"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, May 31, 2006

Telugus dominate IIT-JEE 2006


The performance curve of AP's students into the premier engineering institute of India is only rising every year. IIT-Madras now has more Telugus than any other linguistic community. Telugu is the second most spoken language (after Bengali) in IIT-Kharagpur. Around 50% of the M.Tech seats in IIT-Kanpur are taken by students from Andhra Pradesh, along with a considerable presence among the undergrads.

This is all the more reason for us to claim that the state of Andhra Pradesh now deserves an Indian Institute of Technology (IIT). BITS, IIIT, ISB are already there...now we are waiting for IIT.

The Telugu Brains are gonna take over...


ఐఐటీ-జేఈఈలో రాష్ట్రానికి ర్యాంకుల పంట

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఐఐటీ-జేఈఈ)లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు భారీగానే ర్యాంకులు సాధించారు. 500నుంచి 600 ర్యాంకులు రాష్ట్రానికి వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వివిధ కార్పొరేట్‌ కాలేజీలు ప్రకటించిన సమాచారం మేరకు ఈ సంఖ్య 900 పైమాటే. గత ఏడాది మన రాష్ట్రం నుంచి సుమారు 500 మంది ఐఐటీల్లో సీట్లు సాధించే స్థాయి ర్యాంకులు పొందారు. ఈ ఏడాది నుంచి ఐఐటీ పరీక్షావిధానం మారింది. దేశవ్యాప్తంగా సుమారు 4లక్షల మంది హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి లక్ష మంది ఈ పరీక్ష రాశారు. మారిన విధానంవల్ల రాష్ట్రానికి ర్యాంకులు పెరిగినట్లు చెబుతున్నా, 100లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. తొలి పది స్థానాల్లో కూడా ర్యాంకులు పెద్దగా రాలేదు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని 7 ఐఐటీల్లో సీట్లు లభిస్తాయి. వీటిలో మొత్తం 4,935 సీట్లుండగా.. వాటిలో రిజర్వ్‌ కేటగిరీలో 1261 సీట్లున్నాయి (ఎస్సీలకు 741, ఎస్టీలకు 371, వికలాంగులకు 149 చొప్పున సీట్లను కేటాయించారు). జేఈఈలో 3,500 లోపు ర్యాంకు వస్తే ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక కోర్సులో సీటు దొరికే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.

సిలబస్‌ మారిస్తే...: ఐఐటీ-జేఈఈకి సాధారణంగా సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచే ప్రశ్నలు అడుగుతారు. రాష్ట్రంలోని ఇంటర్‌ కెమిస్ట్రీ సిలబస్‌ సీబీఎస్‌ఈ కంటే 30% తక్కువగా ఉండటం కూడా మన విద్యార్థులకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాదికల్లా ఈ సిలబస్‌లో పూర్తి మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అప్పుడు ర్యాంకులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

