"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, April 30, 2006

Telugu University to aid writers

Potti Sri Ramulu Telugu University is offering financial assistance to writers in printing Telugu literature, culture and history books written by them. Registrar of the University Acharya Gurumurthy said applications are being invited for 2006-07 from writers for financial assistance to get books pertaining to Telugu literature, culture and history written in Telugu and other languages printed. Filled in applications should reach in-charge, Potti Sri Ramulu University before May 31.

Annual exams

Potti Sri Ramulu Telugu University will conduct annual examinations for all courses offered by the Government Music and Dance Colleges. Exams for the certificate courses will be on May 22 while for diploma courses exams will be on May 23 and 24. Candidates can collect the hall tickets from college principals from May 15.

Music fete

The music wing of Potti Sri Ramulu Telugu University recently conducted `Tyagaraja Aradhanosthavam' at N.T.R. Kalamandir in the university.

Dance training

Telugu University, is conducting 45-day Kuchipudi dance training programme at Sri Siddendra Yogi Kuchipudi Kalapeetham in Krishna district from May1. In a press release, the university Public Relations Officer said that the programme would be held in junior and senior streams and students would be provided accommodation on the peetham premises. For details contact, Principal, Sri Siddendra Yogi Kuchipudi Kalapeetham over phone number: 08671-252246/ 9440070753.

Kakatiya University

Kakatiya University will cancel the conduct of entrance examination for LLM, PG course in Law as the number of applicants was less than the seats at the PG level.

The university has received only 75 applications this academic year. It is argued that the demand was less as the course has no job potential. N. Ravi, principal of Adarsha Law College pointed out that students were not available at PG level as the pass percentage at the graduation level had come down.

SVU

Sri Chinmoy Centre, USA, has donated 2,600 books to the SV University library. Vice-Chancellor S. Jayarama Reddy on Thursday inaugurated the array of books, which were mostly on religion, philosophy, meditation and yoga, and named the stand after Sri Chinmoy.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Telugu Film Festival in Hyderabad starts

HYDERABAD: The Andhra Pradesh State Film Television and Theatre Development Corporation is organising a 40-day Telugu Film Festival at తెలుగు లలిత కళ తోరణం (Telugu Lalitha Kala Thoranam). The festival, for which entry is free, starts on May 2 with the screening of మాయా బజార్ (Maya Bazar) and concludes on June 15.

The films scheduled for screening include ప్రతిఘట్న (Prathighatana), అంతస్తులు (Anthasthulu), సూర్యవంషం (Suryavansham), వర్షం (Varsham), డా. చక్రవర్తి (Dr.Chakravarthi), స్వాతి ముత్యం (Swati Muthyam), పండంటి కాపురం (Pandanti Kapuram), వీరాభిమన్యు (Veerabhimanyu), స్వయం కృషి (Swayam Krushi), శ్రుతి లయలు (Sruthi Layalu) and తొలి ప్రేమ (Tholi Prema). However, there will be no screenings from May 11 to 14 and also on May 28.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, April 27, 2006

పద్మభూషనుడికి 'Mega' సమ్మానం


Padma Bhushan Chiranjeevi was grandly felicitated by the entire Telugu film industry on 23rd evening at a glittering function here in Gachi Bowli Stadium, Hyderabad. The living legend Amitabh Bachchan was the Chief Guest. Sai Kumar and Paruchuri Venkateswara Rao anchored on the show.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, April 26, 2006

Classical status demand: AP High Court's directive to Center

తెలుగుపై స్పందించండి
కేంద్రానికి హైకోర్టు ఆదేశం... 6 వారాల గడువు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

తెలుగుకు ప్రాచీనహోదా కల్పించడంపై కేంద్ర వైఖరిని ఆరు వారాల్లోగా తెలియజేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించకపోవడంపై ఆంధ్రజ్యోతి సంపాదకుడు రామచంద్రమూర్తి, తెలుగుదేశం తరపున అధ్యక్షుడు చంద్రబాబు దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. దరఖాస్తు సమర్పించి రెండు నెలలు దాటినా కేంద్రం స్పందించలేదని రామచంద్రమూర్తి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెయ్యేళ్ల చరిత్రఉంటే ఇంతకుముందు తమిళ భాషకు ప్రాచీన హోదా కల్పించిన కేంద్రం.. అక్టోబరు 2005 తర్వాత దాన్ని రెండు వేల ఏళ్లకు మార్చిందన్నారు. తమిళ భాషకు అలా గుర్తింపు ఇచ్చి ఆనక ఇలా నిబంధనను మార్చడం తగదని నివేదించారు. దీనివల్ల తెలుగుతోపాటు కన్నడం, మలయాళం భాషలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో 11 కోట్లకుపైగా జనాభా తెలుగు భాషను మాట్లాడుతున్నారని చెప్పారు. దీనిపై కౌంటరు దాఖలు చేశారా అంటూ కేంద్రం తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించగా.. లేదంటూ, మరికొంత గడువు కావాలని ఆయన కోరారు. తదుపరి విచారణను కోర్టు జూన్‌ 26కు వాయిదా వేసింది. తెలుగును కేవలం ఒక ప్రాంతానికి చెందిన భాషగా మాత్రమే గుర్తించడం సరికాదంటూ తాను దాఖలుచేసిన పిటిషన్‌ ఒకటి పెండింగ్‌లో ఉందని ఈ సందర్భంగా తెలంగాణా సేవా సమితి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికితెచ్చారు. ఆ పిటిషన్‌ ఉంది సరే.. అసలు తెలుగు తీయనిదా కాదా చెప్పండి అంటూ ఆయనను హైకోర్టు ప్రశ్నించింది. తెలుగు ఒక్కటే తీయనిదంటూ ఇతరులను రెచ్చగొట్టే ప్రకటన తాను చేయలేనని, అన్నీ తీయనైనవేనని ఆయన పేర్కొన్నారు.


కోర్టు ధిక్కారం గురించి తెలుసా: ఆంధ్రజ్యోతి సంపాదకుడు రామచంద్రమూర్తిపై కోర్టు ధిక్కార చర్య కోసం సేవా సమితి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై హైకోర్టు మండిపడింది. అసలు ధిక్కార పిటిషన్‌ ఎలా దాఖలు చేయాలో తెలుసా అంటూ సమితి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఎవరు కోర్టు ధిక్కారానికి పాల్పడినదీ.. ఎలా పాల్పడినదీ వివరాల్లేకుండా కోర్టు వ్యవహారాలను దుర్వినియోగం చేస్తున్నారని తప్పుబట్టింది. తెలుగుకు ప్రాచీన హోదా కోసం రామచంద్రమూర్తి వ్యక్తిగతంగా పిటిషన్‌ వేసి.. దానిని ఆంధ్రజ్యోతి వేసినదిగా వార్తలు రాయడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సమితి ఆ పిటిషన్‌ వేసింది. అయితే రామచంద్రమూర్తి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సమితి తగిన ఆధారాలు చూపలేకపోయిందని హైకోర్టు స్పష్టంచేసింది.

Courtesy: ఈనాడు
*****

'తెలుగు భాషకు ప్రాచీన హోదాపై చర్యలేమిటో చెప్పండి'

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆన్‌లైన్‌): తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ వర్తమాన స్థితిపై నివేదిక (స్టేటస్‌ రిపోర్ట్‌) దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వార్తాకథనాన్ని ప్రచురించినందుకు 'ఆంధ్రజ్యోతి'పై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలంటూ తె లంగాణ సేవాసమితి తరఫున బి.రామ్మోహనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం కోర్టు ధి క్కారం కిందకు వస్తుందని నిరూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని ధ ర్మాసనం పేర్కొంది.

కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేశారంటూ రామ్మోహనరెడ్డిని మందలించింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరు తూ 'ఆంధ్రజ్యోతి' సంపాదకులు కె.రామచంద్రమూర్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గణపత్‌సింగ్‌ సింఘ్వీ, న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంథి భవానీప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరామగిరి రామచంద్రరావు వాదించగా, కేంద్ర ప్రభుత్వం తరఫున ఎ.రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. తెలుగు భాష ప్రాచీనతపై వ్యాజ్యం దాఖలు చేసి రెండునెలల పది రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రామచంద్రరావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2005 అక్టోబర్‌లో ప్రాచీన భాష హోదా పొందేందుకు వెయ్యి సంవత్సరాల అర్హత అవసరమని చెప్పిన కేంద్రం తర్వాత దాన్ని రెండువేల సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని వాకబు చే యగా, కౌంటర్‌ దాఖలు చేయలేదని చెప్పారు. దీనిపై ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన రామ్మోహనరెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ 'ఆంధ్రజ్యోతి' ఎడిటర్‌గా పనిచేస్తున్నారని, అయితే ఈ వ్యాజ్యాన్ని ఎడిటర్‌ హోదాలో దాఖలు చేయలేదని చెప్పారు. దీనికి స్పందిస్తూ ధర్మాసనం.. తెలుగు భాష తియ్యనైనదా? కాదా? అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించగా, అన్ని భాషలూ తియ్యనైనవే అని ఆయన బదులిచ్చారు. ఇంతలో రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, రామ్మోహనరెడ్డి ఇంతకూ తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడానికి అనుకూలమో, వ్యతిరేకమో తెలియజేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్టేటస్‌ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, కేసును జూన్‌ 26వ తేదీకి వాయిదా వేసింది.

Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh Hyderabad classical ancient language status demand ap high court centre tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


ఈ-గ్రంధాలయ: Library books a click away


HYDERABAD: Finding the book that you want from a public library will become an easy task with the help of an application software to be installed in libraries in the state soon.

The software, ఈ-గ్రంధాలయ (e-Grandhalaya), will be installed in all government libraries in the state in a phased manner. With this facility the number of books on a particular subject or an author and any such details can be had at the click of a mouse.

About 45,000 old and selected Telugu books have already been digitised under the e-Digital Library Project. e-Grandhalaya, developed by the National Informatics Centre (NIC), will be provided free of cost to the department of public libraries and implemented in 30 regional and district libraries to start with.

There are about 1,800 public libraries in the state and these will be covered in a phased manner.e-Grandhalaya is a catalogue software that will be connected to a central control at NIC in Hyderabad.

A database of the nearly 2 crore books will be stored here and the software made available at all the libraries. A workshop to train librarians in the use of this software began here on Tuesday.

"The software will be installed in two or three computers in each library,"said director of public libraries S Ravi Kumar.

The software is already in use in Bangalore. Once all the regional and district libraries are covered, it will be extended to mandal-level libraries.

Courtesy: Times of India


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Tuesday, April 25, 2006

ఇంటింటా తెలుగు దివ్వె

డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌

తె
లుగువారిలో ప్రతి ఒక్కరూ తెలుగుకు నిలువెత్తు దర్పణంలా నిలవాలి. మనం పలికే ప్రతి పలుకులో తెలుగుకే పట్టం కట్టాలి. ప్రతి పలకరింతా తెలుగు పులకరింత కావాలి.


