"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Thursday, June 08, 2006

$3bn 'FAB CITY' takes wings

ఫ్యాబ్‌ సిటీకి శంకుస్థాపన
సెమీకండక్టర్‌ పరిశ్రమకు ప్రోత్సాహం
త్వరలో విధానం
ముసాయిదా సిద్ధం
మారన్‌ వెల్లడి
హైదరాబాద్‌-న్యూస్‌టుడే

click on image


దేశంలో సెమీకండక్టర్‌ పరిశ్రమను ప్రోత్సహించడానికి త్వరలో విధానం ప్రకటించబోతున్నామని, దీని ముసాయిదా కూడా తయారైందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖా మంత్రి దయానిధిమారన్‌ ప్రకటించారు. ప్రోత్సహకాలు అందించే ప్యాకేజీలను కూడా ఈ విధానంలో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 'హైటెక్‌ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు, ఔత్సాహికులతో విస్తృతంగా చర్చించి వారి విజ్ఞప్తులు దృష్టిలో ఉంచుకుని ముసాయిదా తయారు చేశాం' అని అన్నారు. కొన్ని వారాల్లోనే దీన్ని ప్రకటిస్తామని చెప్పారు. కేవలం సెమీకండక్టర్‌ పరిశ్రమనే కాకుండా ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ రంగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. దేశంలోనే మొదటిదైన ఫ్యాబ్‌సిటీ శంకుస్థాపనలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఈ విషయాలు ప్రస్తావించారు. ఫ్యాబ్‌సిటీకి, అందులో ఏర్పాటుచేస్తున్న సెమ్‌ఇండియా యూనిట్‌కు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్లో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సెమ్‌ఇండియా ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. భారత సెమీ కండక్టర్‌ పరిశ్రమలో 90 లక్షల ఉద్యోగావకాశాలున్నాయని మారన్‌ పేర్కొన్నారు. భారత్‌లో 2015 నాటికి 350 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల వినియోగం ఉంటుందని, 40 మిలియన్‌ డాలర్ల విలువైన సెమీ కండక్టర్లను భారత్‌ దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఫ్యాబ్‌ సిటీ ఏర్పాటుతో హార్డ్‌వేర్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

రెండేళ్లలో ఇష్యూ: వినోద్‌ అగర్వాల్‌
1200 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేస్తున్న ఫ్యాబ్‌సిటీ ప్రాజెక్టులో దాదాపు ఆరు ఫ్యాబ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉంటుందని సెమ్‌ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ వినోద్‌ అగర్వాల్‌ వెల్లడించారు. సెమ్‌ఇండియా ఫ్యాబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో తాము ఏర్పాటుచేస్తున్న యూనిట్‌ను మూడు దశల్లో పూర్తిచేయనున్నట్లు చెప్పారు. ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత రెండేళ్ల కాలంలో పబ్లిక్‌ ఇష్యూకు రానున్నట్లు అగర్వాల్‌ వెల్లడించారు. ప్రాజెక్టు ప్రారంభించడానికి ప్రభుత్వపరంగా రావాల్సిన అనుమతుల కోసం ఇంకా వేచి చూస్తున్నట్లు చెప్పారు.

సెమ్‌ఇండియాతో బీఓసీ ఒప్పందం
ఫ్యాబ్‌ సిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్న సెమ్‌ఇండియాకు బేస్‌ ఆక్సిజన్‌ కంపెనీ (బీఓసీ) రూపంలో సరికొత్త భాగస్వామి లభించినట్లయింది. ఫ్యాబ్‌సిటీలో సెమ్‌ఇండియా ఏర్పాటు చేయతలపెట్టిన చిప్‌ తయారీ యూనిట్లకు అవసరమయ్యే ఇండస్ట్రియల్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాస్‌లను సరఫరా చేసేందుకు బీఓసీ ముందుకొచ్చింది. ఈ రూపంలో సెమ్‌ఇండియా ప్రాజెక్టులో రూ. 120 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు బీఓసీ (దక్షిణాసియా) ఎండీ సంజీవ్‌ లాంబా ప్రకటించారు. బుధవారం ఫ్యాబ్‌సిటీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి, కేంద్ర మంత్రి దయానిధి మారన్‌ల సమక్షంలో సెమ్‌ఇండియా, బీఓసీలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. చిప్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి సెమ్‌ఇండియా ఇప్పటికే ఏఎండీతో సాంకేతిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైకు చెందిన ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ కూడా సెమ్‌ఇండియాతో జతకట్టింది. బీఓసీ రాకతో భాగస్వామ్యాల సంఖ్య మూడుకు చేరుకుంది. మరోవైపు... ఫ్యాబ్‌ సిటీ రూపకల్పన, నిర్మాణానికి గాను తెమాసెక్‌ హోల్డింగ్స్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ సర్బానాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెమ్‌ఇండియా సీఈఓ వినోద్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