మారిన పద్ధతిపై భిన్నాభిప్రాయాలు: ఈసారి జేఈఈ పరీక్ష విధానం మారడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గతంలో ఇదే పరీక్షలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఉండేవి. డిస్క్రిప్టివ్‌ తరహా ప్రశ్నలుండేవి. కానీ ఈ ఏడాది నుంచి ఒకే పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. దీంతో విద్యార్థులు గందరగోళ పడ్డారని, మరిన్ని ర్యాంకులు లభించే అవకాశాలు సన్నగిల్లాయని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. 'కిందటి ఏడాది నవంబరులో పరీక్ష విధానం మారింది. దీనికి అనుగుణంగా విద్యార్థులు సిద్ధమవడానికి తగిన వ్యవధి లేకుండా పోయింది. రకరకాల పద్ధతుల్లో ప్రశ్నలు ఉండటమే కాకుండా వాటికి వాటికి రకరకాలుగా మార్కులు కేటాయిస్తుండటంతో ఈసారి భావనలపై పరిజ్ఞానంతో పాటు కొంత వేగానికి, కచ్చితత్వానికి కూడా ప్రాధాన్యం పెరిగింది. 6 మార్కుల ప్రశ్నల్లో ఇంతకుముందు ప్రతి స్టెప్‌కూ మార్కు ఇచ్చేవారు. తుది జవాబు సరైనది కాకపోయినా కొన్ని మార్కులు వచ్చేవి. ఇప్పుడలా కాదు. వస్తే 6 మార్కులు; లేకుంటే సున్నా' అని ఒక శిక్షకుడు వివరించారు. వచ్చే ఏడాదికి మన విద్యార్థులు కొత్త పద్ధతికి అలవాటు పడతారని, అంతా చక్కబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పరీక్ష విధానానికి అనుగుణంగా శిక్షణ ఇస్తే ఈ విధానంలోనైనా మంచి ర్యాంకులు సాధించేందుకు అవకాశం ఉందని మరో నిపుణుడు చెప్పారు. పద్ధతి మారినా, ఐఐటీ ప్రమాణాల్లో తేడా కనిపించలేదని అన్నారు.

ఐఐటీ-జేఈఈలో ప్రైవేటు కాలేజీల హవా
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

ఐటీ-జేఈఈలో రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలు భారీఎత్తున ర్యాంకులు సాధించాయి. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు సాధించిన ర్యాంకుల వివరాలిలా ఉన్నాయి...

నారాయణ అకాడమీకి 291 ర్యాంకులు
నారాయణ ఐఐటీ-జేఈఈ అకాడమీలో శిక్షణ పొందిన రాష్ట్రానికి చెందిన 291 మంది విద్యార్థులు ర్యాంకులు పొందినట్లు సంస్థ ఛైర్మన్‌ పి.నారాయణ తెలిపారు. తమ విద్యార్థి శేష పవన్‌ శ్రీనాథ్‌కు జాతీయస్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో 5వ ర్యాంకు వచ్చిందని చెప్పారు. లోకేష్‌ దుర్గా భరత్‌ అనే విద్యార్థికి జాతీయ స్థాయిలో రిజర్వ్‌ కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చిందన్నారు. తమ విద్యార్థులు రాష్ట్రం నుంచి ఓపెన్‌ కేటగిరీలో వందలోపు 4 ర్యాంకులు, రిజర్వేషన్‌ కేటగిరీల్లో వందలోపు 18 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే... ఈసారి ర్యాంకులు సాధించిన వారి శాతం 1.2 మేర పెరిగి, 5.8 శాతానికి చేరిందన్నారు. దేశవ్యాప్తంగా తమకు ఈ ఏడాది 835 ర్యాంకులు లభించాయని, మొత్తం ఐఐటీ సీట్లలో ఇది 16.92 శాతమని తెలిపారు.

శ్రీచైతన్యకు 217 ర్యాంకులు
జేఈఈ ఫలితాల్లో తమ విద్యార్థులు అన్ని కేటగిరీల్లోనూ మొత్తం 217 ర్యాంకులు సాధించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ బి.ఎస్‌.రావు తెలిపారు. ఫలితాల వెల్లడి అనంతరం బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అన్ని కేటగిరీల్లో కలిపి వందలోపు 11 ర్యాంకులు, వేయిలోపు 78, రెండువేల లోపు 111, మూడువేల లోపు 148 ర్యాంకులు పొందారన్నారు. ఐఐటీల్లో సీట్లు సాధించగల స్థాయిలో మొత్తం 217 ర్యాంకులు తమ విద్యార్థులకు లభించినట్లు చెప్పారు. ఈ ర్యాంకుల ద్వారా 176 మంది జనరల్‌ కేటగిరిలో, మిగిలినవారు రిజర్వ్‌ కేటగిరిలో సీట్లు పొందుతారని చెప్పారు. తమ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో వికలాంగుల విభాగంలో ఆర్‌.యు.వి.ఎన్‌.సతీష్‌ 9వ ర్యాంకు పొందినట్లు చెప్పారు. ఈసారి పరీక్షకు తాము 1500 మందికి శిక్షణ ఇచ్చామని, రానున్న ఏడాదికి 2500 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.