నం నిలబడాలనుకొంటే పక్కవాణ్ని పడేయాలనుకోవడం అవివేకం. అలాగే తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే, ఏవో కొన్ని భాషల వ్యాప్తిని అరికట్టాలనుకోవడం కూడా అవివేకమే. ఇప్పటికయినా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా మనలో తెలుగు బాగా వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మనం చిత్తశుద్ధితో కొన్ని నిర్ణయాలు తీసుకొని, వాటిని తు.చ. తప్పకుండా ఆచరిస్తే ఫలితం కచ్చితంగా వచ్చి తీరుతుంది. మనల్ని చూసి ప్రభుత్వం కూడా మార్గం మార్చుకుంటుంది.

ముందుగా- తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వారి సంతకాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుగులోనే చేయాలి. బ్యాంకు లావాదేవీల దగ్గరనుంచి, ఉద్యోగం చేసే చోట చేస్తున్న పొట్టి సంతకాల దాకా! మనమందరం కలిసి ప్రతిరోజూ సాగించే ఉత్తర, ప్రత్యుత్తరాలు అసంఖ్యాకంగానే ఉంటాయి. ఆ ఉత్తరాలలో నిర్దేశించిన విషయం ఆంధ్ర దేశ పరిధిలో ఉంటే, ఆ విషయాన్ని; ఉత్తరాలపై రాసే చిరునామాల్ని కూడా తెలుగులోనే రాయండి. ఒకవేళ ఆయా అధికారులు ఆంధ్రేతరులైనట్లయితే, తెలుగులో ఉన్న ఆ లేఖల్ని చదివి తర్జుమా చేయించుకునే తలనొప్పి వారిదే అవుతుంది. బజారుకు వెళ్ళి మనమేదైనా కొనేటప్పుడు వాటి పేర్లను సహజంగా తెలుగులోనే చెప్పి కొనుక్కురండి. నిత్యావసర వస్తువుల్ని, పచారీ సామాన్లను, కూరగాయలను, పండ్లను ఇలా పలకడానికి ఇబ్బందిలేని, తెలుగు భాషలో చక్కని పదాలు ఉన్న వాటిని ఆ పేర్లతోనే పలకండి. తెలుగు భాషలో లేని పదాలు గల ఇతర భాషలలోని వస్తువుల పేర్లను (టీవీ, సైకిలు, రేడియోవంటివి) అలాగే పలకండి. బ్యాంకు ఫారాలను, మనియార్డరు ఫారాలను, చలానాలను నింపేటప్పుడు ఒకవైపు ఆంగ్లంలోనూ, మరొకవైపు తెలుగులోనూ నమూనా ఉంటే తెలుగులోనే కచ్చితంగా నింపండి. టీవీ చూస్తున్నప్పుడు తెలుగు ఛానళ్ళనే చూడండి. తెలుగు భాషతోపాటుగా మనోవికాసాన్ని కలిగించే భాగవతం, దేవీ భాగవతం, పంచతంత్రం వంటి కార్యక్రమాలను తప్పనిసరిగా పిల్లలకు చూపించండి. మీ పిల్లల్ని రోజుకో గంట సేపు మీ ఇంట్లో ఉన్న వృద్ధుల దగ్గర కూర్చోపెట్టండి. వారి చేత తెలుగు సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, కథలు, పాటల రూపంలో చెప్పించండి. కొత్తగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తప్పనిసరిగా తెలుగు భాషను ఎంపిక చేయండి. ఇంటి దగ్గర పిల్లలకు రోజూ కొన్ని కొత్త తెలుగు పదాల్ని నేర్పిస్తూ తెలుగులోనే మాట్లాడండి. కనీసం వారానికో పద్యం వాళ్లు నేర్చుకొని చక్కగా చదివేటట్టు చూడండి. విజటింగ్‌ కార్డులను, వివిధ శుభకార్యాలకోసం మనం ముద్రించే శుభలేఖలను తెలుగులోనే ముద్రించి అందరికీ పంచండి. పాఠశాలల్లో తెలుగులో మాట్లాడవద్దని నియంత్రించే యాజమాన్యాన్ని తల్లిదండ్రులందరూ కలిసి నిలదీయండి. ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడేవారికి చిన్న చిన్న బహుమతుల్ని ఇవ్వండి. ఎవరైనా తెలుగు వచ్చి కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడితే వారితో తెలుగులోనే మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అపరిచితులకు తెలుగు రాదేమోనని ముందుగా మీరే ఊహించేసుకొని ఆంగ్ల సంభాషణ ప్రారంభించకండి. చక్కగా తెలుగులోనే మాట్లాడండి. వారికి చక్కగా అర్థమవుతుంది. ఏవైనా దరఖాస్తులు రాయవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ తప్పుల తడకలతో ఆంగ్లంలో రాయడం మానేసి చక్కగా తెలుగులో స్వేచ్ఛగా రాసి (మాట్లాడే భాషనే) ఆత్మవిశ్వాసంతో నిలబడండి. శుభాకాంక్షల్ని నోరారా తెలుగులోనే తెలియజేయండి. (ఎదుటి వారు ఇంగ్లీషులో చెప్పినాసరే!) వారానికొక రోజు (సెలవు రోజైన ఆదివారమైతే మరీ మంచిది) పూర్తిగా చక్కని తెలుగు భాషలో మాట్లాడాలనే నిర్ణయాన్ని ఇంటిల్లిపాదీ తీసుకొనేట్లు చూడండి. ఆచరింపజేయండి. ఇలా ప్రతిఒక్కరూ నిత్యం తెలుగును గుర్తుంచుకొని వ్యవహరించాలి. ఇప్పటికే తెలుగు వచ్చినవారంతా ఈ సూచనలు పాటిస్తే తెలుగుకు ప్రాచుర్యం తక్కువ కాలంలోనే ఎక్కువగా లభిస్తుంది.

ఇక- అసలు తెలుగువారై ఉండి, తెలుగు భాషలో రాయడం, చదవడం వంటివి రానివారి కోసం ప్రభుత్వం కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తెలుగు భాషను బోధించని, ప్రాధాన్యం ఇవ్వని పాఠశాల తెలుగుదేశంలోనే ఉండకూడదు. చిన్నప్పటినుంచి తెలుగును నిర్బంధ విద్యగా అమలు చేయాలి. తెలుగుదేశంలో ప్రతి ఒక్కరికీ అ, ఆ, ఇ, ఈ లతోనే చదువు ప్రారంభం కావాలి. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య దాకా తెలుగుకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పించాలి. వృత్తి విద్యా కోర్సులలో సైతం తెలుగు భాషా సాహిత్యాలకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఉద్యోగ ప్రకటనల్లోని నియమ నిబంధనలలో... తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉంటేనే అర్హతగా ప్రకటించాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగాలకే కాక ప్రయివేటు ఉద్యోగాలకు కూడా వర్తింపజేయాలి. (ఇది తెలుగు మాతృభాషగా కలవారికి మాత్రమే) ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకు సముచిత స్థానం కల్పించాలి. పరీక్షలలో ఉత్తీర్ణత శ్రేణిని నిర్ణయించడానికి తెలుగు మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో..., ఆంధ్ర దేశం వరకు పరిమితమయ్యే అధికారిక లేఖా వ్యవహారాలన్నీ తెలుగులోనూ; ఆంధ్రేతర ప్రాంతాలతో జరిపే వ్యవహారాలలో తెలుగుతోపాటుగా అన్యభాషలలోనూ జరిగేటట్లు శాసనం చెయ్యాలి. కంపెనీల, సినిమాల, షాపుల, అధికారుల పేర్లు, హోదాలు ఇలా అన్నీ తెలుగులో (తెలుగు లిపిలో) రాసేటట్లు ఆజ్ఞలు జారీ చేయాలి. శాసనసభలో నాయకులు మాతృభాషలోనే ప్రసంగించాలి. ఇలాంటివి ఎన్నో ఆలోచనలు మనసు పెట్టి ఆలోచిస్తే స్ఫురిస్తాయి. అలా స్ఫురించినవాటిని ఆచరణలోకి తీసుకువస్తే ప్రయోజనం ఉంటుంది.

తెలుగును వ్యాప్తి చేయడంలో ప్రజల బాధ్యత ప్రజలది, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానిది. సాధ్యమయినంత వరకు మన నిత్య జీవనాన్ని పూర్తిగా తెలుగుమయం చెయ్యడానికి ఎవరికీ ఏ ఇబ్బందికానీ ఖర్చుకానీ ఉండదు. ఉద్యమాలు చేసి ఆయాసపడనక్కర్లేదు. ఉద్యమస్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అది నూటికి నూరుపాళ్ళూ ఆచరించేదిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తక్కినవారిని ప్రభావితం చేసి కార్యోన్ముఖులయ్యేలా చూడాలి. ఇది మనందరి గురుతర బాధ్యత. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపజేయడమో, లేక క్రమక్రమంగా కొండెక్కిపోతున్న వెలుగును పోగొట్టుకొని, మన భాషా సంస్కృతుల్ని అజ్ఞానంలోనికి నెట్టుకొని ఉనికిని కోల్పోవడమో... అంతా మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది. ఆలోచించండి. ఆచరించండి. ఉద్యమించండి.

Courtesy: ఈనాడు
Telugu Andhra Pradesh Dr. Addanki Srinivas Eenadu April 2006


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, April 23, 2006

Don't ignore mother tongue, says Minister

HYDERABAD: A meeting organised by the ఆర్య ప్రతినిధి సభ (Arya Pratinidhi Sabha) here on Sunday to discuss steps to protect Indian languages and culture expressed concern over the influence enjoyed by English at the cost of provincial languages in the country.

Union Minister of State for Mines T. Subbarami Reddy said English was necessary in the computer age, but people could not ignore their mother tongue at the same time. He praised the unique character of Indian culture. Language and culture were inseparable, he added.

Jnanpeeth awardee C. Narayana Reddy said the existence of Indian languages and culture was threatened by the western lifestyle. He recalled a recommendation he had made to Chief Minister Y.S. Rajasekhara Reddy for compulsory Telugu-medium education in both Government and private schools up to fifth standard.

Radheshyam Shukla, Editor, Swatantra Vaartha, said the country needed a single language that bound its people. He warned against the danger of English overtaking Indian languages if Hindi was given a burial. Vithal Rao Arya, convenor of the Sabha, spoke.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, April 22, 2006

దూరవిద్యగా ప్రారంభించనున్న తెలుగువర్సిటీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు తెలుగు వర్సిటీలో దూరవిద్య విధానంలో ఎంసీజే కోర్సును ఈ ఏడాది నుంచి ప్రవేశబెట్టబోతున్నారు. దీనికి సంబంధించి త్వరల నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. ఏడేళ్ల క్రితం అప్పటి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఎన్‌.గోపి ఈ కోర్సును త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన మొత్తం పదవీకాలంలో ఇది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వచ్చిన జి.వి.సుబ్రహ్మణ్యం కూడా ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఆవుల మంజులత వైస్‌ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం యువతరం ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సుల రూపకల్పనకు తొలిప్రాథాన్యం ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ కోర్సు విషయంలో నిపుణులతో చర్చించి ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ 'న్యూస్‌టుడే'తో చెప్పారు. ఈ కోర్సు తెలుగు మాధ్యమంలో ఉంటుందని ఆయన చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు.
Courtesy: ఈనాడు
distance learning Telugu University Hyderabad


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Indian Idol II: India chooses regionalism over Talent

SonyTV's Indian Idol has become more of a gimmick with evident loopholes in the voting and selection process, and the program lacking in any kind of professionalism. This was further proved today when a superior singer NC Karunya 'supposedly' got less votes ( i won't even be surprised if i am told that the television channel tinkered with the original vote count to give us their own figures ) than his mediocre competitor Sandeep

Across India, and around the world, all sane people support Karunya. Within minutes of the result, the Wikipedia page for 'Indian Idol' screamed foul. Online forums now carry a lot of anger against SonyTV's faulty voting process, and for people who voted for Sandeep. The popularity for this contest is now going to fall tremendously.

