"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Friday, October 31, 2008

Telugu gets official 'Classical Language' status

తెలుగుకు ప్రాచీన హోదా

కన్నడానికీ దక్కిన గుర్తింపు

రాష్ట్రావతరణకు కేంద్ర కానుక
మద్రాస్‌ కోర్టు తీర్పు తర్వాతే అమలు
మంత్రి అంబికా సోనీ వెల్లడి


న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: తెలుగు, కన్నడ భాషలను ప్రాచీన భాషలుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా ఈ కానుక ప్రకటించినట్లు పేర్కొంది. అయితే భాషలకు ప్రాచీనహోదా కల్పించడానికి కేంద్రం నిర్దేశించిన అర్హతలపై భాషా నిపుణుల సంఘం సభ్యుడొకరు మద్రాస్‌ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వెలువడే తీర్పునకు లోబడే ఈ ఆదేశాలు అమలవుతాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు.
కోర్టు తీర్పు వెలువడిన నాటి నుంచే ప్రాచీన హోదా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ''కన్నడ, తెలుగులను ప్రాచీనభాషలుగా గుర్తించాలని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి మాకు అనేక వినతిపత్రాలు అందాయి. వీటన్నింటినీ భాషానిపుణుల సంఘానికి నివేదించాం. తాజాగా ఈ సంఘం తెలుగు, కన్నడాలను ప్రాచీన భాషలుగా గుర్తించవచ్చని సిఫారసు చేసింది. నవంబర్‌ 1న రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని వీటిని ప్రాచీన భాషలుగా గుర్తిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. అయితే ఇది మద్రాస్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌పై తీర్పునకు లోబడి ఉంటుంది. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ కేంద్రం కోర్టును కూడా ఆశ్రయించింది'' అని వివరించారు. ఈ వ్యవహారంపై కోర్టు స్టే ఇవ్వకపోవడం వల్ల తాము ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది మంది సభ్యులున్న భాషా నిపుణుల కమిటీలో ఏడుగురు తెలుగు, కన్నడలకు ప్రాచీనహోదా కల్పించడానికి ఆమోదముద్ర వేయగా, ఒకరు వ్యతిరేకించారని సోనీ పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించిన 1500 ఏళ్ల చరిత్రను ఆధారంగా చేసుకొనే ప్రాచీనహోదా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఎంతమేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందో తనకు తెలియదనీ, అది తన శాఖ పరిధిలోకి రాదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు రావడానికీ, యూజీసీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విశిష్ట విద్యా కేంద్రాలను (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేసుకోడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలుగు, కన్నడంతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నాలుగు భాషాలకు ప్రాచీనహోదా లభించినట్త్లెందని పేర్కొన్నారు. ఇంతకుముందు సంస్కృతం, తమిళంలకు ఈ గుర్తింపు లభించింది.

కేబినెట్‌ చర్చించలేదు:

ప్రాచీనహోదా అంశంపై ఇంకా కేబినెట్‌లో చర్చించలేదని అంబికా సోనీ తెలిపారు. శనివారంలోగా కేబినెట్‌ సమావేశం జరిగే అవకాశం లేనందున ప్రధానమంత్రి ప్రత్యేక అనుమతితో ఈ ప్రకటన చేసినట్లు చెప్పారు. కేబినెట్‌ ఆమోదం తర్వాతే ఇది పార్లమెంటుకు వెళుతుందన్నారు. తెలుగుకు ప్రాచీన హోదాపై రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ హర్షం వ్యక్తంచేశారు.

Courtesy: ఈనాడు
*****

Evidence collected to show that Telugu enjoyed a literary history of over 2,000 years

MISSION ACCOMPLISHED: A.B.K. Prasad, Chairman of Official Language Commission, displaying a rare marble piece depicting the ancient Telugu literature.

HYDERABAD: The announcement by the Centre according classical status to Telugu climaxes four years of relentless efforts made by the State government, particularly the State Official Languages Commission (SOLC).

In the case of Telugu, the SOLC worked hard for several months to collect evidence to show that Telugu, indeed, enjoyed a literary history of over 2,000 years.

It delved into records and took photographs of several edicts as historical evidence and submitted the claim before the seven-member “Linguists’ Committee” of the Ministry of Culture.

The committee which has two Telugu experts as members -- Bh. Krishnamurthy, former Vice-Chancellor, University of Hyderabad, and K. V. Subba Rao of Delhi University -- first deferred its decision but finally had to yield, going by the list of evidences which included Bhattiprolu, Addanki and Dhannajaya edicts and ancient coins of Kotilingala and Singavaram.

YSR happy

Chief Minister Y. S. Rajasekhara Reddy said Telugu was the sweetest and the best among the languages and expressed happiness that it had finally secured what was due to it a day before the State Formation Day. He thanked Prime Minister Manmohan Singh, UPA chairperson Sonia Gandhi and Union Minister of Culture Ambika Soni for the decision.

