"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Monday, December 04, 2006

కోనేరు హంపి wins India's first Gold in the 15th Asian Games



Doha: Koneru Humpy of Vijayawada (Andhra Pradesh) did India proud by winning the individual women's rapid chess championship, which concluded here on Monday night. Humpy gave India its first gold medal in the 15th Asian Games.

Ranked second in the world among women chess players, Humpy accumulated eight points in the nine-round tournament, played in the Swiss league format, at the Al Dana Indoor hall.

The 19-year-old Indian beat Dana Aketayeva of Kazakhstan in the ninth and final round to bring the laurels to the country in the sport, making its debut at the multi-discipline event.

China's Zhao Xue, who was just half a point adrift of the Indian, placed second.

India's medal tally at the Games stands at one gold, three silver and two bronze.

Humpy, who was surprised by Xue in the sixth round on Sunday, came back with vengeance to win all the three matches scheduled on the final day.

The Vijaywada stalwart first got the better of Irine Kharisma Sukandar of Indonesia in the seventh round and subsequently beat Mahri Geldyyeva of Turkmenistan in the eighth, maintaining her half point lead to end Chinese dominance.

Humpy had recently defeated former World champion Anatoly Karpov of Russia at Cap d'Adge Chess Festival in France in rapid format. She will now play in the team championships, to be held in the classical format from Wednesday.

Courtesy: Rediff

*****

ఆసియా క్రీడలు చెస్‌
తొలి స్వర్ణం మన హంపికి

ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి కోనేరు హంపి... దోహా ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల్లో మొదటిసారి ప్రవేశపెట్టిన చెస్‌లో తొలి స్వర్ణ పతకాన్ని వశం చేసుకుంది. భారత్‌ ఖాతాలో చేరిన తొలి పసిడి కూడా ఇదే. తొమ్మిది రౌండ్ల మహిళల ర్యాపిడ్‌ చెస్‌లో హంపి 8 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని అలంకరించింది. 'ఆ ఆనందమే మిన్న' అంటూ తన మనోభావాల్ని 'ఈనాడు'తో పంచుకుంది. ఆ వివరాలు...
చెస్‌లో తొలి స్వర్ణం మనదే
దోహా ఆసియా క్రీడల్లో సోమవారం భారత్‌కు మరుపురాని రోజు. తెలుగుజాతి యావత్తు గర్వపడే రోజు. ఆసియా క్రీడల చెస్‌లో తెలుగుతేజం కోనేరు హంపి సత్తా చాటింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన చెస్‌లో తొలి స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. భారత్‌కు స్వర్ణాల బోణీ కొట్టింది. ఆసియా క్రీడల్లో మన రాష్ట్ర మహిళ ఒకరు స్వర్ణ పతకం గెలుచుకోవడం ఇదే తొలిసారి.
దోహా: ఆసియా క్రీడల్లో గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి... భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించింది. సోమవారం తొమ్మిదో రౌండ్‌ గేమ్‌లో దానా అకెతేవా (కజకిస్థాన్‌)పై విజయభేరి మోగించి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ రోజు తెలుగుతేజానికి తిరుగేలేదు. సాయంత్రం ఆడిన మూడు రౌండ్లలోనూ విజయం సాధించింది. ఏడో రౌండ్లో ఇరినా ఖరిష్మా సుకందర్‌(ఇండోనేషియా)ను ఓడించిన హంపి... ఎనిమిదో రౌండ్లో మహ్రి గెల్దేవా(తజకిస్థాన్‌)ను మట్టికరిపించింది. ఆ దశలో హంపి తన సమీప ప్రత్యర్ధులు జీ ఝావో(చైనా), ఝు చెన్‌(ఖతార్‌)లకన్నా కేవలం అర పాయింట్‌ ఆధిక్యంలో ఉంది. కీలక చివరి రౌండ్‌లో అకెతేవాపై విజయభేరి మోగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొమ్మిది రౌండ్లలో ఆరోగేమ్‌లో మాత్రమే హంపికి పరాజయం ఎదురైంది. జీ ఝావోకు రజతం, ఝు చెన్‌కు కాంస్యం లభించాయి. పురుషుల విభాగంలో మరో తెలుగుతేజం హరికృష్ణ పదకొండో స్థానం లభించింది. శశికిరణ్‌కు పదమూడో స్థానం సాధించింది.