Courtesy: ఈనాడు

*****

HYDERABAD — The first semiconductor or silicon chip manufacturing unit of India is expected to be ready in a year's time, setting in motion of the process of making India self-sufficient in the crucial area of high tech and electronic hardware industry.

Foundation stone was laid in Hyderabad yesterday for $3 billion "FAB City" project, promoted by the US-based SemIndia.

Speaking on the occasion Indian Minister for Communication and Information Technology Dayanidhi Maran said that government will come out with a new policy and special package of incentives for semiconductor manufacturing in the country with in a few weeks to give a boost to the high-tech and electronic hardware industry.

Maran said that without a semiconductor-manufacturing base, India will not be able to emerge as a major hub of hardware manufacturing.

The first phase the FAB City will have an assembly and testing plant with an investment of $100 million. It is expected to be ready with in a year. Subsequently about six Fabs or the semiconductor and chip-manufacturing units will be built with an investment of 3 billion dollars in two phases.

The entire project will be spread over an area of 1,200 acres at Tukkuguda in Ranga Reddy district. The foundation stone plaque was formally unveiled by the State Chief Minister Y. S. Rajasekhara Reddy.

Dayanidhi Maran said that the FAB City will definitely be a Special Economic Zone to make it more viable and workable. "It is not for domestic consumption alone. It is also for exports to ensure that we utilise it fully by exporting to the neighbouring countries," he said.

Quoting the recent study by Frost and Sullivan, Maran said that the demand for electronic consumption would touch $ 350 billion by 2015 and India would have to import semiconductors of $ 40 billion worth. He said that the Fab City project will help in substituting the imports with the locally manufactured semiconductors and it will bring down the cost by 15 per cent.

He said more and more companies were looking at India seriously for the semiconductor manufacturing as it gives them cost advantage also offers a very big market.

"This is why we are taking active steps in establishing core component supply to the emerging electronic manufacturing services companies such as Nokia, Motorola, LG, Flextronics and Solectron etc," he said.

Pointing out that semiconductor industry was very capital intensive and other countries had taken equity participation and given incentives to the industry, Maran said that before drafting the policy Indian government also had to look at what countries like USA, China, Taiwan, Singapore, Malaysia, Germany and Ireland had done and how they had funded the industry.

Vinod Kumar Agarwal, the Chairman and CEO of SemIndia announced strategic partnership with Base Oxygen Corporation (BOC) for providing infrastructure and equipment facilities, gases and vaccum products and services to the FAB City project.

After signing a formal MoU, Sanjiv Lamba, the managing director, South and South East Asia, BOC said that the company will be investing Rs120 crore (approximately $27 million) for each FAB unit of SemIndia in Hyderabad.

The SemIndia has already announced strategic partnerships with Flextronics of Singapore and AMD of the USA. Surbana International of Singapore will develop the Master Plan and township development study for the FAB City project.

On the financial closure of the project, Agarwal said that funds were in place for the $ 100 million assembly and testing plant and financial closure for the FAB units will be achieved once the government of India announces its policy for the industry and it becomes clear how much investment will come from the government. Pointing out that Intel for its project in Israel had got a package of 600 million dollars from the government. He said SemIndia will be looking for a comparative package of incentives. Replying to a question he said that partnership with IBM will be announced at an appropriate time.


Courtesy: Khaleej Times


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home