Though Karunya has not been voted as the Indian Idol 2 by the sms/phone public, he undoubtedly has the best singing ability, and has been the favorite of the judges, and any unbiased lover of music throughout India and abroad. Inspite of being from Andhra Pradesh, where Hindi channels are not widely watched, he reached the top echelon of this contest purely through his talent. As for his mediocre competitor, the usual north-south favoritism, and his local mass Bikaner junta's support and their rigging of the voting process by repeatedly voting for him, acted in his favor.

This result has made a joke of this 'Indian Idol' contest, and is a SHAME for Indian and the organizers SonyTV.

Karunya has already won the appreciation of the bigwigs, and has a great future ahead in his singing career.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Virtual Telugu Keyboard Emulator


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Scotland incorporates Dr Ramayya’s software

Hyderabad, April. 21: Dr Pradeep Ramayya’s cutting edge medical tool has been acquired by the Government of Scotland to be introduced in its health care system.

In alumni of Osmania Medical College, Dr Ramayya of Hyderabad has developed a software which offers medicare suggestions to the patient.

The tool, dubbed Excelicare, is also widely used in the United Kingdom. Presenting his software tool for the first time in Hyderabad on Friday, Dr Ramayya said, “It does thorough documentation of all the records of patients and taking help from the immense database in the software, suggests treatment to patients. It is not restricted to just one ailment and every medical practitioner can use it through standard procedures.

That’s why, Scotland has accepted it.” Dr Ramayya is also trying to install the software in India through Vision 2020 which aims to control blindness in India. “You can monitor your patient from the house and any clinician in the world can access the data of the patient and come up with his own suggestions,” he said.

Courtesy: Deccan Chronicle


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, April 20, 2006

The divine poetry

INNER VOICE |Renuka Narayanan
April 19, 2006

I’ve been catching up on Carnatic music all of last week and in this spell of high religious holidays, many of which were about tyaag (fasting) and way away from bhog (feasting), it made an intriguing emotional contrast. The padams or devadasi love songs sung by T.

Brinda and T Mukta, the yesteryear duo of honourable musical lineage, make you think inevitably of the dynamics of మాధుర్య భక్తి (maadhurya bhakti) (“honeyed devotion”).

This is most graphically expressed in very physical terms, by the 17th century Telugu composer Kshetragna, also called క్షేత్రయ్య (Kshetrayya). Many of us may know Kshetragna through the late scholar-poet AK Ramanujan. Provocatively called When God Is A Customer his translation of Kshetragna’s erotic padams can make prudes faint.

The పదం (padam) was basically composed for a దేవదాసి (devadasi) to dance to and expresses the fervent love of the composer for God. These delicious love songs are usually sung at a slow pace and are still vehicles for the modern dancer to exhibit her skill in conveying emotion. More, she is expected, as a brave and solitary figure, to weave a magic web, to create a forcefield of feeling, into which she draws us, the spectators. We’re supposed to transcend with her, through the lyrics, music and dance, to a sense of one-ness with the One.

Kshetragna is applauded as the master of this delicate, complex form. Not much is known about him except that his real name was Varadayya, he belonged to the Andhra village of మువ్వ (Muvva) and his padams are always about his village deity, మువ్వ గోపాల (Muvva Gopala) (Krishna).

But hark at T. Subba Row’s Theosophical Society notes on the Bhagvad Gita 13:1-4: “O son of Kunti, this body is called Kshetra (Upadhi or vehicle). That which knows this (Kshetra) the wise call Kshetragna (the real self or Ego).

Courtesy: Hindustan Times


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Monday, April 17, 2006

ఆధునిక ప్రక్రియలకు ఆద్యుడు వీరేశలింగం

మంగు శివరామప్రసాద్‌

సంఘ సంస్కరణకు ఉపకరణగా సాహిత్యాన్ని చేపట్టి సాహిత్య ప్రయోజన దృష్టిని మార్చివేసిన వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. సాహిత్యం సమాజ అభ్యున్నతికే అని చాటి చెప్పిన వీరేశలింగం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప విప్లవాన్ని తెచ్చాడు. సామాజిక అభ్యున్నతితో సాహిత్యాభ్యున్నతిని సమన్వయపర్చాడు. అందువల్ల ప్రబంధానంతర కాలానికి అభ్యుదయ కవితా కాలానికి మధ్య ఉన్న ఈ విప్లవాత్మకమైన సాహితీ యుగానికి వీరేశలింగం అనే పేరు పెట్టడంలో ఆనాటి కవులు, రచయితలపై వీరేశలింగం ప్రభావాన్ని ఊహించవచ్చు. వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజాన్ని స్థాపించి భాషా ప్రచారానికి ఎనలేని సేవ చేశాడు. ఒక వైతాళికుడిగా భవిష్యత్తులో వచనానికున్న ప్రాముఖ్యతను గుర్తించి వీరేశలింగం, వ్యాసం, నవల వంటి వచన సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టి ఆధునిక తెలుగు సాహిత్యానికి వెలుగుబాట వేశాడు. హృద్యమైన గద్య రచన చేసి 'గద్య తిక్కన'గా ప్రశంసలందుకున్నాడు. తెలుగు సాహితీ సరస్వతికి ఉన్న సంప్రదాయ శృంఖలాలను తెంచి, నవ్య సాహిత్య సృష్టి చేసిన కృషీవలుడు. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, కృష్ణశాస్త్రి మొదలైన భావికాలపు కవులకు మార్గనిర్దేశం చేసే దీపధారుడు అయినాడు.

వీరేశలింగం రచనా శైలి, సంఘ సంస్కరణ భావాలతో పానుగంటి, చిలకమర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి రచయితలు ప్రభావితులే తమ గద్య రచనా శైలికి పదును పెట్టుకున్నారు. 'ఆంధ్రులు తామొక జాతివారమని ప్రకృతము చెప్పుకొనుటకు ఆత్మగౌరవము మనలో ముద్భవింప చేసినది పంతులుగారే' అని కట్టమంచి రామలింగారెడ్డి గారన్నారు. ఆచారాలు, నమ్మకాలు, మానవతా విలువలు అన్నీ కూడా కొత్త అర్థాలతో తెలుగువారి జీవితాన్ని ప్రకాశవంతం చేశాయి వీరేశలింగం దృష్టి కోణంతో. సాంప్రదాయికత వాతావరణంలో పుట్టి పెరిగిన వీరేశలింగం మొదట్లో సాంప్రదాయిక రచనలు చేసినా చిన్నయసూరిని తలదన్నేట్లుగా 'విగ్రహం', 'సంధి' అనువదించాడు. ఓష్ట్యాలు లేకుండా, వచనం లేకుండా శుద్ధాంధ్రలో నైషధం వ్రాశాడు. ఈ ధోరణి ఆగిపోవడానికి కారణం సమాజ సంస్కరణోద్యమ అవసరాలు సాహిత్యం పట్ల కలిగించిన కొత్త దృష్టే. సులభ గ్రాంథికంలో నవలలు, ప్రహసనాలు, జీవిత చరిత్రలు, వ్యంగ్య, హాస్య రచనలూ, శాస్త్ర పుస్తకాలు, పత్రికా వ్యాసాలు ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో ఆధునిక దృక్పథానికి అభినివేశం, ప్రాచుర్యం కలిగించాడు వీరేశలింగం.

ఇంగ్లీషు నాటకాలను అనుసరిస్తూ సంస్కృత నాటకాలను అనువదించాడు. సాహితీ ప్రమాణాల కన్నా ఉన్నత ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ బహుళ జనాదరణ పొందాయి. 20 సంవత్సరాల వయసులో రెండు శతకాలు వ్రాశాడు. వాటితో సంతృప్తి చెందక 'శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నైషధం' అనే అచ్చ తెలుగూ, నిర్వచనమూ, నిరోష్ఠ్యము కలసిన మిశ్రకావ్యం వ్రాశాడు. కోరంగిలో స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న రోజుల్లో శుద్ధాంధ్రోత్తర రామాయణాన్ని రచించి, బందరులోని 'పురుషార్థ ప్రదాయిని'లో భాగాలుగా ప్రకటించాడు. పిల్లల కోసం సంగ్రహ వ్యాకరణం, నీతులు బోధించే గీత పద్యాల 'నీతి దీపిక'ను ప్రచురించాడు. ధవళేశ్వరంలో 1874లో ఆంగ్లో దేశ భాషా పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ తెలుగులో మొదటి వచన కావ్యం 'విగ్రహ తంత్రం' రచించి ప్రచురించినప్పుడు పండితులు ప్రశంసలు కురిపించారు. ఈ వచన కావ్యం మెట్రిక్‌ పాఠ్య పుస్తకంగా గుర్తింపు పొందడం విశేషం. తన భావాలు ప్రచారం చేయడానికి, స్త్రీలంతా చదువుకోవాలనీ, తన రచనల మీద విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలనీ, తనకు కూడా ఇతర పండితుల వలె ఒక పత్రిక ఉండాలనీ 1874 అక్టోబర్‌లో 'వివేకవర్ధని' మాస పత్రికను ప్రారంభించాడు వీరేశలింగం.

విద్యా విషయాలు, దేశ వ్యవహారాలు, కులాచారాలు, నీతి, మతం మొదలైన అంశాలతో మంచిని పెంచే విధంగా వివేకవర్థని ఆవిర్భవించి, అభివృద్ది చెందింది. దీనికి అనుబంధంగా 'హాస్య సంజీవిని' వెలిసింది. ఇందులో 'బ్రహ్మ వివాహం' వాడుక భాషలో రాస్తే, 'పెద్దయ్యగారి పెళ్ళి'ని జనం మెచ్చుకున్నారు. 'ప్లీడర్‌ నాటకం' వ్యవహార ధర్మబోధిని అనే పేరుతతో వీరేశలింగం ప్రకటించాడు. పోలీసుల దొంగతనాలు, న్యాయవాదుల అన్యాయాలు, అధికారుల దురహంకారాలు ఈ ప్రహసనంలో చోటు చేసుకున్నాయి. వీరేశలింగం పిల్లల చేత వేషాలు వేయించి ఈ ప్రహసనాన్ని ప్రదర్శించాడు. జడ్జిమెంట్ల ఫార్స్‌ గూర్చి, మునసబు తీర్పుల గురించి దుమారం చెలరేగి ప్రభుత్వాన్ని సచేతనం చేసింది. సంఘ సంస్కరణ ప్రధాన లక్ష్యంగా, అక్రమాలపై విజృంభిస్తూ తెలుగు మాగాణిని పసిడి పంటగా చేశాడు. పత్రిక ద్వారా దురాచారాలను రూపు మాపడానికి, దేశాభివృద్ధికి ఉద్యమించడం, తెలుగులో కొత్త ప్రక్రియ వచన కావ్యాన్ని, ఇతర ప్రక్రియల్ని సమన్వయపర్చి తెలుగు భాషను సుసంపన్న చేయడం వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ, సాహితీ సంస్కరణ కార్యక్రమాలు.