A.B.K. Prasad, chairman, SOLC, who rushed to the Chief Minister soon after the announcement in New Delhi, said Andhra Pradesh and Karnataka too would get a grant of Rs 100 crore each to develop their respective languages.

‘Ultimate victory’

TDP president N. Chandrababu Naidu described the classical status accorded to Telugu as the ultimate victory of Telugu people.

APCC president D. Srinivas hailed the decision, thanking the Prime Minister and the UPA chairperson for the gesture.

State CPI (M) secretary B.V. Raghavulu also welcomed the decision.

Political parties and literary organisations, including Lok Satta and Telangana Rachaithala Vedika, also welcomed the Centre’s decision.

Courtesy: The Hindu


Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, October 22, 2008

India's First Lunar Mission launched from Andhra Pradesh


నింగికెగిరిన చంద్రయాన్‌-1
సంపూర్ణ ఫలితానికి 8 వరకూ ఆగాల్సిందే
శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
ఇతర దేశాల నుంచీ ప్రశంసలు
శ్రీహరికోట, నెల్లూరు- న్యూస్‌టుడే


ప్రపంచం మొత్తం ఆసక్తిగా మనవైపే చూస్తున్నవేళ.. గగనమంతా కరిమబ్బులు పందిళ్లు వేసినట్లు ఉన్న సమయాన.. సన్నని జల్లులే అక్షింతలైన శుభతరుణంలో.. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తన అవిరళకృషితో భారతావని కీర్తిని అంతరిక్ష చిత్రపటంలో ఆ'చంద్ర'తారార్కం చేసింది. భారతీయుల ప్రతిష్ఠను చందమామ నుంచి చాటేందుకు సిద్ధమైన చంద్రయాన్‌-1 ఉపగ్రహాన్ని తీసుకొని ప్రయోగ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ సి-11 బుధవారం ఉదయం 6.22 గంటలకు వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో చంద్రుడి మీదకు యాత్ర చేపట్టిన ఆరో దేశంగా భారత్‌ అవతరించింది. ఉరుములు, వర్షం మంగళవారం సాయంత్రం నుంచి శాస్త్రవేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే బుధవారం ఉదయానికల్లా వరుణుడు కరుణించాడు. దీంతో ప్రయోగాన్ని చేపట్టారు.

ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 255 కి.మీ.ల పెరిజి (భూమికి అతి దగ్గరగా ఉండే బిందువు).. 22,860 కి.మీ.ల అపోజి (భూమికి అతి దూరంగా ఉండే బిందువు)తో ఉన్న దీర్ఘవృత్తాకార భూకక్ష్యలోకి 1,380 కేజీల చంద్రయాన్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సి-11 విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో 49 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగిన చంద్రయాన్‌-1లోని తొలి దశ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

రెండోదశలో చంద్రయాన్‌ ఉపగ్రహం భూకక్ష్యను విడతలవారీగా పెంచుకొంటూ వెళ్లి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మూడోదశలో చంద్రుని చుట్టూ 100 కి.మీ.ల దూరంలో రెండేళ్లపాటు పరిభ్రమించేలా చంద్రయాన్‌ ఉపగ్రహ కక్ష్యలను నియంత్రిస్తారు. ఇందుకోసం ఉపగ్రహంలో ఉన్న లిక్విడ్‌ అపోగీ మోటార్‌ (లామ్‌)ను అవసరమైన సమయంలో పేలుస్తారు. అనంతరం ఉపగ్రహంలోని 11 ప్రయోగ పరికరాలను పనిచేసేలా చేస్తారు. దీంతో చంద్రయాన్‌ ఉపగ్రహం పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం నవంబరు 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పనిని ఇస్రోకు చెందిన టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) చేపడుతుంది. నవంబర్‌ 8 తరువాత చంద్రయాన్‌-1 నుంచి వచ్చే సంకేతాలను బెంగళూరుకు సమీపంలోని బ్యాలాలులో ఉన్న డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌) చేపడుతుంది.

1,380 కేజీల చంద్రయాన్‌ ఉపగ్రహంలో 880 కేజీల ఇంధనాన్ని నింపారు. ఇందులో సుమారు 760 కేజీల ఇంధనాన్ని ఉపయోగించుకొని ఉపగ్రహం భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలోకి చేరుకోగలుగుతుంది. చంద్రుని కక్ష్యలోకి చేరే సమయానికి ఉపగ్రహంలో సుమారు 100 నుంచి 120 కేజీల ఇంధనం మాత్రమే మిగులుతుంది. ఇది చంద్రుని చుట్టూ పరిభ్రమించే సమయంలో ఉపగ్రహాన్ని నియంత్రించేందుకు ఖర్చవుతుంది.