113 ర్యాంకులు సాధించిన వైజాగ్‌ వికాస్‌
వైజాగ్‌ వికాస్‌ విద్యాసంస్థ విద్యార్థులు మొత్తం 113 ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యాసంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.ఎన్‌.ఎన్‌.మూర్తి తెలిపారు. అన్ని కేటగిరీల్లోనూ వందలోపు 6 ర్యాంకుల్ని తమ విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు. వెయ్యిలోపు 20 ర్యాంకులు, రెండువేలలోపు 50 ర్యాంకులు, మూడువేల లోపు 75 ర్యాంకుల్ని తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు.

రామయ్య విద్యార్థులకు 103 ర్యాంకులు
తమ విద్యార్థుల్లో 103 మందికి ఐఐటీలో అర్హత కలిగే ర్యాంకులు వచ్చినట్లు రామయ్య స్టడీ సర్కిల్‌ అధినేత చుక్కా రామయ్య తెలిపారు. 100 లోపు 7 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. కొత్త పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడంలో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని చెప్పారు.

గౌతమ్‌ విద్యాసంస్థలకు 58 ర్యాంకులు
తమ విద్యార్థులు 58 ర్యాంకులను సాధించినట్లు గౌతమ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ చౌదరిబాబు తెలిపారు. విజయవాడ సమీపంలోని గూడవల్లి క్యాంపస్‌ నుంచే 55 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. వందలోపు ముగ్గురు, వెయ్యిలోపు 20 మంది, రెండువేల లోపు 30 మంది, మూడువేలలోపు 40 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు.

'వి' స్టడీ సర్కిల్‌కు 52ర్యాంకులు
'వి' స్టడీ సర్కిల్‌కు మొత్తం 52 ర్యాంకులు వచ్చినట్లు ఆ విద్యాసంస్థ అధినేత కృష్ణమూర్తి పేర్కొన్నారు. స్పెషల్‌ కోచింగ్‌ సెంటర్‌కు 22 ర్యాంకులు వచ్చినట్లు డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.

నలందా విద్యార్థులకు 32 ర్యాంకులు
తమ దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులకు ఐఐటీలో సీట్లు లభించే 32 ర్యాంకులు వచ్చినట్లు నలంద ఐఐటీ-జేఈఈ అకాడమీ ప్రతినిధి మోహన్‌రావు పేర్కొన్నారు. డి.అనిల్‌రెడ్డి రిజర్వ్‌ కేటగిరీలో జాతీయస్థాయిలో 4వ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. వెయ్యిలోపు 19, మూడువేలలోపు 32 ర్యాంకుల్ని సాధించినట్లు పేర్కొన్నారు.

'డెల్టా'కు 32ర్యాంకులు
హైదరాబాద్‌లోని డెల్టా ఎడ్యుకేషనల్‌ అకాడమీకి ఐఐటీలో సీట్లు సాధించగల 32 ర్యాంకులు వచ్చినట్లు డైరెక్టర్‌ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. వందలోపు ఒక ర్యాంకును సాధించినట్లు తెలిపారు.

'పేజ్‌'కు 13 ర్యాంకులు
ప్రీమియర్‌ అకాడమీ ఫర్‌ జనరల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ (పేజ్‌) సంస్థలో ఐఐటీలో సీట్లు సాధించగల స్థాయిలో 13 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు డైరెక్టర్‌ జె.వి.రామారావు తెలిపారు. తమ సంస్థ నుంచి 19 మంది ఐఐటీ-జేఈఈలో అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.