బ్రహ్మ సమాజ భావాలతో పాటు సంఘ సంస్కరణ భావాలు వీరేశలింగం స్వకీయ జీవిత తత్వానికి మేలిమి మెరుగులు దిద్దాయి. వితంతు పునర్వివాహ కార్యక్రమాల్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం, స్త్రీ విద్య కోసం కృషి చేయడం, దళితుల విద్యా, సంక్షేమాల కోసం శ్రమించడం, ఉన్నత కులాల నీచ ప్రవృత్తులను బట్టబయలు చేయడం, భోగం మేళాలను నిరసించడం, మతపరంగా ఏకేశ్వరారాధనను ప్రచారం చేయడం వీరేశలింగం సంఘ సంస్కరణ కార్యక్రమాల్లోని ప్రధానాంశాలు. 1878లో నవలా రచనకు ఉపక్రమించి అలీవల్‌ గోల్డ్‌స్మిత్‌ నవల వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డ్‌ని అనుసరిస్తూ కొత్త కల్పనలతో 'రాజశేఖర చరిత్రం' అనే నవల వీరేశలింగం వ్రాశాడు. ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబ జీవితంలోని ఒడిదుడుకులను వర్ణిస్తూ ఆనాటి తెలుగువారి ఆచార వ్యవహారాలు, సామాన్య మానవుణ్ణి కేంద్ర బిందువుగా, కథానాయకుడిగా చేసుకుని ఒక సమగ్ర సామాజిక చిత్రణ చేసే ప్రయత్నం ఈ మొట్టమొదటి తెలుగు నవలలో కనిపిస్తుంది. భూస్వామ్య వ్యవస్థకు భరతవాక్యం పలకడం, ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది ప్రస్తావన చేయడం వంటి ఈ నవలలోని అద్భుత సన్నివేశాలు వీరేశలింగం అభ్యుదయ మనస్తత్వానికి నిదర్శనాలు.

వీరేశలింగానికి ముందు గోపాలకృష్ణమ్మ చెట్టి, నవలా రచనకు తొలి ప్రయత్నంగా 'శ్రీరంగరాజ చరిత్ర'ను వ్రాస్తే దానిని మద్రాస్‌ గెజిట్‌ మొదటి నవలగానే పేర్కొంది. 1872లో ముద్రితమైన ఈ వచన ప్రబంధంలో శైలి, శిల్పం, పాత్ర చిత్రణలో విశేషాలు కనబడవు. తెలుగు సాహిత్యంలో నవల, కథ, నాటకం, వ్యాసం, విమర్శ, వచన కవిత వంటి ప్రక్రియలకు తానే ఆద్యుడనని వీరేశలింగం తన స్వీయ చరిత్రలో వ్రాసుకోవడంలో అతిశయోక్తి లేదు. 1880లో వీరేశలింగం కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలా'న్ని తెలుగులోకి అనువదించాడు. ధార్వాడ్‌ నాటక కంపెనీ వాళ్ళు రాజమండ్రిలో నాటకాలాడినప్పుడు వేసిన పాకలలో తన శిష్యులకు శిక్షణనిచ్చి, వాళ్ళ చేత షేక్స్‌పియర్‌ రచన 'ది కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌'కి తన తెలుగు అనువాదం 'చమత్కార రత్నావళి' అనే నాటకం ప్రదర్శించాడు వీరేశలింగం. శ్రీహర్షుడి సంస్కృత నాటకం 'రత్నావళి'ని తెలుగులోకి అనువదించాడు. తెలుగు నాటకాలను మొదటిసారిగా ప్రదర్శించిన వాడు వీరేశలింగం. అందుకే వీరేశలింగం జయంతిని 'తెలుగు రంగస్థల దినోత్సవం'గా జరుపుకుంటున్నారు. తొలి నాటకం, తొలి ప్రహసనం, తొలి వ్యాసం రాసిన తెలుగు రచయిత వీరేశలింగం.

షెరిడన్‌ వ్రాసిన 'ది రైవల్స్‌', 'డ్యుయన్నా' అనే నాటకాలను తెలుగులో 'కళ్యాణ కల్పవల్లి', 'రాగమంజరి' అనే పేర్లతో అనువదించి, ఇంగ్లీషు పద్య కావ్యాలు, కాపర్‌ వ్రాసిన 'జాన్‌ గిల్సిన్‌', అలీవర్‌ గోల్డ్‌స్మిత్‌ వ్రాసిన 'ది ట్రావెలర్‌'ను అనువదించాడు. ఇంగ్లీషు, సంస్కృతాల నుంచి ప్రసిద్ధ నాటకాలను అనువదించడమే కాక, 'ప్రహ్లాద', 'సత్యహరిశ్చంద్ర', 'దక్షిణ గోగ్రహణం' అనే సొంత నాటకాలను కూడా వీరేశలింగం రచించాడు. ఏ గ్రంథం వ్రాసినా, ఏదో ఒక సందర్భంలో సంఘ సంస్కరణ అవసరాన్ని, బ్రహ్మ సమాజ ప్రబోధాలను తన రచనల్లో ప్రవేశ పెట్టాడు వీరేశలింగం. 'దక్షిణ గోగ్రహణం'లో ఆనాటి సాంఘిక సమస్యలు, వాటి నివారణ గూర్చి, 'సత్యహరిశ్చంద్ర' నాటకంలో స్త్రీ విద్య, భక్తి ప్రపత్తులను గూర్చి, సత్య, ధర్మ, దయా గుణాల గూర్చి ప్రస్తావించాడు. సంస్కృతం నుండి శాకుంతలం కాక మాళవిక ప్రబోధ చంద్రోదయం కూడా అనువదించాడు. 1883లో స్త్రీల కోసం 'సతీహిత బోధిని' ప్రారంభించాడు. 'పతిత యువతీ రక్షణశాల'ను ఏర్పరచాడు. రాజమండ్రిలో పుర మందిరాన్ని, విద్యా వ్యాప్తికై ఉన్నత పాఠశాలను స్థాపించాడు. బ్రహ్మ సమాజ వ్యాప్తికి రఘుపతి వెంకటరత్నం నాయుడుతో కలిసి పని చేశాడు. వ్యావహారిక భాషా వ్యాప్తి కోసం గిడుగు రామమూర్తి ఏర్పర్చిన వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. 'హితకారిణీ సమాజం' అనే సంస్థను స్థాపించి తన ఆస్తినంతటినీ ఆ సంస్థకు జన కళ్యాణార్థం దానం చేశాడు.

సులభ శైలిలో స్త్రీ విద్యావశ్యకత గూర్చి, దేహ పరిశుభ్రత గూర్చి 'సతీ హితబోధిని'లో ప్రచురించిన తన నవల 'చంద్రమతీ చరిత్ర'లో చెప్పారు. 240 మంది కవులు నన్నయ మొదలుకొని తన కాలం వరకు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన వారి చరిత్రను మూడు సంపుటాలుగా ఆంధ్రావనికి అందించిన శాశ్వత కీర్తి, ఘనత వీరేశలింగానిది. చనిపోతున్నప్పుడు కూడా, కవుల చరిత్ర ద్వితీయ భాగపు ముద్రిత ప్రతి ప్రూఫులు దిద్దుతూ, కలం చేతిలో పట్టుకునే కనులు మూయడం సాహిత్య సంస్కరణకు, సంఘ సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసిన యుగకర్తగా వీరేశలింగం పూజలందుకోవడం మరువలేని సంఘటనలు. భాషా సాహిత్యాలనే కాక సామాజిక జీవితాన్ని కూడా ఊహాతీతంగా మార్చివేయగల శక్తి సామర్ధ్యాలు గల వ్యక్తులు సమాజంలో కనిపించే అరుదైన వ్యక్తుల్లో అగ్రగణ్యులు. ఈనాటికి ఏనాటికీ తెలుగుజాతి, తెలుగు సంస్కృతి వీరేశలింగానికి రుణపడి ఉంటాయనడంలో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. అటువంటి తెలుగు తేజోలింగం కందుకూరి.

వీరేశలింగం ఇంతటి చారిత్రక మార్పుని తీసుకు రాగలిగాడంటే, తాను ఎంత వజ్ర సంకల్పుడైనా, ఎందరి సహాయ సహకారాలను సమకూర్చుకున్నాడో మరెందరి దూషణ, ఛీత్కారాలను ఎదుర్కొన్నాడో ఊహించవచ్చు. భూస్వామ్య వ్యవస్థకు అనుగుణమైన పండిత సంప్రదాయాన్ని వీరేశలింగం ప్రయత్నపూర్వకంగా పడగొడుతూ, నవ్య సామాజిక జీవిత దశకు అనుకూలించే సాహితీపథాన్ని సుసంపన్నం చేశాడు. సాధారణ వ్యక్తులు కాలానికి అనుగుణంగా నడుచుకుంటారు. కాని కొందరు అసాధారణమైన వ్యక్తులు కాలాన్నే తమ వెంట నడిపిస్తారు. అటువంటి అసాధారణ వ్యక్తులలో ఆద్యుడు వీరేశలింగం. కాలాన్ని జయించి తెలుగువారి హృదయాలలో శాశ్వత నివాసం ఏర్పర్చుకున్నాడు. తెలుగు కీర్తికేతనమైనాడు.

Courtesy: ఆంధ్ర ప్రభ

Veerasalingam Pantulu Andhra Pradesh Telugu India language poet freedom fighter Andhra Prabha April 2006


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Singapore Telugu cultural festival from April 29

Speaker to inaugurate language conservation conference
  • As many as 80 artistes to perform
  • Art exhibition by Bapu to be the high point of the festival
HYDERABAD: Singapore Telugu Samajam (STS) to enlighten the present generation about the Telugu Culture, Tradition and history of the language will be conducting, Singapore Telugu Cultural Festival-2006, from April 29 to May 1 in Singapore.

Speaking to reporters, samajam president V. Satyamurthy said a special meeting on Telugu language conservation conference would be inaugurated by Speaker K.R. Suresh Reddy on April 29.

As many as 80 artistes will be performing in music concerts, Kuchipudi dance ballets, dramas and other cultural programmes, he added.

"Apart from felicitations to scholars, we will organise an art exhibition by Bapu, puppet shows and cultural programmes by local artists and children," Mr. Satyamurthy said.

Wooing tourists

Festival committee vice-chairman N. Krishna Kumar said a special business conference under the auspices of the Singapore International Chamber of Commerce and the Federation of Andhra Pradesh Chambers of Commerce and Industry (FAPCCI) titled `Destination Andhra Pradesh' would be conducted on April 28 in Singapore. Major Tourism Minister J. Geeta Reddy will inaugurate the conference.

