"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Friday, March 24, 2006

గణిత మహా శతావధాని 'శ్రీ' హర్ష కు ఉగాది పురస్కారం

తిరుపతి,మార్చి 24(ఆన్‌లైన్‌): గణిత మహా శతావధానిగా పేరు గడించిన తిరుపతివాసి మాస్టర్‌ కానాల శ్రీహర్ష చక్రవర్తి ప్రతిభాపాటవాలను గుర్తించిన ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించనుంది. ఈనెల 30వ తేదీ ఉగాది పర్వదినాన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేతులు మీదుగా పుర స్కారాన్ని శ్రీ హర్ష అందుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చర్‌ ఈ పురస్కారం ప్రదానం చేస్తుంది. పెన్ను, పేపర్‌, కాలిక్యులేటర్‌, కంప్యూటర్‌లు లేకుండానే గణితం- ఖగోళం- కంప్యూ టర్‌ గణితానికి చెందిన క్లిష్టాతిక్లిష్టమైన సమస్యలకు క్షణాల్లో సమాధానమివ్వడంలో శ్రీహర్ష దిట్ట. ప్రపంచ ప్రప్రథమ మహాగణిత శతావధానిగా పేరుగడించారు.

పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే శ్రీహర్ష అభినవ ఆర్యభట్ట, సరస్వతీ పుత్ర, ఉద్దండ బాలభాస్కరు లాంటి 26 బిరుదాంకితాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటికి 95 అవధానాలు, 2 మహా గణిత శతావధానాలు చేసి 155 సన్మానాలు పొందారు. లేత వయసు నుంచే గణితంలో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ వండర్‌ చైల్డ్‌గా కితాబుపొందారు. తెలుగుజాతి గర్విం చేలా గణిత మేధావి శ్రీహర్ష మరిన్ని సత్కారాలు పొం దాలని ఆశిద్దాం. తనయుడికి ఉగాది పురస్కారం రావడంపై తల్లి దండ్రులు కానాల నల చక్రవర్తి, లక్ష్మీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu avadhani Sri Kanala Harsha Tirumala Tirupati maths mathematics Ugadi award Andhra Pradesh


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 8:59 PM, Blogger Bhale Budugu గారు చెప్పినారు...

good info... we need poeple like you

 
At 2:35 PM, Blogger v_tel001 గారు చెప్పినారు...

Thanks Thyaga gAru.

మీ బ్లాగ్ కూడ చాలా బాగుంది

 

Post a Comment

<< Home