ర్యాంకర్ల స్పందన

ప్రణాళికతో చదివా: శేష పవన్‌
మా స్వస్థలం నెల్లూరుజిల్లా కావలి. ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్‌ చేరాలని ఉంది. టాప్‌త్రీ ర్యాంకు ఊహించాను. ఐదో ర్యాంకు వచ్చింది. సంతోషంగానే ఉంది. ఎంసెట్‌లో రెండో ర్యాంకును, ఏఐఈఈఈలో అలిండియా మూడో ర్యాంకు, రాష్ట్రంలో మొదటి ర్యాంకునూ సాధించాను. ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే ఇదంతా సాధ్యమయింది. ర్యాంకు సాధన వెనుక అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంది. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళతాను. కానీ మన దేశంలోనే స్థిరపడాలని ఉంది.

మంచి ఇంజినీర్‌ అవుతా
మానాన్న ఈశ్వరరావు జీడిమెట్లలో ఆర్టీసీ డ్రైవర్‌. ఇంటర్‌లో 944 మార్కులు సాధించాను. ఎంసెట్‌లో 1300 ర్యాంకు పొందాను. ఐఐటీ చెన్నైలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతాను. మంచి ఇంజినీరు కావాలన్నదే నా జీవితాశయం. సతీష్‌, వికలాంగుల కేటగిరిలో 9వ ర్యాంకు

ఆశావహ దృక్పథం ఉండాలి
ఐఐటీ ర్యాంకు సాధనలో తొలి ప్రయత్నంలో విఫలమైనా... లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌లో చేరి మళ్ళీ ప్రయత్నించాను. మనవల్ల సాధ్యంకాదనే అపనమ్మకం వీడి ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తే ర్యాంకు సాధన కష్టంకాదు.
లోకేష్‌, రిజర్వ్‌ కేటగిరిలో మొదటి ర్యాంకు

- హైదరాబాద్‌, రాజమండ్రి, న్యూస్‌టుడే
Courtesy: ఈనాడు
*****

State students bag 10 p.c. IIT seats

One secures all-India fifth rank; 600 students likely to get admission


ON CLOUD NINE: IIT entrance test top ranker Sesha Pavan celebrates his stupendous performance with his friends and classmates in Hyderabad on Wednesday. - Photo: Satish H.

HYDERABAD: Notwithstanding the new format of the IIT-JEE, students from the State continued their golden run bagging more than 10 per cent of the IIT seats in the country.

According to figures available, nearly 600 students will get into the portals of IIT this year. The topper from the State this year is B. Sesha Pavan of Narayana College, who got the all-India 5th rank. Incidentally, the student got second rank in EAMCET-2006 and third in AIEEE this year. A notable feature is the success of students from rural background. State students also bagged top ranks in reserved categories like SC, ST and Physically Handicapped (PH).

The first rank in the ST category went to Lokesh Durga Bharath of Narayana Nellore branch while the 4th rank in PH category went to D. Anil Reddy of Vijayawada Nalanda college. Son of an RTC driver, R.U.V.N. Satish of Sri Chaitanya college in the city bagged 9th rank in PH category.

A majority of success stories have come from corporate colleges. Students of Narayana institutions got 291 seat getting ranks while Sri Chaitanya got 217 ranks. The IIT fame Chukka Ramaiah's institute will send 103 students to IITs this year while Nalanda IIT Academy and Delta Educational Academy will send 32 candidates each. Several State students figured in the top 100 ranks.

Narayana group Chairman P. Narayana said the State was likely to improve the position to 11 per cent of seats from 8.5 per cent last year and attributed it to students' awareness and their hard work. He said the innovative teaching concepts help students crack the test confidently. Dr. Narayana also gave Rs. 3 lakhs to the State topper Sesha Pavan and the same was handed over by the Chief Minister, Y.S. Rajasekhara Reddy.

B.S. Rao, Director of Sri Chaitanya said 176 of his students got in the general category itself that was a record of sorts. Chukka Ramaiah said the new format gave scope for some luck and conceptual testing suffered.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'