The meeting provide an opportunity to discuss investment prospects in Andhra Pradesh for the industrialists from Malaysia, Indonesia and Singapore.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, April 16, 2006

Intricacies of Kuchipudi explained

RENOWNED KUCHIPUDI maestro Jayram Rao and his student Meenu Thakur presented an enthralling performance at Delhi Public School in Varanasi, under the aegis of Spic Maccay, on Thursday.

The movements in Kuchipudi are supple and scintillating rounded and flat-footed. The performance of maestro Jayram Rao and Meenu Thakur highlighted the beauty of style characterized by grace and virtuosity. In their duets marked by perfect synchronization and harmonious balance, they represented the vigour of Tandav and feminine charm of Lasya.

India boasts of innumerable classical dances, each dance a specialty of a particular region. Kuchipudi is a dance which it derives its name from a village Kuchipudi in the southern state of Andhra Pradesh.

Rao, who was trained at the సిద్ధేంద్ర కళ క్షేత్రం (Sidhendra Kala Kshetram) since his childhood, was invited to Delhi in 1969 to teach Kuchipudi to young aspirants. He has an impressive list of students like Swapna Sundari, Meenakshi Sheshadri and Vanashree.

The programme started with a brief introduction of different dance forms and their origin along with the demonstration of the basic steps of Kuchipudi.

Thereafter they presented గజేంద్ర మోక్షం (Gajendra Moksham), a duet presentation from the Mahabharata. The next presentation was a wonderful display of synchronization in “Adi Taal’ based on “Raag Hindol’. The master explained in detail the meaning of the different “mudras’ and the philosophy behind them.

Meenu Thakur gave a brilliant performance in శబ్దం (Shabdam) where the ‘Gopis’ welcomed ‘Krishna’ by offering him sandalwood garlands and betel leaves and danced in gay abandon. The last performance తరంగం (Tarangam) signifying waves held the children spellbound as they watched the duo go through intricate dance movements on ‘steel thalis’. The programme concluded with some brilliant questions put up by the students, followed by a vote of thanks.

Courtesy: Hindustan Times


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Friday, April 14, 2006

Indian Idol: VOTE for NC Karunya

(update, Apr 22nd 10:45pm IST, 10:15am PST)

SonyTV's Indian Idol has become more of a gimmick with evident loopholes in the voting and selection process, and the program lacking in any kind of professionalism. This was further proved today when a superior singer NC Karunya 'supposedly' got less votes ( i won't even be surprised if i am told that the television channel tinkered with the original vote count to give us their own figures ) than his mediocre competitor Sandeep

Across India, and around the world, all sane people support Karunya. Within minutes of the result, the Wikipedia page for 'Indian Idol' screamed FOUL. Online forums now carry a lot of anger against SonyTV's faulty voting process, and for people who voted for Sandeep. The popularity for this contest is now going to fall tremendously.

Though Karunya has not been voted as the Indian Idol 2 by the sms/phone public, he undoubtedly has the best singing ability, and has been the favorite of the judges, and any unbiased lover of music throughout India and abroad. Inspite of being from Andhra Pradesh, where Hindi channels are not widely watched, he reached the top echelon of this contest purely through his talent. As for his mediocre competitor, the usual north-south favoritism, and his local mass Bikaner junta's support and their rigging of the voting process by repeatedly voting for him, acted in his favor.

This result has made a joke of this 'Indian Idol' contest, and is a SHAME for Indian and the organizers SonyTV.

Karunya has already won the appreciation of the bigwigs, and has a great future ahead in his singing career.


*****


Name: NC Karunya

Date of Birth: March 1, 1986

Place of Birth: Hyderabad

Currently Residing in: Hyderabad

Education: B-Tech (Third Year) in Electronics & Communications

Family: Father, Mother & Younger Sister

Email: karunya_nc@sify.com

N C Karunya from Hyderabad has made his mark on the Indian Idol Contest with his melodious voice and `Abhishek Bachchan` looks.

He`s been singing since he was three and idolises music legends like
Kishore Kumar, Mohd. Rafi, Lata Mangeshkar, Asha Bhonsle, P Susheela and Ghantasaala. Sonu Nigam, Anu Malik, Farah Khan are just some of the names among thousands of Indians who have been left speechless by his terrific singing. In the latest episode, the Bollywood star Sunil Shetty broke down into tears after Karunya's performance.

Padma Bhushan Chiranjeevi, Nagarjuna, Abhishek Bachan, YS Rajasekhar Reddy (Hon CM, Andhra Pradesh) and a host of other celebrities have promised support to this child prodigy.

Karunya cut an album of his own in his childhood called చిరు సరిగమలు (Chiru Sarigamalu) which was launched by Chiranjeevi. He later also went on to win ETV’s పాడుత తీయగ (Paaduta Teeyaga) hosted by SP Balasubrahmanyam. He has sung in many of the stage shows at Hyderabad and at various other places.

The final episodes will be telecast live on 18th April after the gala round again on 17th April. You can send in your votes till that day.

Vote for our Karunya by sending an SMS to 2525 with the word KARUNYA or calling 1904424252502 on your phone.


Article in Telugupeople.com

The Official Website of Indian Idol Contest

Karunya's Section and Performances


టాప్‌ 2లో మనోడు

సోనీ 'ఇండియన్‌ ఐడల్‌' ఫేమ్‌, సిటీ కుర్రాడు కారుణ్యకు ఘనస్వాగతం లభించింది. పోటీల కోసం ముంబైలోనే కొన్నివారాలు ఉండిపోయిన కారుణ్య టాప్‌ 2కి చేరుకున్న సందర్భంగా స్వంత ఊరికి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన కారుణ్యకు ఆయన కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు, అభిమానులు పూలదండలు వేసి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం చెప్పారు. ఈ తెలుగు యువకుడు జాతీయస్థాయిలో టాప్‌ 2స్థాయికి చేరుకోవడం అందరినీ ఆనందంలో ముంచెత్తింది...

ఇంజనీరింగ్‌ మూడవ సంవత్సరం చదువుతున్న కారుణ్యకు స్వాగతం చెప్పేందుకు కళాశాల నుంచి పెద్ద ఎత్తున మిత్రబృందం తరలివచ్చింది. కళాశాల ఛైర్మన్‌, నగర మేయర్‌ తీగల కృష్ణారెడ్డి కూడా స్వాగతం చెప్పేందుకు విమానాశ్రయానికి వచ్చారు.
విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా కారుణ్య తమ నివాసమైన సరూర్‌నగర్‌కు తరలివెళ్లాడు. ఊరేగింపులో కారుణ్య మిత్రులు మోటర్‌బైక్‌లతో ర్యాలీ నిర్వహించి 'ఇండియన్‌ ఐడల్‌ హీరో కారుణ్య' అంటూ నినాదాలు చేశారు.

శాస్త్రీయ సంగీతాన్ని కాపాడుతా...
తనకు లభించిన స్వాగతానికి కారుణ్య ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో హిందీ ఛానల్స్‌ చూసే వాళ్లు చాలా తక్కువని, అయినా చాలా మంది తనకు ఓటు వేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఫైనల్స్‌లో కూడా ఇదే విధంగా ఓట్‌ వేయాలని అభ్యర్థించారు. ఇండియన్‌ ఐడల్‌గా ఎంపికైతే నగరానికి ఏం చేస్తావని ప్రశ్నించగా..." ఇపుడు సినీ సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. శాస్త్రీయ సంగీతాన్ని అంతగా పట్టించుకోరు. కానీ ఇందులో కూడా మధురిమ ఉందని నిరూపించేందుకు నేను కృషి చేస్తాను'' అని కారుణ్య చెప్పారు.
మేయర్‌ హామీ...
దీనికి మేయర్‌ తీగల కృష్ణారెడ్డి స్పందిస్తూ..." "తెలుగువాడు, అందులోనూ నగరవాసి అయిన కారుణ్య జాతీయస్థాయి పోటీకి వెళ్లి హిందీలో పాడి సంగీతప్రియుల మనసు దోచుకోవడం గ్రేట్‌....కారుణ్య మా స్టూడెంట్‌ కావడం ఎంతో గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో ఏం చేసినా అతనికి నా పూర్తి సహకారం ఉంటుందని'' హామీ ఇచ్చేశారు.
అన్నయ్యని గెలిపించండి..
జీ టీవి నిర్వహించిన సరిగమపలో పాల్గొన్న కారుణ్య కజిన్‌ హేమచంద్ర మాట్లాడుతూ "మా అన్నయ్య టాప్‌2కి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఓటింగ్‌ లేకపోవడం వల్ల రాలేకపోయా. ఆ సమస్య కారుణ్యకు రాకపోవడం సంతోషంగా ఉంది. తప్పకుండా అన్నయ్యే ఐడల్‌గా ఎంపికవుతారు. అందరూ ఓట్‌ వేయండి'' అంటూ విజ్ఞప్తి చేశారు. విమానాశ్ర యానికి వచ్చిన కారుణ్య తల్లిదండ్రులు, చెల్లెలు, ఇతర బంధువుల్ని ఎవర్ని కదిలించినా "మా వాడు ఇంత గొప్పవాడు కావడం గర్వకారణంగా ఉంది'' అంటూ చెప్పారు.

అభిమానం....
పదవ తరగతి పరీక్షలు రాసిన దీప్తి కారుణ్య కోసం విమానాశ్రయానికి వచ్చింది. 'సిటీలైఫ్‌'తో మాట్లాడుతూ "ప్రతీ వారం నేను తప్పకుండా ఇండియన్‌ ఐడల్‌ ప్రోగ్రామ్‌ చూస్తాను. పరీక్షలున్నా సరే. కారుణ్య చాలా బాగా పాడతాడు. నేను కూడా భవిష్యత్తులో గాయనిని కావాలనుకుంటున్నాను. ఇండియన్‌ ఐడల్‌ ప్రోగ్రామ్‌ చూడడమే కాదు. మా ఫ్రెండ్స్‌కి కూడా చెబుతాను. ఓటింగ్‌ చేయమని రోజూ గుర్తు చేస్తాను....'' అంటూ కారుణ్యపై అభిమానాన్ని చాటుకుంది.
అమ్మ చేతివంట ఇష్టం...
ఇలాంటి అభిమానుల నడుమ కారుణ్య తన నివాసానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. వెళ్లే ముందు..." ఇన్ని రోజులు సిటీకి దూరంగా ఉండి చాలా మిస్సయ్యాను. ముఖ్యంగా ఇక్కడి సినిమాలు.... అమ్మ చేతి వంట.... స్నేహితులను... కాలేజీని....'' అని ఉద్వేగంగా చెప్పారు.

