nizamabad : Collectors to be feted for making Telugu official

Nizamabad first in the State in implementing Telugu as official language
  • YSR to felicitate three Collectors at function on Feb.21
  • 177 offices in Nizamabad district implementing Telugu
  • English typewriters are being replaced in every office
NIZAMABAD: The Andhra Pradesh Official Languages Commission on the occasion of the International Mother Tongue Day, on February 21, will honour three district Collectors, D.V. Raidu (Nizamabad), Y.V. Anuradha (Anantapur) and Anil Kumar Singhal (the then East Godavari Collector and now Visakhapatnam Collector) for effectively implementing Telugu as the official language.

Chief Minister Y.S. Rajasekhara Reddy will felicitate them at a function -- "Bhasha Mahotsavam" -- to be held at Lalitha Kalatoranam in Hyderabad, according to an official release.

Nizamabad district stood first in the State in the implementation of Telugu as the official language as the administration had taken several steps for it. As many as 177 offices in the district have been implementing it strictly and all signboards and rubber stamps of the officials have been made in Telugu.

Strict measures

Sending of files in Telugu language have been made compulsory. If any file is received in English at the Collector's office explanation is being called for and even charge memos are being issued.

English typewriters are being replaced in every office. As a result, till date Telugu is used 98 per cent in official transactions at village level, at mandal level it is 96 per cent and at district level it is 80.55 per cent. At district level it was 28 per cent in 2004 and 74 per cent in 2005.

The Official Language Commission member, Kaluva Mallaiah during his recent visit to the district has appreciated the district Collector for taking a special interest and making significant efforts for implementing Telugu as the official language in the district.

Courtesy: The Hindu
Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, February 18, 2006

తెలుగు భాషపై సభలో తీర్మాణానికి సిఎం హామీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి 17(ఆన్‌లైన్‌): తెలుగుభాష ప్రాచీనతపై శాసనసభలో తీర్మానం చేయనున్నట్లు రా ష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి హామీ ఇచ్చారని అధికార భాషా సంఘం అధ్యక్షులు ఎ.బి.కె. ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురావస్తు పరిశోధనా సంస్థ ఇటీవల వెల్లడించిన తంబయ్యదానం శాసనానికి సంబంధించిన ఛాయాచిత్రాలను, ప్రతులను సిఎంకు అందజేసినట్లు తెలిపారు.
తెలుగుభాషకు సంబంధించిన చారిత్రక ఆధారాలను సేకరించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ అధ్యక్షులు, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ, అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్‌ కూడా సిఎంను కలసిన వారిలో ఉన్నారని తెలిపారు.

Courtesy: ఈనాడు
Technorati tags: ,
Andhra Pradesh classical ancient language status tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


BITS' Hyderabad campus' ground-breaking ceremony on Telugu New Years' day

Poor, meritorious students of the institute to get scholarships, says Chief Minister
  • Ground-breaking ceremony on Ugadi day
  • Allotted 200 acres of land near Shamirpet
  • Third campus to offer all courses as in Pilani
Hyderabad: After Fab City and Infosys, it is now the turn of the prestigious BITS (Birla Institute of Technology and Sciences) to set up its campus in Hyderabad.

The State Government received a communication from the Vice-Chancellor of BITS, Pilani, Rajasthan, requesting for allotment of 200 acres of land at Jawaharnagar, near Shamirpet, in Ranga Reddy district.

The Government readily agreed to do so and the result - the ground-breaking ceremony for the third campus of BITS will be held on Ugadi on the Telugu New Year day.

Chief Minister Y.S. Rajasekhara Reddy has written a letter to institute's founder K.K. Birla, thanking him for his choice and invited him to take part in the foundation laying ceremony.

Dr. Reddy, who enjoys a personal rapport with Mr. Birla, had repeatedly suggested to him to open the third campus of the institute, after Goa and Pilani, in Hyderabad.

Nearly eight months ago, Mr. Birla wrote to Dr. Reddy displaying interest in the proposal but expressed helplessness at that juncture due to financial implications.

The fact that nearly one third of seats in the BITS every year are bagged by the students from Andhra Pradesh went in favour of the present decision.

Consequently, a Government Order was issued on Thursday directing the Hyderabad Urban Development Authority (HUDA) to allot land at a cost of Rs.1.5 lakh per acre.