... ఆ ఆనందమే మిన్న

'న్యూస్‌టుడే'తో కోనేరు హంపి
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే


యాభై ఐదేళ్ల ఆసియా క్రీడల చరిత్రలో అపూర్వ ఘట్టం... క్రీడాంధ్రప్రదేశ్‌ చరిత్రలో అపురూప సన్నివేశం. గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి... ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. అమ్మ తోడుంటే తప్పక పతకం తెస్తానన్న హంపి ఘంటాపథంగా చెప్పింది. ఒకదశలో తల్లి లేకుండా వెళ్లబోనని మొరాయించింది కూడా. హంపి అన్నమాటను నిలబెట్టుకుంది. విజయం తర్వాత 'న్యూస్‌టుడే'తో ఆమె తన ఆనందాన్ని ఇలా పంచుకుంది...

ఆసియా క్రీడల్లో తొలిసారిగా చెస్‌ను ప్రవేశపెట్టారు. అందులో తొలి స్వర్ణం నేనే సాధించాను. దానికంటే కూడా ఈ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన ఆనందమే నాకు ఎక్కువ సంతోషాన్నిస్తోంది. అదీ వ్యక్తిగత విభాగంలో. చెప్పలేనంత ఆనందంగా ఉంది. చివరి రౌండ్‌లో డ్రా చేసుకున్నా పతకం వచ్చేదే. కానీ స్వర్ణం సాధించాలని పట్టుదలగా ఆడాను. ఇది ర్యాపిడ్‌ చెస్‌. తక్కువ సమయం ఉంటుంది. చాలా వేగంగా ఆడాలి. ఈ టోర్నీ కంటే ముందు ఫ్రాన్స్‌లో ర్యాపిడ్‌ చెస్‌ ఆడాను. ఆ అనుభవం ఇక్కడ పనిచేసింది.

అమ్మ వల్లే...:

ఆరో రౌండ్లో మాత్రమే ఓడిపోయాను. నైతిక స్త్థెర్యం దెబ్బతినకుండా అమ్మ నా వెన్నంటి నిలిచింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నాన్నతో కూడా ఫోన్లో మాట్లాడుతూ తరువాతి గేమ్‌ గురించి చర్చించాను. అదంతా కలిసొచ్చింది. పది రోజుల పాటు చెన్నైలో శిక్షణ తీసుకున్నాం. అది చాలా తక్కువ సమయమని నా అభిప్రాయం. అక్కడ కొన్ని వ్యూహాలు నేర్చుకున్నాం. వ్యక్తిగత విభాగంలో ఆ వ్యూహాల్ని ఆచరణలో పెట్టలేదు. టీం ఈవెంట్‌లో ఆ వ్యూహాలతో ముందుకెళ్తాం. ఐదోరౌండ్‌లో ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ ఝు చెన్‌(ఖతార్‌)పై విజయం సాధించిన తర్వాత ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. కానీ తరువాతి గేమ్‌లోనే పరాజయం. అయినా సొంత ఆటతీరును కొనసాగించాను. విజయం సాధించాను. హరికృష్ణ, శశికిరణ్‌ చక్కగా ఆడారు. పతకం సాధించలేకపోయారు. టీం విభాగంలో తప్పకుండా పతకం గెల్చుకుంటాం. భారత్‌లో కంటే ఇక్కడే చెస్‌కు మీడియా నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోంది. రెట్టింపు సంఖ్యలో పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్‌ మీడియా ఉంది. ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

మాటలు రావట్లేదు.. తల్లి లత:

పెద్ద పెద్ద టోర్నమెంట్లలో హంపి పతకాలు సాధించినప్పుడు వెంటలేను. ఆమె సాధించిన విజయానికి ఇక్కడ కనిపిస్తున్న ఆదరణ చూస్తుంటే మాటలు రావట్లేదు. గేమ్‌ ముగిసి పది నిమిషాలు అవుతున్నా ఇంకా హంపి దగ్గిరికే వెళ్లలేదు. అంతలా జనాలు చుట్టుముట్టారు.

సంతోషంగా ఉంది.. తండ్రి అశోక్‌:

హంపి స్వర్ణం గెలవడం చాలా సంతోషాన్నిస్తోంది. దేశం గర్వించదగ్గ విజయమిది. చివరి వరకు ఎంతో ఏకాగ్రతతో ఆడింది. హంపికి ప్రధానంగా ఝు చెన్‌, ఝాంగ్‌ జూ నుంచే పోటీ ఎదురవుతుందని తెలుసు. వాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఝాంగ్‌ చేతిలో పరాజయం తప్పలేదు. ఏదేమైనా దేశానికి తొలి స్వర్ణం అందించింది.


Courtesy: ఈనాడు
telugu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 3:23 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

off white jordan
off white hoodie
supreme outlet
off white
golden goose sale

 

Post a Comment

<< Home