చంద్రయాన్‌-1 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించడంతో షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. చంద్రయాన్‌-1.. భారతీయులకు ఓ మధుర జ్ఞాపకమని ఇస్రో ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రయాన్‌-1 ప్రాజెక్టు డైరెక్టర్‌ మైలస్వామి అన్నాదురై మాట్లాడుతూ.. ''మా బేబీ జాబిలి దిశగా పయనం ఆరంభించింది'' అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కూడా ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించాయి. రూ.386 కోట్లతో చేపట్టిన చంద్రయాన్‌-1.. ఇప్పటి వరకూ చేపట్టిన అంతరిక్ష యాత్రలన్నింటిలోకి అత్యంత చౌకైనదిగా భావిస్తున్నారు. చంద్రయాన్‌-1 తొలిసారిగా చంద్రుడి త్రీడీ మ్యాప్‌లు తయారుచేస్తుంది.
Courtesy: ఈనాడు
*****

Hyderabad, Oct 22 (IANS) Andhra Pradesh Chief Minister Y.S. Rajasekhara Reddy Wednesday congratulated Indian space scientists on the successful launch of the country’s first unmanned moon mission Chandrayaan-I. The chief minister, in his congratulatory message to Indian Space Research Organisation (ISRO) chief Madhavan Nair, said it was a truly historic moment for the entire country and “more so for Andhra Pradesh since it is from our soil that the Chandrayaan-I lifted off successfully”.

“I wholeheartedly congratulate all the space scientists and all others connected with the Chandrayaan-I mission. The whole nation is proud of you all today as India enters the moon club.”

Wednesday morning’s launch was a historic and momentous event, he said.

“I am happy that the launch was perfect and precise. With this, we have completed the first leg of the mission and it will take 15 days to reach the lunar orbit.”

The chief minister hoped that the mission will help Indian scientists locate He-3, which has the potential to produce a large amount of energy. The scientists hope to transport it to the earth to run nuclear plants.

The 44.4-metre-tall, 316-tonne rocket, Polar Satellite Launch Vehicle (PSLV-C11), had a copybook launch at 6.22 a.m. from Sriharikota in Andhra Pradesh Wednesday morning and completed its mission by placing Chandrayaan-1 into its scheduled orbit around the earth within 18 minutes, as planned.

The spacecraft carries 11 scientific instruments, five from India and six from universities and laboratories of the European Space Agency, the US and Bulgaria.

Courtesy: ThaIndian

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, October 19, 2008

Buddhism in Modern Andhra: Literary Representations from Telugu

OUP is providing free access to the first issue of their new journal, which contains the following article:

Velcheru Narayana Rao
Buddhism in Modern Andhra: Literary Representations from Telugu
J Hindu Studies 2008 1: 93-119

http://jhs.oxfordjournals.org/cgi/reprint/1/1-2/93.pdf


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, October 09, 2008

Country’s first women TV channel, in Telugu

HYDERABAD: The Hyderabad-based Rachana Television Private Limited launched the country’s first TV channel devoted exclusively for women on Thursday.

Vanitha TV in Telugu will have all programmes related only to women including health, counselling and discussions on women empowerment and will be beamed across Andhra Pradesh on a 24x7 basis.

The Rachana TV launched by Tummala Narendra Chowdary, also has a 24-hour news channel in Telugu, NTV. It is launching Vanitha just one year after it started its operations. The new channel, which went on air at 5 pm, will be headed by well known writer Volga.

As Chief Editor, Volga believes that the channel will attempt to view the world through a woman’s perspective and will not engage in “gender politics”.

Courtesy: IndianExpress


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


AsiaNet lauches Telugu Entertainment Channel 'Sitara' in Andhra Pradesh

Asianet Television Network, a South India-based infotainment group, has made announcement about the launching of its Telugu entertainment channel ‘Sitara’ in Andhra Pradesh. 

Mr. Vijay Babu, Asianet Chief Operating Officer, said that the media Group would also launch a 24-hour news channel in the state by next month (Nov 2008).

Sitara will have a two-phase roll-out. During the initial phase of launching, the channel will air in-house content and blockbuster movies, whereas second part would see replacement of prime time films with soaps and reality shows. 

Mr. Babu also said that Sitara offers superior content supported by over a decade of experience in the South Indian market. 

“Andhra Pradesh viewers have traditionally been great admirers of cinema. It has always been an important quotient of television programming. Sitara has been aggressively acquiring new blockbuster and old favourites and has an impressive library to its credit,” he added. 

Sitara will be available on Hathway Cable & Datacom, which has a major presence in Hyderabad, and other cable networks. 

“We have signed up with Hathway for distribution. Within 20-30 days, we will reach across the whole of Andhra Pradesh. We have also done distribution deals for our upcoming news channel,” avers Babu.

Mr. Babu also said that the Group has also decided to increase its foothold in other southern states. 

Founded in Kerala over 18 years ago, Asianet is one of the first satellite television channels. It has Malayalam and Kannada entertainment channels.

Courtesy: TopNews


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'