-పి.శశికాంత్‌
ఫొటోలు: వి.రజనీకాంత్‌



మన 'తెలుగు' కారుణ్య కి మీ వోటు వెయ్యాండి

SMS : 2525 'KARUNYA'

Ph: 1904424252502



Courtesy: ఆంధ్ర జ్యోతి, SonyTV
telugu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, April 12, 2006

Telugu sign at Raj Ghat, New Delhi


From the Flickr Telugu Photo Group


"చివరకు సాధించవలసినది మానసిక మరియు నైతికాభివృద్ధితో కూడిన మానవసౌఖ్యము. నేను నైతికమనే విశేషణమును ఆత్మబలమునకు సమానముగా వాడెదను. ఈ ఉద్దేశ్యము వికేంద్రీకరణము ద్వారా సాధించవచ్చును. కేంద్రీకరణ పద్ధతి అహింసాపద్ధతితో కూడైన సమాజములో నిలకడ లేనిది. -- మహాత్మాగాంధీ"

For the English translation of the above quote from Mahatma Gandhi, please check the photograph and the comments at the Flickr Telugu Photo Group.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Tuesday, April 11, 2006

Vocalist sings rare Thyagaraja numbers for 12 hours non-stop

Mumbai, April 11 (PTI): A Vijaywada-based vocalist rendered `apoorva' ragas continuously for 12 hours here to popularise the rare compositions of Thyagaraja, the father of Carnatic music.

Girija Seshamamba, the 31-year old singer sang 100 songs during the 12 hours, which included 60 of the 81 rare ragas composed by Thyagaraja, at the Shringeri Sharada Peeth's temple at Chembur on Sunday.

She sang from 9 am to 9.20 pm continuosly, stopping in between only to sip a drink. She was accompanied by four sets of artistes who assited her on violin, mridangam and ghatam.

The event was organised by K S Krishnamurthy of Telugu Kala Samiti and Chairman of Board of Trustees, Andhra Mahasabha.

Several musical gurus, including 85-year old Sri Vidyanath Bhagavahar, G S Balasubramanian, Head of Nadalola, Anantharama and Asthana Bhagavathars, were present on the occasion.

Meanwhile, the Limca Book of Records had decided to include Girija's feat in their 2007 edition, Limca sources said.

Girija, who has done her PhD on the rare (Apoorva) ragas said that there were 81 such ragas and "I chose 60 ragas for the marathon".

Girija began learning carnatic vocal and violin at the age of four and gave her first performance at the age of 10.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, April 08, 2006

ఉపాధితో సంబంధం లేకుండా ఏభాషా అభివృద్ధి కాదు

ఎం.వి. ఆంజనేయులు

తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలన్న కోరిక నానాటికీ తెలుగునాట బలపడుతున్నది. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలన్న కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం కూడా చేసింది. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలనే విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కాని ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలోనే అనేక పొరపాటు ధోరణులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో అనేకమంది తెలుగుభాష, ఆంధ్ర భాష ఒకటేననే విధంగా పొరపాటు అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. చాలాకాలంగా తెలుగు వాజ్ఞ్మంలో తెలుగు, ఆంధ్ర అనుపదాలు పర్యాయపదాలుగా వాడుకలో ఉండడమే వారు అలా అభిప్రాయపడటానికి కారణమై ఉండవచ్చు. భాషకు సంబంధించిన పేరు ఏదైనా పెద్ద ఇబ్బంది కలుగదుకాని, తెలుగు భాష యొక్క ప్రాచీనతను గుర్తించాలంటే మాత్రం ఈ రెండు పదాల యొక్క అర్ధాలను తెలుసుకోవల్సిందే.

తెలుగు అనేది భాషకు పేరు. ఆంధ్ర అనేది ఒక తెగప్రజలకు పేరు. ఆంధ్రులు అనేవారు ఒకతెగ ప్రజలు, ద్రావిడుల తర్వాత భారతదేశంలోకి అడుగిడిన తెగయిది . ఆర్యులకన్నా కొన్ని శతాబ్దాల ముందే ద్రావిడులు భారతదేశంలోకి వచ్చారు. వీరు మొదట భారతదేశ ఉత్తర ప్రాంతంలో నివసించేవారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన హరప్పా, మొహంజదారో, నాగరికతలను నిర్మించింది ఈ ద్రావిడులే. ఆ తదుపరి వీరిలో కొన్ని తెగలు ఆర్యుల చేతిలో పరాజితులై భారతదేశపు దక్షిణప్రాంతానికి తరలివచ్చారు. దక్షిణభారత దేశంలో స్థిరపడ్జారు, కొంత మంది ఉత్తరభారతదేశంలోనే నిలిచిపోయారు, మరికొంతమంది మధ్య భారతదేశంలో నివాసాలను ఏర్పచుకున్నారు, కొంతమంది నేపాల్‌, బర్మాలవైపుగా సాగిపోయారు.

దక్షిణ భారతదేశానికి తరలివచ్చిన ద్రావిడ తెగలు తెలుగు, తమిళం , కన్నడం, తుళూ భాషలను మాట్లాడేవారు, మధ్య భారతదేశంలో స్థిరపడిన ద్రావిడ తెగలు కాండు, మార్టు, ఒరేయాన్‌, భాషలు మాట్లాడేవారు. దక్షిణ, మధ్య భారతదేశంలో ద్రావిడులు మాట్లాడే ఈ భాషలన్నీ ద్రావిడభాషా కుటుంబానికి చెందినవి. బర్మాలో నివశిస్తున్న తైలాంగ్‌ జాతి ప్రజలు కూడా తెలుగు వారేనని కొంతమంది భాషాపండితుల అభిప్రాయం. దీనిని బట్టి తెలుగు భాషా తమిళ భాషాంత ప్రాచీన మైనదని స్పష్టమౌవుతున్నది.

ఇక ఆంధ్రుల విషయానికి కొస్తే ఆంధ్రులు అనేవారు ఒక తెగ ప్రజలు ద్రవిడులు దక్షిణ ప్రాంతానికి తరలివచ్చిన కొన్ని శతాబ్దాల తర్వాత ఆంధ్రులు భారతదేశంలోకి అడుగు పెట్టారు. చరిత్రకు అందుతున్న వివరాల ప్రకారం క్రీ.పూ.1500 నాటికి ఆంధ్రులు యమూనా తీరంలో నివసించేవారు. వీరి భాష 'దేశి' అక్కడ సమాజంలో ఏర్పడిన ఒడిదుడుకుల వలన, కరువు కాటకాల వలన ఆంధ్రులలో కొందరు యమునా తీరాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు దక్షిణంగా సాగిపోయారని క్రీ.పూ.1000 సంవత్సరాల ప్రాంతంలో రచింపబడిన చాందోగ్యోపనిషత్తు ద్వారా తెలుస్తున్నది. అలా తరలి వచ్చిన ఆంధ్ర తెగలు క్రమేణ మరాఠ్వాడ, తెలంగాణా ప్రాంతాల మీదుగా క్రీ,పూ.200 నాటికే ప్రస్తుత ఆంధ్ర ప్రాంతానికి చేరుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. కొత్తగా వచ్చిన ఆంధ్రుల భాష 'దేశీ, ఆంధ్రులు ఈ ప్రాంతంలో స్థిరపడిన తర్వాత వారి భాష 'దేశి, దార్ధిక్‌, ద్రావిడ భాషా కూటములు రెండు సమీప బంధుత్వం గలవి కనుకనే, దేశి, తెలుగు భాషలు సులభంగా మిళితమైపోయాయి.ప్రస్తుతం మనం మాట్లాడే తెలుగు ఈ రెండు భాషలు సమ్మిళితమే.

ఈచర్చలో రెండవ పొరపాటు ధోరణి ఏమంటే భాషా ప్రాచీనతను లెక్కించడానికి, శిలాశాసనాల ప్రాచీనతను కొలబద్దగా తీసుకోవడం. భాష ఏర్పడిన కొన్ని శతాబ్దాల తర్వాతే, ఏ భాషకైనా లిపి ఏర్పడుతుంది తప్ప భాష పుట్టుకతోనే లిపి ఏర్పడదు. ఏ భాషలైనా ఇదే పరిస్థితి. ఇది భాషా పరిణామక్రమం.

తెలుగు భాష ఇందుకు భిన్నంకాదు. ఇప్పటి వరుకు అందిన చారిత్రక అంచనాల ప్రకారం , క్రీ.పూ 2వేల సంవత్సరాలనాటికే తెలుగుభాష ఏర్పడింది. అంటే, క్రీ.పూ 1వ శతాబ్దిలోనే , శాతవాహనుల కాలంలో అమరావతి స్థూపంలో చెక్కిన ''నాగబు''అనే పదం ఇప్పటివరుకు దొరికిన ప్రాచీన శాసనపదం. అందువలన శాసనకాలం ఎప్పుడూ భాష వయస్సును నిర్ణయ ంచదు. తెలుగు భాష కూడా శాసనాలలోకి ఎక్కకముందు సుమారు 2వేల సం.లకు పూర్వం నుండే యున్నదని స్పష్టమౌవుతుంది . పై విషయాలనుబట్టి క్రీ.పూ 2వేల సం.ల నాటికే , అంటే ద్రావిడుల ఉత్తర భారతదేశం నుండి , దక్షిణ భారత దేశంలోకి వచ్చెనాటికే తెలుగు భాష ఉన్నదని స్పష్టమౌవుతున్నది. కనుక తెలుగు భాష ను ప్రాచీన భాషగా గుర్తించడానికి ఎలాంటి ఆటంకామూ లేదు.

ఈచర్చలో ఉన్న మరోపొరపాటు ధోరణి తమిళుల పై ద్వేషాన్ని రెచ్చగొట్టడం. తెలుగు భాషను ప్రాచీన భాషగా ప్రభుత్వం గుర్తించకుండా తమిళులు అడ్డుతలుగుతున్నారని కొంతమంది ప్రముఖులే విద్వేషపూరిత ప్రచారం చేయడం శోచనీయం. తెలుగు భాష ప్రాచీనతను గుర్తించడానికి తమిళులు అడ్డుతగలడమేమిటి? తమిళులు కాదంటే తెలుగుభాష ప్రాచీన భాష కాకుండా పోతుందా? చరిత్ర పరిశోధన ఆధారంగా భాషాప్రాచీనతను గుర్తించాలని కోరాలే తప్ప ఇతర భాషీయులపైన ద్వేషాన్ని రేచ్చగొట్టడం ద్వారా కాదు . మనభాషమీద మనకు ప్రేమ ఉండవచ్చుగాని , ఇతర భాషీయుల పట్ల ద్వేషం తగదు.

అసలు తెలుగుభాషను ప్రాచీన భాషగా భారతప్రభుత్వం గుర్తించినంత మాత్రాన సాధారణ తెలుగు ప్రజలకు ఒరిగేదేమిటి ? భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తే , భాషాభివృద్ది పేరుతో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిధులొస్తాయి. నిధులతోనే భాషాభివృద్ది జరిగిపోతుందా? ప్రాచీన భాషగా గుర్తిస్తే తప్ప మాతృభాషలను అభివృద్ది చేయవలిసిన అవసరం లేదా? మాతృభాషను అభివృద్ది చేసేది ప్రజలకు విజ్ఞానాన్ని కరతలామలకం చేయాడానికేగాని ప్రాచీన భాష కాబట్టి కాదు.