Expressing happiness at this development, Dr. Reddy announced that poor and meritorious students of the institute would be entitled for scholarships just as those studying in other institutes in the States.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


తెలుగు వర్ణమాల పాట

by Thotakura Venkat Rao, Cherukupalli, Guntur dist., AP

తీపి తీపి తెలుగు తేట తేట తెలుగు అని మనం మన తెలుగు భాష గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన, వేమన... వంటి మహా కవులను స్మరించుకుంటాం. 'దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకుంటూ అన్న మాటలు తలుచుకొని మురిసిపోతాం. మరి మనం తెలుగుకు నిజంగానే అంత ప్రాధాన్యం ఇస్తున్నామా? మన సొంతభాషను గౌరవిస్తున్నామా? మన స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం మోజులో పడి మాతృభాషకు అన్యాయం చేస్తున్నామా? ఈ విషయాన్ని ఈ వయసు నుంచే మనం ఆలోచించాలి. మన తీయటి తెలుగును ప్రేమించాలి. దాని గొప్పదనాన్ని తెలుసుకొని గర్వించాలి. మరోవైపు తమిళులు వాళ్ల తమిళభాషను భారత ప్రభుత్వం చేత 'ప్రాచీన భాష'గా గుర్తింపచేసుకున్నారు. వాళ్లది తక్కువ భాష కాదుగానీ మనది వాళ్ల కంటే తక్కువ భాష మాత్రం కాదు. కనుక మేల్కొందాం. తెలుగు నేర్చుకుందాం. ప్రతిఒక్కరికీ నేర్పుదాం. అందుకోసం ఈ అందమైన 'వర్ణమాల' పాటను ఉపయోగించుకుందాం. 'అ' నుండి 'ఱ' వరకు తెలుగు అచ్చులు, హల్లులు వచ్చేలా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అల్లిన గేయం ఇది. చూడండి...

పల్లవి : అందరము బడిపిల్లలము
హాయిగ బడికి వెళ్లెదము
అ, ఆ, ఇ, ఈ నేర్చుకుని
ఆగ పాటల గడిపెదము

ఉదయపు సూర్యుని వెలుగులలో
ఊయలలూగి హాయిగొని
ఋషులను తలచి ప్రణమిల్లి
ఋతువుల గీతం పాడెదము...

ఎల్లలు మాకు చెల్లవని
ఏవో పాటలు పాడుకొని
ఐదు రూకలు ఇచ్చుకొని
ఒక్క తామయమును కొంటాము

ఓహో అంటూ గంతులిడి
ఔనని అంతా ఏకమయి
అందరు దానిని పంచుకుని
అః అః అని తింటాము

కమలపు పూవులు కోసుకొని
ఖర్జూరరాలను రుచి చూచి
గంధపు చెట్టు నీడలలో
ఘటములో నీరు తాగెదము

సఙ్గతి తెలిపే గురువులను
చక్కగ ముందుగ స్తుతియించి
ఛత్రము పట్టి పూజించి
జయమును యిమ్మని వేడెదము...

ఝంఝామారుత వేగంతో
జ్ఞానమునెంతో ఆర్జించి
టకటక ప్రశ్నల బదులిచ్చి
ఠావుల మీద రాసెదము

డండం, డండం నాదమిడె
ఢంకను బాగా మోగించి
వీణతో గీతం పాడించి
తబలల తాళం వేస్తాము

కథలతో కాలం గడిపేసి
దశదిశలన్నీ పరికించి
ధవళపు కాంతుల వెలుగులలో
నవగీతాలను పాడెదము...

పగలు రేయి ఆడుకొని
ఫలములనెన్నో కోసుకొని
బంగరు సందెల పరుగిడుతు
భయమును లేక తిరిగెదము...

మధ్యాహ్నపు మాపులలో
యతులై ఎండలో తిరుగాడి
రంగుల రెక్కల నడయాడె
లకుముకి పిట్టల చూచెదము

వన్నెలు చిన్నెలు వెలయించే
శంఖపు సొంపుల గమనించి
షరతులు లేని ఊసులతో
సంబరపడుతూ సాగెదము

హరిత వనంబుల ఆడుకొని
గళములనెత్తి పాడుకొని
క్షణమొక రీతిగ గడిపేసి
ఱంగలరాట్నం ఎక్కెదము...

రచన: తోటకూర వెంకటరావు, టీచర్‌ చెరుకుపల్లి, గుంటూరు జిల్లా

Courtesy: ఆంధ్ర జ్యోతి

Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'