తెలుగు ప్రాంతంలో ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పిస్తే తెలుగు భాషను ప్రజలు ఆదరిస్తారు. తద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది. భాషాప్రయుక్తరాష్ట్రాలను ఏర్పాటుచేసిన లక్ష్యాలను మన పాలకులు ఏనాడో గాలికి వదిలేశారు. చైనా, రష్యా, జర్మని ఫ్రాన్స్‌ లాంటి దేశాలలో వారి విద్యా బోధన వారి మాతృభాషలోనే జరుగుతుంది. వారికి ఆంగ్లం నేర్చుకోవడం ద్వితీయ తప్ప ప్రథమం కాదు. కారణం ప్రపంచంలో పెరుగుతున్న విజ్ఞానాన్ని వారి భాషలలోకి అనువదించుకోవడమే . రెండవది, వారికి అక్కడే ఉపాధి లభిస్తున్నది. ఈ రెండు కారణాల చేత వారి భాషలలోనే శాస్త్రసాంకేతిక అభివృద్ధి జరుగుతుంది. మన తెలుగు భాషా అభివృద్ధి జరగాలన్నా ఈ రెండు జరగవలసిందే. కానీ మనం తెలుగు భాషలో పరిపాలనే నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నాము. తెలుగు శాసన సభలో సభ్యులందరూ తెలుగులో మాట్లాడాలేని దుస్థితి మనది. కనుక తెలుగు భాషాభివృద్దిని కాంక్షించే వారందరూ ఉపాధి అవకాశాల కోసం, శాస్త్ర సాంకేతిక గ్రంథాలను అనువదించే యంత్రాంగం ఏర్పాటు కోసం పరిపాలనలో పూర్తిగా తెలుగును ప్రవేశపెట్టడం కోసం పోరాడాలి. అప్పుడే నిజంగా తెలుగు భాషాభివృద్ధి జరుగుతుంది.అసోంలో కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్ధి

తేజ్పూర్‌, ఏప్రిల్‌ 7;అసోంలో కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే ప్రత్యర్ధిగా మారింది. బార్పేటా నియోజకవర్గం నుండి మూడు సార్లు పార్లమెంట్‌ సభ్యుడుగా ఎన్నికైన గోలామ్‌ ఉస్మాని ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగానే ప్రచారం చేయడంమే కాకుండా 21 మంది స్వతంత్ర అభ్యర్ధుల బహుటంగా రంగంలోకి దింపి వారి తరుపున ప్రచారం చేస్తున్నారు. బహుస కాంగ్రెస్‌తో ముఖ మూఖీగా పోటిపడే ధైర్యం లేక ఆయన ఈ ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడో రాజీనామా చేసానని, అయితే తన రాజీనామాను పార్టీ అధిష్టానం అంగీకరించవలసి ఉందని ఉస్మాని అన్నారు. దిగువ అసోంలోని కాంగ్రెస్‌ అభ్యర్ధులందరిని తాను ఓడిస్తానని అన్నారు. దిగువ అసోంలో తాను బలపరిచిన అభ్యర్ధులే విజయం సాధిస్తారని, ఈ ప్రాంతంలోని ధర్మాపూర్‌తో సహా మిగిలిన స్ధానాల్లో ఒక్క కాంగ్రెస్‌ అభ్యర్ధి కూడా విజయం సాధించడని ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీల కాపాడేందుకు, వారి అభివృద్ధి కోసం పాటుపడమని తాను కాంగ్రెస్‌కు చెబుతున్నా, లెక్కపెట్టకుండా కేవలం కాంగ్రెస్‌ ఓటుబ్యాంక్‌పైనే ఆదారపడిందన్నారు. తన సామర్జ్యాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గుర్తించారని, తాను సూచించిన అభ్యర్ధులనే అమె జాబీతాలో ఎంపిక చేశారని, అయితే చివరి నిమిషంలో ముఖ్యమంత్రి తురుణ్‌గొగోయ్‌, దిగ్విజయ్‌సింగ్‌లు తాను సూచించిన అభ్యర్ధులకు సీట్లు కేటాయించకుండా అడ్డుపడ్డారని అన్నారు. తన మద్దతు దారులైన 30మంది టిక్కెట్లు ఇవ్వాలంటూ సూచించానని, వారిలో ఆరుగురికి మాత్రమే దిగ్విజయ్‌సింగ్‌ సీట్లను కేటాయించారని అన్నారు. దీంతో తాను పార్టీతో విభేదించి పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నానని, ఎన్నికల అనంతరం తాను కీలకపాత్ర పోషిస్తానని అన్నారు.

మైనారిటీ ఓటు బ్యాంక్‌కు గండిపడకుండా కాంగ్రెస్‌ చేసే చర్యలు నిలుపుచేయకపోతే, మీరు లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, కాంగ్రెస్‌ మైనారిటీల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తే తాను లోక్‌సభకు రాజీనామా ఎందుకు చేస్తానని ఎదురు ప్రశ్నించారు. తాను పదవికి రాజీనామా చేస్తే కేవలం సభ్యత్వం పోతుంది. మాహ అయితే పార్టీ నుండి బహిష్కరిస్తారు. తాను ఉత్తరాంచల్‌నుండి తిరిగి గెలుపొందగలనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తాను పార్టీకి రాజీనామా చేస్తాని ప్రకటించడంతో, అసోంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పాడే అవకాశమున్నందు వలన ఉస్మాన్‌ కీలక పాత్ర పోషించగలడని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Courtesy: ఆంధ్ర ప్రభ

Telugu Andhra Pradesh ancient classical language status demand M.V.Anjaneyulu tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


తెలుగులో లవకుశ యానిమేషన్‌ చిత్రం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 : రామాయణ మహాకావ్యం ఆధారంగా మన దేశంలో ఎన్నో యానిమేషన్‌ చిత్రాలు రూపొందినా లవకుశుల ఎపిసోడ్‌ను మాత్రం ఎవరూ ముట్టుకోలేదు. ప్రథమంగా లవకుశ యానిమేషన్‌ చిత్రాన్ని రెండు సంస్థలు తెలుగులో నిర్మిస్తున్నాయి. కాణిపాకం క్రియేషన్స్‌, ఆర్‌వీఎంఎల్‌ యానిమేషన్‌ స్టూడియోలు సంయుక్తంగా లవకుశ 2డి యానిమేషన్‌ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాయి. 22 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి 300 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు ఇంగ్లీష్‌, హిందీ భాషల్లోకి అనువదించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ సంభాషణలను పతంజలి, హిందీలో డీకే గోయల్‌ రాస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ ఎల్‌ వైద్యనాథన్‌ సంగీతాన్నిఅందిస్తుండగా ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి పాటలు రాస్తున్నారు.

Courtesy: ఈనాడు

*****

After Hanuman’s giant leap to glory, the animation industry has set its sights on little Luv-Kush to warm the box-office heart.

An NRI software engineer, Shashank, has started a $5-million project to shoot a 3D animation movie based on the lore of Luv and Kush, the twin sons of Ram.

Over 300 animators will work for one-and-a-half years at Rayudu Vision Media Ltd’s animation labs to create the 90-minute musical.

The film shows Luv and Kush fighting their father for abandoning their mother Sita in a forest.

The twins have tasted success in this part of the country before. Their story was the theme of a popular Telugu musical, which had N.T. Rama Rao in the lead.

“The success of Hanuman has driven the Luv-Kush project, which is slated to be completed by the middle of 2007,” said Rudra Maatsa, technical director of the film.

“The second animation movie will be made in three languages — English, Hindi and Telugu — initially and it will be later dubbed in four foreign languages,” Maatsa said.

Hanuman’s unexpected success has given a huge boost to India’s animation industry, whose business is set to touch nearly $1.9 million by 2009. It is expected to employ around 30,000 animators by that time.

The industry is also drawing foreign film production companies. “The cheap cost of production in India has been attracting global players in the animation and video gaming industry,” said Kiran Karnik, the chief of Nasscom.

But market players say that besides cost effectiveness, it is the creativity of Indian animators that has been driving the outsourcing trend. “The capacity of the Indian animators to absorb and create caricatures acceptable in the US and European markets besides Asia has been driving investments in India,” said Kedarnath Udaywar, who heads the Hyderabad Software Exporters’ Association.

Courtesy: The Telegraph


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Friday, April 07, 2006

సీతారామ కళ్యానోత్సవం


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


శ్రీ రామ నవమి శుభాకాంక్షలు


రామా నిను మది దలంచిన చాలు
చేకూర్చేదపు శుభములు వేలు
తారక మంత్రము జపించిన చాలు
సర్వ సందలు ముంగిట వాలు


Wishing Everyone a Happy and Prosperous
Sri Rama Navami


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, April 06, 2006

శ్రీ రామదాసు

(click for larger images)


Nagarjuna's latest Telugu movie 'Sri Ramadasu' ('s) poster replaces that of the Hindi movie 'Taxi No 9211', at the India Movie Center (IMC6), San Jose, California.



'Sri Ramadasu', based on the real-life story of a Telugu devotee of Lord Rama, is running to packed houses India & USA, while it's music continues to top the Telugu audio charts.


(click for larger images)


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


కొప్పరపు సోదరకవుల కవితా వైభవం

వక్రాల గంగారావు

'ఆలోచించుట లేదు కల్పనకు పద్యారంభ

యత్నంబు ము

న్నేలేదించుక ప్రాసకేని యతికేనిన్‌ గొంకు

కన్పట్ట దే

ఆలస్యంబును కల్గబోదు భళిరా! యయ్యారె!

యివ్వారికిన్‌

పాలే¸°గద! ఆశుధార కవితా ప్రారంభ

నిర్వాహముల్‌'

అంటూ తిరుపతి వేంకట కవుల శిష్యుడైన వేటూరి ప్రభాకర శాస్త్రి చేత మన్ననలందుకొన్న కొప్పరపు సోదర కవులు గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కొప్పరపు గ్రామ నివాసులు. వేంకట సుబ్బరాయ (12.11.1885 జననం, 29.3.1932 మరణం), వేంకట రమణయ్య (30.12.1887 జననం, 21.3.1942 మరణం)లు కొప్పరపు కవులుగా సుప్రసిద్ధులని జగద్విదితమే. ఆశు కవితలోను, అవధాన విద్యలోనూ ప్రావీణ్యం సంపాదించుకొని ఆంధ్ర దేశమంతటా అవధానాలు చేసి అవధాన విద్యకు ప్రాశస్త్యం కల్పించారు.

'రామడుగు రామకృష్ణుడు

ధీమణినిక సంస్మరింతు దేశికవర్యున్‌

ధీమహితు పోతరాట్కుల

రామ కవిన్‌ దలతు సుగురు రత్నము ననఘున్‌'

అంటూ విద్య నేర్పిన గురువులైన బ్రహ్మశ్రీ రామకృష్ణశాస్త్రి గారిని, బ్రహ్మశ్రీ పోతరాజు రామకవి గారిని ప్రస్తుతించారు.

'తనకు గల యట్టి శిష్య బృందమ్ములోన

అగ్రణిగ నన్ను నెవ్వడనుగ్రహించె

అభినుతించెద నట్టి విద్యాఫణీంద్రు

రమ్యగుణసాంద్రు పోతరాడ్రమ చంద్రు'

అంటూ గురువుగారైన రామకవి గారితో సోదర కవులు తమకు గల వాత్సల్యాన్ని ప్రకటించారు. కొప్పరపు సోదర కవులు వివిధ ప్రాంతాలలో అవధానాలు చేస్తూ సాహితీ ప్రియులను మెప్పిస్తూ, వారి చేత గౌరవాలు, సన్మానాలు పొందారు. వీరు పొందిన సత్కారాలకు జగన్మాతయే కారణమని అమ్మవారిని కొనియాడారు.

'ఏ యంబ బిరుదంబు లిప్పించే తొలుదొల్త

మణికొండ భూపాల మౌళి చేత

ఏ దేవి జయ ఘంటికాదుల నిప్పించె

మదరాసు బుధ శిరోమణుల చేత

ఏ తల్లి వేయి నూరిప్పించె ఘటికాద్వ

యివి పీఠికాపురాధీశు చేత'

అంటున్న పద్యంలో వారు పొందిన సత్కారాలను చెప్పుకున్నారు. ఆ రోజుల్లో వేయినూర్లు పొందడమంటే మామూలు మాట కాదు కదా! ఆ గౌరవం కొప్పరపు వారికే దక్కింది.

'విక్రమార్కుని చేత విబుధాగ్ర సరుల కా

లయమైన యట్టి ఉజ్జయిని యనగ

భోజ భూపతి చేత బుధ రత్నముల కాక

రంబైన ధారా పురంబనగ

అల కృష్ణదేవరాయల చేత కవులకు

మందిరంబగు ఆనెగొంది యనగ...'

అంటూ కుండినపురమను నామాంతరం గల తమ సొంత జిల్లాయైన గుంటూరును వర్ణించిన తీరు వారికి తమ జిల్లాపై గల మక్కువను తెలియజేస్తుంది. శతావధానాలు, అష్టావధానాలు, ఆశు కవితా ప్రదర్శనలు చేస్తూ మదరాసు నగరం నందు పండితుల సమక్షంలో అవధానాలు చేసి వారితో సన్మానాలు పొందారు. ఆనాటి సభలకు వచ్చిన కొందరు పండితులు వీరి కవితా వైభవానికి ముగ్ధులై కొప్పరపు సోదర కవులను ప్రశంసిస్తూ పద్యాలు చెప్పారు.

'అంగ! వాం వచన భంగమాలనో

స్సూరి సంసది కుతః పరాజయః

సుబ్బరాయ రమణౌ మహాకవీ

వేంకటోహి యువయోర్ద్వయోః పురః,

ధోరణ నిర్జరాంబువని తోపగ గంటకు

మూడు మార్ల సా

ధారణ వేగయుక్తి బుధ తండము మెచ్చగా పల్కి

పద్యముల్‌

ధారణ తప్పకుండ నవధాన శతంబు ఘటింప

జాలునో

సూరి వరేణ్యులారా! మిము జూడ మహాద్భుత

మయ్యె నాత్మలోన్‌'

అంటూ కావ్యకంఠ గణపతి మహాముని, వావిల కొలను సుబ్బారావు గార్లు కొప్పరపు కవుల కవితా వైభవాన్ని పొగిడినారు.

'అయ్యా కొప్పరపుం గవీశ్వరులు! మీ ఆస్యంబు

మేమెన్నడే

నొయ్యం జూడగ లేదు, శిష్యుడొకడోహో! యంచు

మెచ్చెన్‌ మిమున్‌

వెయ్యూర్లియ్యగ శక్తి లేదు కొనుడీ! వెయ్యారులే

యంచు మే

మియ్యంబూనిన పద్యముల్‌ యనుడి!

మీరెచ్చో నిరాఘాటులై'

అంటూ వేటూరి ప్రభాకర శాస్త్రి ద్వారా కొప్పరపు కవుల అవధాన వైభవాన్ని తెలుసుకున్న తిరుపతి వేంకట కవులు వారికి లేఖ రాస్తూ అభినందించారు. అత్యంతాశ్చర్యకరమైన శతావధానములో, ఆశు కవితలో ఆరితేరిన తిరుపతి వేంకట కవులచే ప్రశంస లేఖ నందుకున్న కొప్పరపు కవులు అమితానంద భరితులై

'తిరుపతి వేంకటేశ్వర సుధీశ్వరులార!

మహేశ్వరీ కృపా

భర పరిలబ్ధ భవ్య మతి వల్లభ తానంత

సర్వసత్కవీ

శ్వర ధరణీశ్వరార్చిత సద్రసవ త్పద పద్య

మండ నా

దరణ గుణ ప్రభూత కవితా వనితా మహితాను

రాగసుం

దర తర మూర్తులార!...'

అంటూ వేంకట కవులకు కృతజ్ఞతతో ప్రత్యుత్తరం రాశారు.

వివిధ ప్రాంతాలలో అవధానాలు చేస్తూ హైదరాబాద్‌ నగరంలో అవధానం చేసిన కొప్పరపు కవులు ఈ ప్రాంతాన్ని పావనం చేశారు. వారి అవధానం చేసి నూరేళ్ళు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతి ప్రాంగణంలో డిసెంబర్‌ 2005 రెండవ పక్షంలో 'అవధాన సప్తాహం' నిర్వహించి కొప్పరపు కవులకు నీరాజనం ప్రకటించారు. తెలుగు జాతి వైభవాన్ని, తెలుగుపద్య ఖ్యాతిని ఒక వెలుగు వెలిగించిన అవధాన విద్యను మర్చిపోకుండా అష్టావధాన కార్యక్రమాలను నిర్వహించిన పెద్దలకు, అవధాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సాహితీ ప్రియులందరికీ కృతజ్ఞతలు. కొప్పరపు కవుల కవితా వైభవ ప్రాశస్త్యాన్ని, వారి జీవిత విశేషాలను కళ్ళకు కట్టినట్లు తెలియజేసిన ప్రసాదరాయ కులపతి వాక్కులు అక్షరసత్యాలు. 29న వేంకట సుబ్బరాయ కవి వర్థంతిని పురస్కరించుకుని కొప్పరపు సోదర కవుల కమనీయ కవితా వైభవాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అదే మనం వారికిచ్చే నిజమైన నివాళి.

Courtesy: ఆంధ్ర ప్రభ


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Unicode Official Telugu page is now Live !

I am happy to inform that within 4 days of starting on this ( http://tinyurl.com/hgh4m ), the Official Telugu translation page about Unicode is now up on the website of the Unicode Consortium.

http://www.unicode.org/standard/translations/telugu.html

Thanks to Veeven, Chaduvari, and all the members of the TeluguBlog Community.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Tuesday, April 04, 2006

Foster unity, Telugus in Karnataka told

Andhra Pradesh Chief Minster Rajasekhara Reddy, Finance Minister Rosaiah take part in `Ugadi Utsavaalu'

FOR BETTER RELATIONS: Andhra Pradesh Chief Minister Y.S. Rajasekhara Reddy (centre), Andhra Pradesh Finance Minister K. Rosaiah (left), and convenor, World Telugu Federation, J.S. Reddy, at the Karnataka Telugu Federation's 2006 `Ugadi Utsavaalu' in Bangalore on Monday. — Photo: K. Gopinathan

BANGALORE: For Telugus living in Karnataka, particularly in Bangalore, Andhra Pradesh Chief Minister Y.S. Rajasekhara Reddy's visit on Monday was an occasion to reinforce the relationship between the two States.

Mr. Reddy himself stressed on that point as he urged the Telugu-speaking people to foster unity and maintain the cordial relationship being enjoyed by the two States.

Participating in a function organised by the Karnataka Telugu Federation, Mr. Reddy said even history revealed that Karnataka and Andhra Pradesh had a good relationship.

Krishnadevaraya of the Vijayanagar empire, though a Kannadiga, strived for the welfare of the Telugus.

"We should continue to maintain this relationship," Mr. Reddy said.

The federation had arranged the function to honour nine people in various fields with Vemana Memorial Award as part of the "Ugadi Utsavaalu" here.

Mr. Reddy said, "Wherever we are, we should live in unity and maintain our culture, then only we can achieve success and the country can progress." He said Andhra Pradesh had given priority to complete the ongoing irrigation projects to help farmers. Andhra Pradesh Finance Minister K. Rosaiah, in his address, said there was a proposal to set up a department to look after the affairs of people from Andhra Pradesh living abroad.

Mr. Reddy would shortly visit Dubai and discuss with the Sultanate of United Arab Emirates about the problems being faced by Telugus living there.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


The Holy Quran in Telugu

http://www.alislam.org/quran/tafseer/guide.htm?region=TL


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Monday, April 03, 2006

Songs of Telugu women folk

Songs by Telugu women, forms an integral part of Indian literature

WORD WIZ Retired Telugu Professor of Andhra University K. Malayavasini

సాహిత్య సురభి (Sahitya Surabhi, a well known literary body, organised a talk on స్తీల పాటల్లొ రామాయణం (`Streela Paatallo Ramayanam') recently. Former HoD of A.U. Department of Telugu, ప్రోఫ్. కే. మలయవసిని (Prof. K. Malayavasini quoting extensively and singing scores of key stanzas from such songs besides a few from Telugu ballads and orations, delivered an absorbing and thought provoking discourse. Many an aspect that stood considered or appeared very trivial in all versions of the Ramayana, starting from the original by Valmiki in Sanskrit, are the lyrics sung by the Telugu women . More astonishingly, some aspects that just peep out from inbetween the lines in some versions of the epic not only form the central theme of such lyrics but also get fascinatingly adorned for elaboration.

Despite the fact that the origin of these lyrics, including the rustic tunes of the songs of the Telugu women folk still remains an enigma, the tradition of singing these still continues to be an integral part of the Telugu culture, of the countryside in particular that went on Malayavasini. They stand considered sprouts of expressive and effusive imagery in native dialect arising out of the seeds of immense love and deep rooted affection of the women folk.

The songs that picturise సీతా ఆటపాటలు (Sita Aatapaatalu), కల్యాణం (Kalyanam), అప్పగింతలు (Appaginthalu), వసంతం (Vasantham), సీతమ్మగడియ (Sitammagadiya), అలక (Alaka) etc., pertain to the story of Ramayana before the Aranyavasam. సీతా చేర (Sita Chera), ఆనవాళ్ళు (Aanavaallu), ముద్రిక (Mudrika), అగ్నిపరీక్ష (Agnipareeksha) so on and so forth, speak volumes of the అరణ్యవాసం (Aranyavasam). సీతాస్తుతి (Sitastuti), సీతా రాముల సంవాదం (Sita Ramula Samvadam), ఉర్మిల దేవి నిద్ర (Urmila Devi Nidra) and లక్ష్మణ దేవర నిద్ర (Lakshmana Devara Nidra) speak of the story after the రామపట్టాభిషేకం (Ramapattabhishekam). Similarly, there exists many an elaborate ballad, ballad operas and oratorios describing these events, but their authorship is not known.

Gurudeb Rabindranath Tagore in his treatise on neglected heroines of the epic age refers to these aspects with all regard. Devendra Satyardhi, a researcher of high esteem on Indian folk literature in his book titled Meet My People also mentioned in detail such songs of the Telugu women folk.While the president of the Surabhi, V. Kalyana Rama Rao chaired the session, noted writers and lyricists Dr. Manukonda Suryakumari and Aduri Satyavathi Devi who were guests of honour felicitated Malayavasini. Secretary Oruganti Rajendra Prasad proposed a vote of thanks.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, April 01, 2006

అన్నమయ్య


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'